MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ రూపం, జయలలితకు ఎదురెళ్లిన ధైర్యం, విజయ్ కాంత్ గురించి ఈ 10 విషయాలు మీకుతెలుసా..?

రజినీకాంత్ రూపం, జయలలితకు ఎదురెళ్లిన ధైర్యం, విజయ్ కాంత్ గురించి ఈ 10 విషయాలు మీకుతెలుసా..?

తమిళ స్టార్  విజయ్ కాంత్ కన్నుమూశారు. తమిళ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన స్టార్ హీరో  అనారోగ్యంతో బాధపడుతూ..  కరోనా తో మరణించారు.  కెప్టెన్ విజయ్ కాంత్ గా పేరుగాంచిన తమిళ స్టార్ గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం. 

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 28 2023, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Vijayakanth

Vijayakanth

తమిళ స్టార్ హీరో.. విప్లవ నాయకుడు.. డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయ్ కాంత్ కన్ను మూశారు. మరోసారి ఆయన  ఆరోగ్య పరిస్థతి మరోసారి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ కన్ను మూశారు. అయితే విజయ్ కాంత్ కు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.  ఈమధ్యే ఆయన వెరీ సీరియస్ కండీషన్ నుంచి బయటపడ్డారు. తాజాగా మరోసారి విజయ్ కాంత్ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. 
 

212
Vijayakanth

Vijayakanth

1952 ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్‌ కాలేజీ చదువు తరువాత తన తండ్రి నిర్వహిస్తున్న  రైస్ మిల్లులో కూలీగా పనులు చేసేవాడు. అంతే కాదు ఇక్కడ విశేషం ఏంటంటే.. తమిళ సినిమాల్లోకి రాకముందు విజయ్ కాంత్..  రజనీకాంత్ కు వీరాభిమాని.. తలైవా  అభిమాన సంఘం కోశాధికారిగా కూడా పనిచేశారు. 

312
Vijayakanth

Vijayakanth

ఇక మరో విశేషం ఏంటంటే.. విజయ్ కాంత్ అచ్చం రజనీకాంత్‌ లాగే ఉంటాడు అని అనేవారు. అందుకే ఆయన్ను బ్లాక్ రజినీకాంత్ అని పిలుస్తారు. విజయ్ కాంత్ ను రజనీకాంత్ మొదటి సారి చూసినప్పుడు అచ్చం నాలాగే ఉన్నవు అని అన్నాడట. దాంతో విజయ్ కు సినిమాల్లో నటించాలని ఆశ పెరిగింది. పనట్టుదలతో అది సాధించి చూపించాడు. 
 

412
vijayakanth

vijayakanth

రజినీకాంత్ అలా అనడం.. బయట ఉన్నవారు కూడా రజినీకాంత్ లా ఉన్నావు అనేసరికి.. తన అసలు పేరు అయిన  విజయరాజ్‌ కు రజనీకాంత్ లోని కాంత్ ను జోడించి..  విజయకాంత్‌గా మారాడు. తనఫ్రెండ్ ఇబ్రహీం రౌతర్‌తో కలిసి చెన్నైకి చేరుకున్నాడు. సినిమా ప్రయత్నాలు చేసిన  విజయకాంత్ కు తన పట్టుదల కృషి వల్ల  1978 లో మొదటి అవకాశం వరించింది. అప్పటినుంచి తిరిగి చూసుకోకుండా.. తమిళ చిత్రాల్లో నటించడం ప్రారంభించి తమిళనాడు అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగారు విజయ్ కాంత్. 

512

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అన్నట్టుగా నటిస్తారు విజయ్ కాంత్. అతని  యాక్టింగ్, డిఫరెంట్ యాక్షన్, పదునైన స్పీచ్, డైలాగ్  డెలివరీ ఇలా విజయ్ కాంతో లోని ఇన్ని విశేషాలు ఆయన్ను ఇండస్ట్రీలో నిలబెట్టాయి. అభిమానుల్లోకి దూసుకెళ్ళేలా చేశాయి. అంతే కాదు స్టార్ గా ఎదిగిన విజయ్ కాంత్ .. చిన్నదర్శకులు.. పెద్ద దర్శకులు అన్న తేడా లేకుండా అందరిని సమానంగా ఆధరించారు. ప్లాప్ లకుభయపడకుండా... కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. 

612
<p>vijayakanth</p>

<p>vijayakanth</p>

ఇక విజయ్ కాంత్ ఎక్కువగా  పోలీస్ పాత్రలు చేశారు. 25 సినిమాలకు పైగా ఆయన పోలీస్ పాత్రల్లో నటించారు. విజయ్ కాంత్  100వ సినిమా కెప్టెన్ ప్రభాకరన్ సినిమాలో ఆయన నటనకు పూనకాలతో ఊగిపోయారు ఆడియన్స్. దాంతో విజయ్ కాంత్ కుఈసినిమా నుంచి కెప్టెన్ అని బిరుదు వచ్చి చేరింది. అభిమానులు ముద్దుగా కెప్టెన్ విజయ్ కాంత్ అని పిలుచుకో సాగారు. తమిళనాట ఒకానొక టైమ్ లో రజినీకాంత్ కంటే కూడా అత్యధిక అభిమానులు కలిగిన హీరోగా విజయ్ కాంత్ రికార్డ్ కెక్కారు. 

712
remembering actor vijayakanth

remembering actor vijayakanth

విజయకాంత్ తమిళంలో మొత్తం 156 సినిమాల్లో నటించారు. విప్లవ కళాకారుడు కెప్టెన్‌గా ప్రసిద్ధి చెందాడు, అతని 100వ సినిమా కెప్టెన్ ప్రభాకరన్ ఇప్పటి వరకు అతనికి అదే  అభిమాన సినిమా. ఇనిక్కుమ్ ఇహలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ కాంత్.. ఆతరువాత తిరిగి చూసుకోకుండా తమిళ స్టార్ గా ఎదిగాడు. తమిళ సినిమాలో సాహసాలు చేసే హీరోగా విజయ్ కాంత్ కు పేరుంది. 
 

812
Vijayakanth

Vijayakanth

టామ్ క్రూజ్ లాగా హెలికాప్టర్స్ కు వేళ్లాడటం, జంప్ చేసే సీన్లు..పాటలు, డాన్స్ లు.. ఒక్కటేమిటి.. విజయ్ కాంత్ సినిమాల్లో చేసిన ప్రయోగాలు అనీ ఇన్నీ కావు.. డూప్ లేకుండా విజయ్ చేసినయాక్షన్ సీన్స్.. ప్రేక్షకుల్లో ఆయనపై ప్రేమను పెంచాయి. హీరోగా నిలబెట్టాయి. తమిళ చిత్ర పరిశ్రమలో సాహసాలకు బ్రాండ్ అంబాసిడర్ గా, యంగ్ హీరోలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు విజయ్ కాంత్. 

912

హీరోగా ఎంత పేరు సంపాధించారో.. రాజకీయనాయకుడిగా కూడా అంతే పేరును మూటగట్టుకున్నారు విజయ్ కాంత్. సినీ నటుడుగా రాణిస్తూనే డీఎండీకే పార్టీని స్థాపించారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు కూడా. 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. విరుధాచలం, రిషివండియం నియోజకవర్గాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు విజయ్ కాంత్. 
 

1012

ప్రజల సమస్యలపై పోరాటం చేసిన విజయ్ కాంత్ కు విప్లవ నాయకుడు అని ముద్దు పేరు కూడా ఉంది. 2005లో మధురైలో లక్షలాది మంది వాలంటీర్ల మధ్య నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రవిడ కజగం అనే రాష్ట్ర రాజకీయ పార్టీని ప్రారంభించారు. ప్రజలు, దేవుడితోనే పొత్తు ప్రకటించి ఎన్నికలను ఎదుర్కొన్నారు. విజయాంత్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసం కారణంగా,తమిళనాడులో రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆయన ఎదిగారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో వృధాచలం నియోజకవర్గంలో విజయకాంత్ ఒంటరిగా పోటీ చేసి ఓట్ల శాతాన్ని పెంచుకున్నారు. తొలిసారి వ్యక్తిగతంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

1112
DMDK

DMDK

2006 నుండి 2016 వరకు తమిళనాడు శాసనసభ సభ్యునిగా మరియు 2011 నుండి 2016 వరకు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తమిళనాడులో డీఎంకేను, కరుణానిధిని వెనక్కి నెట్టి, శాసనసభలో ప్రతిపక్ష నేతగా గంభీరంగా కూర్చున్న విప్లవకారుడు కెప్టెన్ విజయకాంత్.అసెంబ్లీలో జయలలిత, విజయకాంత్ మధ్య నేరుగా వాగ్వాదం జరిగింది. గెలుపు ఎవరిది అనే వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆ సమయంలో జయలలిత ఆవేశంగా అసెంబ్లీలో విజయకాంత్‌ కు సవాల్ చేశారు. అప్పటి నుంచి విజయ్ కాంత్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు అన్నాడీఎంకేలో చేరడం ప్రారంభించారు. చిరవకు విజయ్ కాంత్ ప్రాణంగా నమ్మిన నటులు అరుణ్ పాండియన్ మరియు ఎం. పా పాండియన్ కూడా అన్నాడీఎంకేలోకి వెళ్ళడంతో విజయ్  కాంత్ కు షాక్ తగిలినట్టు అయ్యింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఆతరువాత విజయ్ కాంత్ పార్టీ కొన్నాళ్లకు డిపాజిట్ కూడా దక్కించుకోలేని స్థితికి వచ్చింది. విజయ్ కాంత్ ఆరోగ్యం దెబ్బతినడంతో.. ఆయన కూడా పార్టీపై పట్టుకోల్పోయారు. 

1212

విజయకాంత్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో. తాను సంపాదించిన డబ్బును తన వద్ద ఉంచుకోకుండా తన చేతనైనంతలో ఇతరులకు సాయం చేసిన రెడ్ హ్యాండెడ్ వ్యక్తి విజయకాంత్. వేయి చేతులు కనుమరుగైనా ఆధావన్ కనుమరుగు కాదన్న మాట ఆయన స్క్రీన్ కెరీర్ లో కాదనలేని వాస్తవం. రాజకీయాల్లో, సినీ, ప్రజాసేవలో నిస్వార్థ నాయకుడిగా ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని నేటి తరాన్ని తన గురించి మాట్లాడుకునేలా చేసిన ఏకైక నటుడు విజయకాంత్. తమిళ చిత్రసీమలో ఎంతమంది నటీనటులు వచ్చి వెళ్లినా.. విజయకాంత్‌కి ఉన్న ఆకర్శణ, మంచితనం..  గోప్ప శక్తి ఇంకెవరికీ లేదన్నది కాదనలేని వాస్తవం. అందుకే ఆయన మరణం లక్షల హృదయాలు శోకించేలా చేస్తుంది. కెప్టెన్ విజయ్ కాంత్ కు అక్షర నివాళి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Don 3 Controversy: డాన్ 3 ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా? రణ్‌వీర్ షరతులే కొంపముంచాయా!
Recommended image2
Bellamkonda Sreenivas: సమంత నుంచి పూజా హెగ్డే వరకు.. తనకన్నా ఏజ్ ఎక్కువున్న హీరోయిన్లతో రొమాన్స్ చేసిన హీరో
Recommended image3
Karthika Deepam 2 Today Episode: బావే నా భర్త- మనసు విప్పిన జ్యో- చెంప పగలకొట్టిన దీప, సుమిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved