- Home
- Entertainment
- వరుసగా 4 ఫ్లాపులతో కెరీర్ ప్రారంభించి రూ.120 కోట్లు సంపాదించిన హీరోయిన్.. టాలీవుడ్ ని ఊపేసింది
వరుసగా 4 ఫ్లాపులతో కెరీర్ ప్రారంభించి రూ.120 కోట్లు సంపాదించిన హీరోయిన్.. టాలీవుడ్ ని ఊపేసింది
తొలి చిత్రంలోనే ప్రాధాన్యత దక్కించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఒక క్రేజీ హీరోయిన్ వరుసగా 4 ఫ్లాప్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీని ఊపేసే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

టాలీవుడ్ లో చాలా మంది నటీమణులు స్టార్ హీరోయిన్లుగా ఎదిగి సత్తా చాటారు. అందం అభినయంతో పాటు కాస్త అదృష్టం ఉంటే మంచి అవకాశాలు దక్కించుకోవచ్చు. నటించిన తొలి చిత్రమే విజయం సాధిస్తే ఆ హీరోయిన్ ఇండస్ట్రీ దృష్టి మొత్తం పడుతుంది. అందుకే తొలి చిత్రంలో మంచి రోల్ దొరకాలని గ్లామర్ పరంగా, నటన పరంగా ప్రాధాన్యత ఉండాలని హీరోయిన్లు కోరుకుంటారు.
తొలి చిత్రంలోనే ప్రాధాన్యత దక్కించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఒక క్రేజీ హీరోయిన్ వరుసగా 4 ఫ్లాప్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీని ఊపేసే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాదు ఏకంగా 120 కోట్ల వరకు ఆస్తులు సంపాదించుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా.
తమన్నా తెలుగులో నటించిన మొదటి చిత్రం శ్రీ. మంచు మనోజ్ సరసన నటించింది. 2005లో ఈ చిత్రం రిలీజ్ అయ్యే టైంకి తమన్నా ఎవరో కూడా ఎవరికీ తెలియదు. అదే ఏడాది తమన్నా హిందీలో చాంద్ షా రోషన్ చెహ్రా అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలో ప్రయత్నించింది. తమిళంలో కేడి, వియబారి అనే చిత్రాల్లో నటించగా అన్నీ డిజాస్టర్ అయ్యాయి. అయినా తమన్నా వెనుకడుగు వేయలేదు.
శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రమే తమన్నా కెరీర్ ని మలుపు తిప్పింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నా యువతకి క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత తమన్నా తాను నటించిన చిత్రాల్లో గ్లామర్ డోస్ పెంచి మరింతగా యువతని ఆకట్టుకుంది. 100 పర్సెంట్ లవ్, రచ్చ లాంటి చిత్రాలు తమన్నా ఇమేజ్ ని తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తమన్నాకి అవకాశాలు వచ్చాయి. రాంచరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోలతో రొమాన్స్ పండించింది. కొన్నేళ్లు తమన్నా తన క్రేజ్ తో టాలీవుడ్ ని ఊపేసింది అని చెప్పొచ్చు.
తమన్నా తన రెమ్యునరేషన్ తో ఏకంగా 120 కోట్ల వరకు ఆస్తులు సంపాదించిందట. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. నటుడు విజయ వర్మతో కలసి తమన్నా సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.