తెలుగు సినిమాలలో అరవ హీరోల విలనిజం...నువ్వా నేనా అంటూ హోరా హోరీ పోరు..
రాను రాను టాలీవుడ్ సినిమాల్లో విలనిజం స్టైల్ మారిపోతోంది. ఒకప్పుడు ఏజ్ బార్ ఆర్టిస్ట్ లు... ఆతరువాత ముంబయ్ ఆర్టిస్ట్ లు తెలుగు సినిమాల్లో విలన్స్ గా ఉండేవారు కాని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగామారిపోయింది.

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేయాలంటే ఏజ్ బార్ అయిన సీనియర్ ఆర్టిస్టిస్ట్ లు ఉండేవారు. లేదంటే విలన్ పాత్రకోసమే ప్రత్యేకంగా కైకాల లాంటి వారు ఉండేవారు.. ఆతరువాత ట్రెండ్ మారిపోయి ముంబై ఆర్టిస్టులను ఎక్కువగా పిలిపించేవారు. అలా పవర్ఫుల్ ప్రతినాయకుల జాబితాను తీసుకుంటే, ముంబై విలన్లు చాలామందే కనిపిస్తారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలే విలన్ అవతారాలు ఎత్తుతున్నారు.
కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. తెరపై హీరోలను మించిన హ్యాండ్సమ్ విలన్స్ తయారు అయ్యారు. అంతే కాదు సీనియర్ హీరోలంతా ఇప్పుడు విలన్ అవతారాలు ఎత్తుతున్నారు.యంగ్ హీరోలు కూడా విలన్ పాత్రలు చేయడానికి మోగ్గు చూపిస్తున్నారు. మన టాలీవుడ్ లో నవీన్ చంద్ర, కార్తికేయ, లాంటి వారు హీరోలుగా.. విలన్లు గా దూసుకుపోతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ మధ్య తమిళ స్టార్ హీరోలు మన తెలుగు తెరపై విలనిజం చూపించడానికి ఎక్కువగా ఆరాటపడుతున్నారు. సీనియర్ హీరోలుగా చెలామణి అవుతున్నచాలామంది ఇక్కడ పవర్ఫుల్ విలన్స్ గా జెండా ఎగరేస్తున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కూడా చేయరబోతున్నట్ట తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ సినమాల విక్రమ్ స్టైలీష్ విలన్ గా కనిపించబోతున్నట్టు సమాచారం.
ఇక ఇప్పటికే చాలామంది తమిళ హీరోలు తెలుగు తెరపై విలనిజం చూపిస్తున్నారు. రీసెంట్ ఇయర్స్ లోనే హీరోగా స్టార్ డమ్ అందుకున్న తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అటు క్యారెక్టర్ రోల్స్ కూడా స్టార్ట్ చేశాడు. తెలుగులో ఉప్పెన సినిమాతో అద్భుతంగా విలనిజం ప్రదర్శించిన విజయ్.. అటు తమిళంలో మాస్టర్ లాంటి సినిమాల్లో కూడా విలన్ గా మెప్పించాడు.
మరో వైపు సీనియర్ స్టార్ హీరో అర్జున్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ అవతారం ఎత్తాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా స్టార్ డమ్ తో దూసుకుపోతున్నాడు అర్జున్. రీసెంట్ గా రవితేజ ఖిలాడి సినిమాలో విలన్ గా మెప్పించిన అర్జున్.. అంతకు ముందు కూడా నితిన్ లై సినిమాలో స్టైలీష్ విలనిజం చూపించాడు. ఆడియన్స్ ను మెప్పించాడు.
ఇక విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కోలీవుడ్ సీనియర్ స్టైలీష్ హీరో అరవింద స్వామి. తెలుగులో రీసెంట్ ఇయర్స్ లో రామ్ చరణ్ ద్రువ లో హ్యాండ్సమ్ విలన్ గా మెప్పించాడు అరవింద స్వామి. అటు తమిళ్ లో కూడా కొన్ని విలన్ పాత్రలు చేస్తున్నాడు. ఇటు టాలీవుడ్ లో కూడా అవకాశాల ఆయన్ను చేరుతున్నాయి.
ఇక ఇటు టాలీవుడ్ లో కూడా స్టైలీష్ ఫ్యామిలీ సీనియర్ హీరోలుగా మంచి క్రేజ్ ఉన్న ఉన్న స్టార్స్ విలన్ అవతారాలు ఎత్తారు. ఆ లిస్ట్ లో జగపతిబాబు ఎప్పుడో చేరిపోయారు. ఇక ఇప్పుడు రీసెంట్ గా స్టార్ విలన్ కేటగిరిలోకి హీరో శ్రీకాంత్ కూడా చేశారు. అఖండాలో వరదరాజులుగా శ్రీకాంత్ సూపర్ రెస్పాన్స్ సాధించాడు. విలన్ గా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక రాజశేఖర్ కూడా సరైన విలన్ రోల్ కోసం చాలా కాలంగానే ఎదురుచూస్తున్నాడు.