- Home
- Entertainment
- దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ.. తమన్నా ఆస్తుల విలువెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ.. తమన్నా ఆస్తుల విలువెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
మిల్కీ బ్యూటీ స్టార్ హీరోయిన్లలో ఒకరు. సుధీర్ఘమైన కెరీర్‌ని కొనసాగిస్తున్న నటి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పారితోషికం, ఆస్తుల విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.

తమన్నా భాటియా(Tamannaah Bhatia) టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. కాజల్, అనుష్క వంటి హీరోయిన్లతోపాటు రాణించి లాంగ్ కెరీర్‌ని కొనసాగిస్తున్న నటి. సినిమా ఫలితం ఎలా ఉన్నా తమన్నా క్రేజ్ ఏ రోజు తగ్గలేదు. మరింత పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ నేడు(డిసెంబర్ 21) తన 33వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. Tamannaah Birthday.
తమన్నా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకి సంబంధించిన ఆస్తుల వివరాలు, పారితోషికం విషయాలు, లగ్జరీ కార్లు, బిజినెస్ వివరాలు, ఫ్యామిలీ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా తమన్నా తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇటీవల `గుర్తుందా శీతాకాలం`, `ఎఫ్3` చిత్రాలతో తెలుగులో మెరిసింది. మరోవైపు హిందీలో సినిమాలు చేస్తుంది. మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఒక్కో సినిమాకి తమన్నా తీసుకునే పారితోషికం వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఈ బ్యూటీ రెండు నుంచి రెండున్నర కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందట. అలాగే అడపాదడపా ఐటెమ్ సాంగ్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. స్పెషల్ సాంగ్‌లకు ఆమె రూ.50లక్షలు వసూలు చేస్తుందని సమాచారం. అలాగే యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తే 70లక్షల వరకు డిమాండ్ చేస్తుందట.
ఈ లెక్కన తమన్నా ఏడాదికి సుమారు రూ.15కోట్ల వరకు సంపాదిస్తుందట. సినిమాలు, ఇతర యాడ్స్ నుంచి వ్యాపారాలకు సంబంధించిన ఆదాయం కలిపితే తమన్నా ఏడాది ఆదాయం ఇదని తెలుస్తుంది. తమన్నా జూవెల్లరి షోరూమ్స్ ని నిర్వహిస్తుంది. హైదరాబాద్‌తోపాటు, ముంబయిలో ఈ స్టోర్స్ ఉన్నాయట. తమ నాన్న జూవెల్లరి వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో తాను కూడా అదే రంగంలోకి వ్యాపారంలోకి దిగిందని టాక్. దీని ద్వారా కూడా బాగానే సంపాదిస్తుందట ఈ మిల్కీ బ్యూటీ.
Tamannaah
ఇంకోవైపు లగ్జరీ ఇళ్లు, కార్లు కూడా ఈ అమ్మడి చెంత ఉన్నాయి. ముంబయిలో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ఉందట. ముంబయిలోని వెర్సోవా ఏరియాలో ఇళ్లు ఉందని తెలుస్తుంది. దీని విలువల రూ.20కోట్లు ఉంటుందని టాక్. తమన్నాకి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వాటిలో యాభై లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ 3 సిరీస్ కారు, 75లక్షల విలువ చేసే ల్యాండ్ రోవర్ డస్కవరీ కారు, ముప్పై లక్షల విలువైన మిట్సుబిషి ఔట్‌లాండర్ కారు, 15లక్షల విలువైనా మహింద్రా ఎక్స్ యువీ 500 కార్లు ఉందని సమాచారం.
ఇలా మొత్తంగా తాను సంపాదించిన ఆస్తులు విలువ ఏకంగా రూ.110 నుంచి 120కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. (ఇది సోషల్ మీడియాలో, నెట్‌లో ఉన్న సమాచారం. ఊహాజనితం మాత్రమే). మొత్తంగా మంచి ఫామ్ లో ఉండగానే కాసిన్ని రాళ్లు వెనకాలు వేసుకుంటుంది. వాటిని పెంచుకుంటుంది తమన్నా.
ఇదిలా ఉంటే మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ తమన్నా `బంద్రా` అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిలీప్ కుమార్ సరసన తమన్నా నటిస్తుంది. ఈ బ్యూటీ బర్త్ డే సందర్భంగా నేడు సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్`లో నటిస్తుంది తమన్నా.