- Home
- Entertainment
- పింక్ డ్రెస్‌లో ఎట్రాక్ట్ చేస్తున్న తమన్నా.. వామ్మో ఇంత క్యూట్‌గానా.. బౌన్సర్‌గా రఫ్ఫాడిస్తుందట..!
పింక్ డ్రెస్‌లో ఎట్రాక్ట్ చేస్తున్న తమన్నా.. వామ్మో ఇంత క్యూట్‌గానా.. బౌన్సర్‌గా రఫ్ఫాడిస్తుందట..!
మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుంది. కానీ ఆమె ట్రెండ్ మార్చింది. అందంతోపాటు నటన గురించి చర్చించుకునేలా చేస్తుంది. కొత్త దారిలో దూసుకుపోతుంది.

తమన్నా తాజాగా పింక్ అందాలతో కనువిందు చేస్తుంది. టాప్ టూ బాటమ్ పింక్ డ్రెస్‌లో అబ్బురపరుస్తుంది. పింక్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ అందాలు కాస్త హాట్ నుంచి క్యూట్‌గా మారడం విశేషం. ఇలా తమన్నా క్యూట్ అందాలను ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు ఓ పాన్ ఇండియా చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. జాతీయ అవార్డు చిత్రాల దర్శకుడు మధుర్ భండార్కర్ రూపొందించిన `బబ్లీ బౌన్సర్` అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం.
ఈ చిత్రం ఈ నెల 23న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేసింది యూనిట్. దర్శకుడు మధుర్ భండార్కర్‌తోపాటు తమన్నా శనివారం మీడియాతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. ట్రెండీ పింక్ డ్రెస్ లో హోయలు పోతూ కనువిందు చేసింది.
`బబ్లీ బౌన్సర్` చిత్రంలో తమన్నా హరియాణాకి చెందిన పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది. ఆమె బౌన్సర్‌గా ఎలా మారింది. ఎందుకు మారిందనే అంశాలనే ఈ చిత్రం సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఇందులో తమన్నా మాట్లాడుతూ, తెలుగు సినిమాలంటే తాను గర్వంగా ఫీలవుతానని చెప్పింది మిల్కీ బ్యూటీ. నా జర్నీ టాలీవుడ్ నుంచే ప్రారంభమైందని చెప్పింది.
ఇప్పుడు రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారని, ఇప్పటికీ మన ఇండియన్ సినిమాని మన ఎమోషన్సే నడిపిస్తాయని చెప్పింది. తాను ఫస్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేశానని, ఇందులో లేడీ బౌన్సర్‌గా కనిపిస్తున్నట్టు చెప్పింది. ఇలాంటి కథ తనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది తమన్నా.
జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపింది. ఇది తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని పేర్కొంది. `మధుర్ బండార్కర్ సినిమాలో నటించిన హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ నెల 23న డిస్నీ+ హాట్‌స్టార్ లో విడుదల అవుతున్న ఈ సినిమా ను కుటుంబ సమేతం గా ఇంట్లో కూర్చొని హ్యాపీ గా చూడండి ` అని చెప్పింది.
తమన్నా గురించి దర్శకుడు మధుర్ భండార్కర్ చెబుతూ, నార్త్ సైడ్‌లో లేడీ బౌన్సర్లని చూసి సినిమా చేశానని, సినిమాలో హీరోయిన్ బబ్లీగా, ఫిజికల్‌గా, మెంటల్‌గా మెచ్యూర్డ్ గా కనిపించాలి, అందుకు తమన్నా బెస్ట్ ఛాయిస్ అనిపించిందని, ముందు అభ్యంతరం తెలిపిన వారు, టీజర్, ట్రైలర్ చూశాక ఫోన్ చేసి మరీ వంద శాతం తమన్నా రైట్ ఛాయిస్ అంటూ కితాబిచ్చారని తెలిపారు. బౌన్సర్‌గా తమన్నా అద్భుతంగా చేసినట్టు తెలిపారు మధుర్ భండార్కర్.