MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విరాట్ కోహ్లితో డేటింగ్, రొమాన్స్ పై తమన్నా వివరణ

విరాట్ కోహ్లితో డేటింగ్, రొమాన్స్ పై తమన్నా వివరణ

విరాట్ కోహ్లీ తమన్నా భాటియాను ఆటపట్టిస్తూ కవ్వించే ప్రయత్నం చేయడం, తమన్నా సైతం అతడి చేష్టలకు పడిపోయినట్టుగా ...

4 Min read
Surya Prakash
Published : Jul 20 2024, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Tamannaah Bhatia

Tamannaah Bhatia

 
సినీ సెలబ్రెటీలు, క్రికెటర్ల మధ్య లవ్ స్టోరీలు ఇప్పటివి కావు..ఎన్నో ఏళ్లుగా వీళ్ల మధ్య ప్రేమానుబంధం సాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఫామ్ లో ఉన్న క్రికెటర్ తో ఎవరో ఒక హీరోయిన్ స్లాట్ బుక్ చేసుకున్నట్లుగా లవ్ స్టోరీ కు తెర తీస్తుంది. మీడియాకు ఇది మంచి వంటకం లాంటి వార్తలు ఇస్తూంటుంది. ఎందుకంటే ఇద్దరూ సెలబ్రెటీలే కావటంతో వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది.  ఇక తమన్నా,  భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు ఆ మధ్యన గుప్పు మన్నాయి. అయితే అందులో నిజమెంత అనేది ఎవరికీ అంతు బట్టలేదు. నిప్పులేనిదే పొగ ఏమిటని కొందరన్నారు. మరి తమన్నా ఈ విషయమై ఏమంది.

213


తమన్నా భాటియా, విరాట్ కోహ్లీ గతంలో డేటింగ్ చేసుకుంటున్నట్టుగా ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ముందుగా విరాట్ కోహ్లీ, తమన్నా భాటియా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్టుగా వార్తలు మీడియాలో  షికార్లు చేశాయి. సెల్ ఫోన్‌కి సంబంధించిన ఒక పాత టీవీ అడ్వర్టైజ్‌మెంట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. 
 

313


2012 నాటి  ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తమన్నా భాటియాను ఆటపట్టిస్తూ కవ్వించే ప్రయత్నం చేయడం, తమన్నా సైతం అతడి చేష్టలకు పడిపోయినట్టుగా స్మైల్ ఇవ్వడం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో కింద నెటిజెన్స్ తమదైన స్టైల్లో కామెంట్స్ చేసారు. కొంతకాలం తర్వాత వారిద్దరి బ్రేకప్ గురించి కూడా ప్రజలు మాట్లాడుకున్నారు. 

413


 రొమాంటిక్ యాడ్ గా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ఈ యాడ్ గురించి ఒకసారి చూస్తే, ఇందులో విరాట్ కోహ్లీ తమన్నా ని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు.ఎలా అయిన ఆమెతో మాట్లాడి పరిచయం పెంచుకోవాలని అనుకొని , తన ఫోన్ ని ఒక చోట దయచేసి, తమన్నా వైపు వెతుకుతున్నట్టు నటిస్తాడు.

513

అప్పుడు తమన్నా ఏమిటి అని అడగగా, కోహ్లీ నా ఫోన్ కనపడడం లేదు, ఇక్కడే ఎక్కడో పడుండాలి, కాస్త నా ఫోన్ నెంబర్ చెప్తాను కాల్ చేస్తారా అని అంటాడు. అప్పుడు తమన్నా హా మీ నెంబర్ చెప్పండి అంటుంది, నెంబర్ చెప్పిన తర్వాత ఇదేనా మీ నెంబర్, నేను సేవ్ చేసుకోవచ్చా అని అంటుంది తమన్నా.అప్పుడు కోహ్లీ సిగ్గు పడుతూ కాసేపు ఆమెతో రొమాంటిక్ చాట్ చేస్తాడు, ఈ యాడ్ వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది.
 

613


కొందరైతే మరింత ముందుకు వెళ్లి అనుష్కా శర్మను ట్యాగ్ చేసిన నెటిజెన్స్... " విరాట్ భాయ్ తమన్నా మాయలో పడిపోతున్నాడు జాగ్రత్త బాబీ " అంటూ అనుష్కా శర్మను ఆటపట్టిస్తున్నారు. ఇంకొంత మంది నెటిజెన్స్ అనుష్క శర్మను ట్యాగ్ చేస్తూ.. " హలో అనుష్క, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి " అంటూ కామెంట్ చేసారు.
 

713


కోహ్లీ (విరాట్ కోహ్లీ) - తమన్నా డేటింగ్ మరియు బ్రేకప్ గురించి చాలా చర్చలు జరిగినప్పటికీ, క్రికెటర్ లేదా ఆమె దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు, వారు ఎప్పుడూ అబద్ధం అని ఖండించ లేదు. అయితే ఎట్టకేలకు తమన్నా భాటియా ఇన్నేళ్ల తర్వాత మౌనాన్ని వీడింది. 

813


ఈ డేటింగ్ పుకార్ల గురించి మాట్లాడుతూ, తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు మరియు విరాట్‌కు మధ్య ఏమి జరిగిందో ప్రజలకు కూడా తెలియదు. యాడ్‌ షూట్‌లో నాలుగు మాటలు మాత్రమే మాట్లాడుకున్నామని, ఆ తర్వాత అసలు మాట్లాడలేదన్నారు.   అంత మాత్రానికే రూమర్స్ అల్లేస్తారా అని ప్రశ్నించింది. ఏదేమైనా విరాట్ కోహ్లీ తాను చూసిన ఎంతో మంది నటుల కంటే మంచి నటుడు అని విరాట్ కోహ్లీ యాక్టింగ్ స్కిల్స్‌ని అభినందించింది.

913


యాడ్ షూట్ (యాడ్ షూటింగ్) తర్వాత నేను విరాట్‌ని కలవలేదు లేదా మాట్లాడలేదు.  విరాట్, అనుష్కలు అందమైన జంట అని, తాము కలిసి దిగిన ఫోటో చూస్తే ఆనందంగా ఉంటుందని, తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని మాత్రమే చెబుతున్నానని, విరాట్‌కి తమ మధ్య ఏమీ లేదని స్పష్టం చేసింది. 
 

1013


ఒకప్పుడు తమన్నా ఫ్యామిలీ రోల్స్ చేసేది.  అయితే ఇప్పుుడ హాట్ రోల్స్ కు షిప్ట్ అయ్యింది. సోషల్ మీడియా లో   కుర్రాళ్ళు  తమన్నా వీడియోస్ ని చూసి మెంటలెక్కిపోతున్నారు.‘జీకర్డా’ మరియు ‘లస్ట్ స్టోరీస్ 2′( Lust Stories 2 ) వంటి వెబ్ సిరీస్ లలో ఈ హాట్ బ్యూటీ ఆందోళ ఆరబోత  చేసిన బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు, ఆమె కెరీర్ లో ఇన్నాళ్లు ఒక్క సినిమా లో కూడా అలా చెయ్యలేదు.
 

1113


సౌత్ లో ఉన్నప్పుడు ఆమె ముద్దు సన్నివేశాల్లో నటించడానికి కూడా చాలా ఇబ్బంది పడేది, ఇప్పుడు ఏకంగా బెడ్ రూమ్ సన్నివేశాల్లో కూడా నటించేస్తుంది.ఇక ఆ సన్నివేశాల్లో ఈమె డైలాగ్స్ వింటే కుర్రాళ్ళు సైతం చెవులు మూసుకుంటారు అంత బోల్డ్ గా నటించింది ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియా లో తరచూ ఈమెకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. 

1213


అలాగే ఆ మధ్యన నటి తమన్నా, క్రికెట్ విరాట్ కోహ్లికి కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసీడర్లుగా ఉన్నందుకే కోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆన్‌లైన్ వేదిక రమ్మీ ఆట బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆటపై నిషేధం విధించాలని కోరుతూ త్రిస్సూర్‌కు చెందిన పాలీ వర్గీస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఆటలపై నిషేధం విధించారని త్రిస్సూర్ కోర్టుకు తెలిపారు. 

1313


అంతటితో ఆగకుండా.. ఇలాంటి ఆటలకు బడా స్టార్లు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తుండడం వల్లే.. ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీంతో ఈ విషయంపై స్పందించిన కేరళ హైకోర్టు విరాట్ కోహ్లీ, తమన్నాలతో పాటు కేరళలో ఈ ఆన్‌లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న మరో మలయాళీ నటుడు అజు వర్గీస్‌లకు నోటీసులు జారీ చేసింది.  
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved