MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • 2025లో 100 కోట్లు వసూలు చేసిన కోలీవుడ్‌ మూవీస్‌..`కుబేర`, `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ`, `డ్రాగన్‌`

2025లో 100 కోట్లు వసూలు చేసిన కోలీవుడ్‌ మూవీస్‌..`కుబేర`, `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ`, `డ్రాగన్‌`

ధనుష్‌ హీరోగా నటించిన `కుబేర` మూవీ తాజాగా వంద కోట్ల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ లో 2025లో వంద కోట్లు సాధించిన చిత్రాలేంటో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 25 2025, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2025 కోలీవుడ్‌లో వంద కోట్ల చిత్రాలు
Image Credit : X

2025 కోలీవుడ్‌లో వంద కోట్ల చిత్రాలు

2025లో చాలా వరకు మంచి సినిమాలు వస్తున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని చిత్రాలు నిరాశ పరిచినా, చాలా వరకు మంచి విజయాలు సాధిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌ మూవీస్‌ ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తున్నాయి. 

ఇక ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఆరు నెలలు తమిళ సినిమాల్లో చిన్న చిత్రాలు సత్తా చాటాయి. తాజాగా ధనుష్‌ నటించిన `కుబేర` మూవీ వసూళ్ల పరంగా మంచి ఆదరణ పొందింది. 

ఇది ఇప్పుడు వంద కోట్లు దాటింది. మరి ఈ సందర్బంగా ఈ ఏడాది వంద కోట్లు దాటిన తమిళ చిత్రాలెన్నో చూద్దాం.  ఇందులో క్రేజీ చిత్రాలుండటం విశేషం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`పట్టుదల` మొదటి వంద కోట్ల మూవీ, కానీ డిజాస్టర్‌
Image Credit : our own

`పట్టుదల` మొదటి వంద కోట్ల మూవీ, కానీ డిజాస్టర్‌

2025లో మొదటి 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా `విడముయర్చి`(పట్టుదల). మగిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్, త్రిష, అర్జున్, ఆరవ్ నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలైంది. లైకా ఈ సినిమాను నిర్మించింది. అనిరుధ్ సంగీతం అందించారు. 

ఈ సినిమా రూ. 137 కోట్లు వసూలు చేసినా, ఈ ఏడాది అతిపెద్ద ఫ్లాప్ సినిమాగా నిలిచింది. 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దాదాపు 100 కోట్లు నష్టాన్ని మిగిల్చింది.  ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్‌గా ఈ మూవీ వచ్చింది. 

Related Articles

Related image1
అల్లు అర్జున్‌, అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. బన్నీ మూడు నెలలు అక్కడే
Related image2
ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే పవన్‌ కళ్యాణ్‌ ఇంట్లో ఆమెకి భయపడాల్సిందే.. ఎవరా రూలర్‌ ?
35
`డ్రాగన్‌`తో సర్‌ప్రైజ్‌ చేసిన ప్రదీప్‌ రంగనాథన్‌
Image Credit : our own

`డ్రాగన్‌`తో సర్‌ప్రైజ్‌ చేసిన ప్రదీప్‌ రంగనాథన్‌

`లవ్ టుడే` సినిమా విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా `డ్రాగన్`. ఏజీఎస్ ఈ సినిమాను నిర్మించింది. ప్రదీప్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్, కాయాదు లోహర్ నటించారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. 

ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ హిట్ డ్రాగన్. రూ.37 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఫేక్‌ సర్టిపికేట్స్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

45
`గుడ్ బ్యాడ్‌ అగ్లీ`తో రచ్చ చేసిన అజిత్‌
Image Credit : Social Media

`గుడ్ బ్యాడ్‌ అగ్లీ`తో రచ్చ చేసిన అజిత్‌

2025లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల్లో అజిత్ `గుడ్ బ్యాడ్ అగ్లీ` ఒకటి. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. అజిత్ తో పాటు అర్జున్ దాస్, త్రిష, ప్రియా వారియర్ నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

 ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా రూ. 240 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా `గుడ్ బ్యాడ్ అగ్లీ` నిలిచింది. అజిత్‌కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇందులో అజిత్‌ వింటేజ్‌ లుక్‌లో కనిపించారు. ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇచ్చారు. 

55
`కుబేర`తో ధనుష్‌ మళ్లీ ఫామ్‌లోకి
Image Credit : instagram

`కుబేర`తో ధనుష్‌ మళ్లీ ఫామ్‌లోకి

ఇక తాజాగా ధనుష్‌ నటించిన `కుబేర` కూడా చేరింది. మంగళవారంతో ఈ చిత్రం వంద కోట్ల కలెక్షన్లని దాటింది. ధనుష్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. 

నాగార్జున, రష్మిక మందన్న ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూన్ 20న విడుదలైన కుబేరా ఐదు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది.

 అయితే ఇది తెలుగు మూవీగానే ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ చిత్రానికి తమిళంలో చాలా తక్కువ వసూళ్లని రాబట్టింది. ధనుష్‌ హీరోగా అక్కడ తక్కువ కలెక్షన్లు రావడం షాకిస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Recommended image2
Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?
Recommended image3
Horror Movies: ఈ 5 సినిమాలు చూస్తే రాత్రి ఒంటరిగా నిద్రపోవడం కష్టమే.. ఒక్కో సీన్‌కి వణుకు పక్కా
Related Stories
Recommended image1
అల్లు అర్జున్‌, అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. బన్నీ మూడు నెలలు అక్కడే
Recommended image2
ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే పవన్‌ కళ్యాణ్‌ ఇంట్లో ఆమెకి భయపడాల్సిందే.. ఎవరా రూలర్‌ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved