- Home
- Entertainment
- రజినీకాంత్ కు అనిరుధ్ చాలా దగ్గర బంధువువని మీకు తెలుసా..? తలైవాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమౌతాడంటే..?
రజినీకాంత్ కు అనిరుధ్ చాలా దగ్గర బంధువువని మీకు తెలుసా..? తలైవాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమౌతాడంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ కు తమిళ యంగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చాలా దగ్గర బంధువని మీకు తెలుసా..? అసలు వీరిద్దరి మధ్య బంధుత్వం ఏంటీ..?

సూపర్ స్టార్ జైలర్ సినిమాకు అదరిపోయే మ్యూజిక్ అందించాడు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్. తలైవా ఎలివేషన్ సీన్స్ కు అనిరుధ్ మ్యూజిక్ తోడై.. సినిమా సెన్సేషన్ అయ్యింది. వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న తలైవాకు.. సూపర్ కమ్ బ్యాక్ రావడంతో పాటు.. విమర్షిస్తున్నవారి నోర్లు కూడా మూత పడ్డాయి.
అయితే నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రజినీకాంత్ - అనిరుధ్ లకు సంబంధించిన ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రజనీకాంత్, అనిరుధ్ మధ్య ఉన్న అనుబంధం గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి..? ఇద్దరు అంత దగ్గరి బంధువులు అవుతారా..? రజనీకాంత్ కు అనురుధ్ వరుసకు ఏమౌతారు.
వీరిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో ఇటీవల జైలర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో ఆడియన్స్ కు తెలిసింది. ఎవరైనా ఎంత మేలు చేసినా.. సూపర్ స్టార్ మెచ్చుకోవడం.. షేక్ హ్యాండ్ ఇవ్వడం కామన్ గా జరిగే పనే. కాని ఈ ఈవెంట్ లో అనిరుధ్ రవిచందర్ ను రజనీ కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. అటు అనిరుథ్ కూడా రజినీసినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి మ్యూజిక్ చేశాడు.
మ్యూజిక్ చేయడంతో పాటు.. ప్రీరిలీజ్ లో అనిరుధ్ ఎక్కడా ఇవ్వని విధంగా పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ టైమ్ లో కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన స్టేజ్ ఫర్మామెన్స్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హుకుం పాటకు అనిరుథ్ స్టేజీ మీద ఊగిపోతూ డ్యాన్స్ చేయడం అభిమానులతో పాటుగా తలైవాని కూడా మెప్పించింది.
రజనీకాంత్ కోసం అలాంటి పర్‌ఫార్మన్స్ చేయడంతో సంగీత దర్శకుడు ఆయనకు వీరాభిమాని అని అందరూ భావించారు. అయితే అనిరుధ్ రజినీకి అభిమానిమాత్రమే కాదని వారి మధ్య అంతకుమించిన అనుబంధం.. చాలా దగ్గరి బంధుత్వం ఉందనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఈవిషయమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అసలు విషయం ఏంటంటే.. అనిరుధ్ రవిచందర్య ఎవరో కాదు.. రజినీకాంత్ కు స్వయానా అల్లుడు. అంటే రజనీకాంత్ భార్య లతకు స్వయానా మేనల్లుడు.. అంటే లత స్వయానా తమ్ముడైన తమిళ యాక్టర్ రవి రాఘవేంద్రకు కుమారుడు. సూపర్ స్టార్ ఫ్యామిలీకి అనిరుధ్ అంత దగ్గరి బంధువు అన్న సంగతి చాలా మందికి తెలియదు.
తన కళ్ళ ముందే పెరిగి పెద్దయిన అనిరుధ్ అంటే రజినీకి ప్రత్యేక అభిమానం. అనిరుధ్ ను ఎత్తుకొని ముద్దు చేస్తున్న ఫోటోలు, పలు సందర్భాల్లో ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుబాటులో ఉన్నాయి. గతంలో రజినీకాంత్ నటించిన 'పేట', 'దర్బార్' చిత్రాలకు అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలు ఆశించిన విజయాలు సాధించినప్పటికీ, మ్యూజిక్ పరంగా అలరించాయి.