- Home
- Entertainment
- Ram Charan Surgery: సర్జరీ కోసం కోయంబత్తూరు బయలుదేరిన రామ్ చరణ్, ఫ్యామిలీ మొత్తం తోడుగా.. అక్కడే ఎందుకు ?
Ram Charan Surgery: సర్జరీ కోసం కోయంబత్తూరు బయలుదేరిన రామ్ చరణ్, ఫ్యామిలీ మొత్తం తోడుగా.. అక్కడే ఎందుకు ?
రామ్ చరణ్ కి కోయంబత్తూరులో సర్జరీ జరగనుంది. పెద్ది షూటింగ్ సమయంలో రాంచరణ్ మణికట్టుకి గాయం అయింది. ప్రమోషన్స్ లో సైతం చరణ్ గాయంతోనే కనిపించారు. సర్జరీకి సంబంధించిన వివరాలు ఈ కథనంలో ఉన్నాయి.

Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
కోయంబత్తూరులో రాంచరణ్ కి సర్జరీ
రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్‌లో రామ్ చరణ్‌కు సర్జరీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజే మెగా కుటుంబం కోయంబత్తూరుకు బయలుదేరుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు రామ్ చరణ్‌కు తోడుగా ఉండనున్నారు.
అక్కడే ఎందుకంటే
ఈ సర్జరీను ప్రముఖ డాక్టర్ ప్రవీణ్, సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్‌లో అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్స చేయనుంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తై, అనంతరం రామ్ చరణ్ త్వరగా కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ది విజయం
రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన కోసం ప్రార్థిస్తున్నారు.రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ లో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగు మార్కెట్ లో బయ్యర్లకు లాభాలు అందించింది. ఓవర్సీస్ లో మాత్రం నిరాశ పరిచింది.
రాంచరణ్ నటనకు ప్రశంసలు
ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. నటుడిగా రామ్ చరణ్ చూపించిన మెచ్యూరిటీ అద్భుతం అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఎమోషనల్, యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన పెద్ది చిత్రం కోసం చరణ్ ఎంతగానో కష్టపడ్డారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కి అనేక గాయాలు అయ్యాయి. అందులో ఈ మణికట్టు గాయం ఒకటి.

