MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్రిప్టో కరెన్సీ మోసం కేసు: తమన్నా వెర్షన్ ఇదీ

క్రిప్టో కరెన్సీ మోసం కేసు: తమన్నా వెర్షన్ ఇదీ

Tamannah bhatia : పుడుచ్చేరిలో క్రిప్టో కరెన్సీ మోసంలో సినీ తారలు తమన్నా, కాజల్ అగర్వాల్‌ను విచారించనున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై తమన్నా స్పందిస్తూ తన ప్రమేయం లేదని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 01 2025, 06:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Tamannah bhatia breaks silence on cryptocurrency news in telugu

Tamannah bhatia breaks silence on cryptocurrency news in telugu

Tamannah bhatia :  పుడుచ్చేరిలో భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే . క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ. 2.40కోట్లు వసూలు చేశారు. అయితే ఆఖరకు ఏమీ చెల్లించకుండా చేతులెత్తేశారు.

దీనిపై ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అశోకన్.. కంపెనీ తమను మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పుడుచ్చేరి పోలీసులు.. సినీతారలు తమన్నా, కాజల్ అగర్వాల్ లను విచారించాలని నిర్ణయించారని నిన్నంతా వార్తలు వచ్చాయి.

అయితే ఈ విషయమై తన ప్రమేయం ఏమీ లేదని తమన్నా క్లారిటీ ఇచ్చే  ప్రయత్నం చేసింది.  తనపై వస్త్నున తప్పుడు ఆరోపణలపై తమన్నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 

23
Tamannah bhatia breaks silence on cryptocurrency news in telugu

Tamannah bhatia breaks silence on cryptocurrency news in telugu


 తమన్నా మాట్లాడుతూ.. 'క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో నా ప్రమేయం ఉందని వార్తలు రావడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి నకిలీ, తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రసారం చేయవద్దని మీడియాలోని నా స్నేహితులను అభ్యర్థించాలనుకుంటున్నా.

అలా చేసిన వారిపై తగిన చర్య తీసుకోవడానికి నా టీమ్‌ పనిచేస్తుంది' అని తెలిపింది.కాగా.. క్రిప్టో కరెన్సీ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రూ.కోట్లలో మోసానికి పాల్పడిన కేసులో సినీతారలు తమన్నా, కాజల్‌ అగర్వాల్‌ను విచారించేందుకు పుదుచ్చేరి సైబర్‌ క్రైం పోలీసులు సమన్లు పంపారని ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

33
Tamannah bhatia breaks silence on cryptocurrency news in telugu

Tamannah bhatia breaks silence on cryptocurrency news in telugu

పుదుచ్చేరి లాస్‌పేట్టైకు చెందిన విశ్రాంత ఉద్యోగి అశోకన్‌(70) క్రిప్టో కరెన్సీలో ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రూ.98లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఆయన ఫిర్యాదు మేరకు పుదుచ్చేరి సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి క్రిప్టో కరెన్సీ మోసం ముఠాలోని కోవైకు చెందిన నితీష్‌కుమార్‌ జెయిన్‌ (36), అరవింద్‌కుమాôర్‌(40)ని అరెస్ట్‌ చేశారు.

క్రిప్టో కరెన్సీ మోసం కేసుతో సంబంధం ఉన్నవారు కోవై, మహాబలిపురం, ముంభై తదితరచోట్ల భారీ ఖర్చుతో పార్టీలు నిర్వహించారు. ఇందులో సినీతారలు తమన్నా, కాజల్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నట్లు తెలిసింది. ఇందుకోసం వారికి ఎంత పారితోషికం ఇచ్చారు, ఆ నగదు ఏ బ్యాంకు ఖాతా ద్వారా పంపారు, ఆ ముఠాతో సంబంధాలున్నాయా అన్న కోణంలో తమన్నా, కాజల్‌ను విచారించేందుకు పుదుచ్చేరి సైబర్‌ క్రైం పోలీసులు సమన్లు పంపించారని చెప్తున్నారు. 

 


 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved