- Home
- Entertainment
- ఎర్ర చీరలో ఘాటెక్కిన తమన్నా అందాలు.. కట్టిపడేస్తున్న మిల్కీ బ్యూటీ నయా లుక్స్.. చూస్తే వాహ్ అనాల్సిందే
ఎర్ర చీరలో ఘాటెక్కిన తమన్నా అందాలు.. కట్టిపడేస్తున్న మిల్కీ బ్యూటీ నయా లుక్స్.. చూస్తే వాహ్ అనాల్సిందే
తమన్నా జోరు నడుస్తుంది. బాలీవుడ్‌లో ఈ బ్యూటీ దూకుడుమీదుంది. వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తీరిక లేకుండా సందడి చేస్తుంది. నెటిజన్లకి అందాల విందు వడ్డిస్తుంది.

తమన్నా(Tamannaah) తన సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా సందడి చేస్తుంది. ముంబయిలో చక్కర్లు కొడుతూ కనువిందు చేస్తుంది. తాజాగా రెడ్ శారీలో హోయలు పోయింది మిల్కీ బ్యూటీ. చీరకట్టులో(Tamanna Saree Look) వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లని కట్టిపడేస్తుంది. ఎర్రని చీరలో తమన్నా అందాలు ఘాటెక్కినట్టుగా ఉండటం విశేషం.
అదే సమయంలో ఆమె క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. చీరలో హాట్, క్యూట్ మేళవింపుగా ఉండటం విశేషం. ప్రస్తుతం తమన్నా చీరలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆమె అభిమానులను, నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
తమన్నా ఇటీవల `బబ్లీ బౌన్సర్` (Babli Bouncer) చిత్రంలో నటించింది. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో ఇంకా పాల్గొంటూ సందడి చేస్తుంది. సోమవారం రాత్రి ముంబైలో ఈ సినిమా స్పెషల్ షో వేశారు. ఇందులో తమన్నా పాల్గొంది. రెడ్ శారీలో కనిపించి వాహ్ అనిపించింది.
మరోవైపు తమన్నా రితేష్ దేశ్ ముఖ్‌తోపాటు కలిసి `ప్లాన్ ఏ ప్లాన్ బీ`లో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లోనూ బిజీగా ఉంది తమన్నా. వరుసగా మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూలిస్తూ, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ హల్‌చల్ చేస్తుంది.
ట్రెండీ వేర్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. రోజుకు రెండు మూడు రకాల ఫ్యాషన్ వేర్‌లో మెరుస్తూ హైలైట్‌గా నిలుస్తుంది.సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె గ్లామర్ ఫోటోలు అభిమానులకు పండగ తీసుకొస్తున్నాయి.
తమన్నా ఇటీవల `ఎఫ్3`తో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ప్రస్తుతం ఆమె చిరంజీవితో `బోళాశంకర్` చిత్రంలో నటిస్తుంది. అలాగే `గుర్తుందా శీతాకాలం` రిలీజ్‌కి ఉంది. అనేకసార్లు వాయిదా పడుతూ వస్తోందీ చిత్రం. మరోవైపు బాలీవుడ్‌లో `బోల్‌చుడియన్` చిత్రంలో నటిస్తుంది తమన్నా.
`బబ్లీ బౌన్సర్` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తమన్నా ఎర్ర చీరలో మెరిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి. వైరల్ అవుతున్నాయి.
`బబ్లీ బౌన్సర్` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తమన్నా ఎర్ర చీరలో మెరిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి. వైరల్ అవుతున్నాయి.