- Home
- Entertainment
- లిప్ లాక్ విషయంలో తమన్నాకి ఆ కోరిక ఉందా.. క్రేజీ హీరోపై ఓపెన్ గా హాట్ కామెంట్స్, వైరల్
లిప్ లాక్ విషయంలో తమన్నాకి ఆ కోరిక ఉందా.. క్రేజీ హీరోపై ఓపెన్ గా హాట్ కామెంట్స్, వైరల్
సౌత్ లో గత దశాబ్ద కాలంలో యువతని తన గ్లామర్ తో తమన్నా అలరించినంతగా మరే హీరోయిన్ అలరించలేదు అంటే అతిశయోక్తి కాదు. మిల్కీ బ్యూటీగా తమన్నా అందాలకు యువతలో ఉండే క్రేజ్ వేరు.

సౌత్ లో గత దశాబ్ద కాలంలో యువతని తన గ్లామర్ తో తమన్నా అలరించినంతగా మరే హీరోయిన్ అలరించలేదు అంటే అతిశయోక్తి కాదు. మిల్కీ బ్యూటీగా తమన్నా అందాలకు యువతలో ఉండే క్రేజ్ వేరు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు.
తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో Tamannaah ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సిల్వర్ స్క్రీన్ పై తమన్నా ఎంతలా అందాలు ఒకలబోసినప్పటికీ లిప్ లాక్ కిస్సులకు మాత్రం ఈ బ్యూటీ దూరం. చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని తమన్నా తేల్చేసింది. సినిమా గ్లామర్ ఫీల్డ్ అయినప్పటికీ తనకంటూ కొన్ని హద్దులు పెట్టుకున్నానని తమన్నా పేర్కొంది.
గతంలో లిప్ లాక్ కిస్సులపై తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్ షో గుర్తుందిగా. ఈ షోకి తమన్నా కూడా అతిథిగా హాజరైంది. ఈ షోలో సమంత తమన్నాని కొన్ని చిలిపి ప్రశ్నలు అడిగింది. తమన్నా లిప్ లాక్ సీన్స్ కి దూరం అని తెలిసినా సమంత ఒక ప్రశ్న అడిగింది.
తప్పనిసరిగా సినిమాలో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తావు అని సుమంత ప్రశ్నించింది. దీనికి తమన్నా సిగ్గు పడుతూ.. ఒక వేళ అలాంటి సీన్ లో నటించాల్సి వస్తే అది విజయ్ దేవరకొండతోనే అని తేల్చేసింది. ఈ రౌడీ అండ్ రొమాంటిక్ హీరో మిల్కీ బ్యూటీని అంతలా మాయ చేసినట్లు ఉన్నాడు.
లైగర్ రిలీజ్ ముందు వరకు విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ కి చేరింది. కానీ లైగర్ ఊహించని డిజాస్టర్ కావడంతో అంతా తలక్రిందులు అయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కి సాలిడ్ కంబ్యాక్ అవసరం. తమన్నా చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది.
ఆ మూవీలో తమన్నా కొన్ని సన్నివేశాల్లో బాబీ గెటప్ లో కనిపించడంతో విమర్శలు ఎదురయ్యాయి. అంతటి అందాల మిల్కీ బ్యూటీని అబ్బాయిగా చూపించారు అంటూ ఫాన్స్ నిరాశ చెందారు. ప్రస్తుతం తమన్నా హిందీలో బబ్లీ బౌన్సర్ అనే చిత్రంలో నటిస్తోంది.