మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేశారా?... తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ షాకింగ్ ఆన్సర్!
తమన్నా-విజయ్ వర్మ జంటగా ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి విజయ్ వర్మను ఇబ్బందికర ప్రశ్న అడిగాడు. విజయ్ వర్మ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.

Vijay Varma Tamannaah Bhatia
హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) ప్రేమలో పడ్డారని మీడియా కోడైకూసింది.నటుడు విజయ్ వర్మతో ఆమె సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. 2023 న్యూ ఇయర్ వేడుకలు జంటగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వార్తలను ఖండిస్తూ వచ్చిన తమన్నా ఇటీవల ఓపెన్ అయ్యింది.
Image: Instagram
నిజం దాస్తే దాగేది కాదని ఫైనల్ గా తమన్నా ఒప్పుకుంది. అవును విజయ్ వర్మతో నా రిలేషన్ నిజమేనని కుండబద్దలు కొట్టింది. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు.
కేవలం సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నేను చాలా మంది హీరోలతో పని చేశాను. విజయ్ వర్మ చాలా ప్రత్యేకం. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మాది ఆర్గానిక్ బంధం. నన్ను దెబ్బతీయాలని చూసే వారి నుండి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి విజయ్ వర్మ(Vijay Varma) వచ్చాడు. అతనున్న ప్రదేశమే నాకు ఇష్టమైన ప్రదేశం, అని తమన్నా అన్నారు.
దీంతో విజయ్ వర్మ-తమన్నా బంధంపై ముసుగు తొలిగిపోయింది. వారు డేటింగ్ చేస్తున్నారన్న క్లారిటీ వచ్చింది. ఇక విరామం దొరికితే వీరిద్దరూ విహారాలకు చెక్కేస్తున్నారు. తాజాగా మాల్దీవ్స్ వెళ్లారని సమాచారం. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒకరి తర్వాత ఒకరు కనిపించారు.
vijay varma
మొదట తమన్నా నడుచుకుంటూ వచ్చింది. ఆమెను విజయ్ వర్మ ఎక్కడని మీడియా ప్రశ్నించింది. ఆమె ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అనంతరం విజయ్ వర్మ వచ్చాడు. ఆయన్ని ఒకరు 'మాల్దీవ్స్ లో బాగా ఎంజాయ్ చేశారా? అని అడిగారు. ఆ ఇబ్బందికర ప్రశ్నకు విజయ్ వర్మ అసహనం ఫీల్ అయ్యాడు. ఇలా మాట్లాడటం సరికాదని విజయ్ అన్నారు.
ఇక పెళ్లి ఎప్పుడంటే వీరిద్దరూ స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. మరోవైపు జైలర్(Jailer) మూవీతో తమన్నా భారీ హిట్ కొట్టింది. కెరీర్లో మొదటిసారి రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది తమన్నా. ఈ మూవీ రూ. 650 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అయితే జైలర్ లో తామన్నప్ పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. చిరంజీవితో చేసిన భోళా శంకర్ మాత్రం డిజాస్టర్ అయ్యింది.