తాప్సీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ప్యాలెస్‌లో రాయల్ వెడ్డింగ్..? `డంకీ`బ్యూటీ రియాక్షన్ ఇదే..
సొట్టబుగ్గల సుందరి తాప్సీ త్వరలో పెళ్లి పీఠలెక్కబోతుందంటూ ప్రచారం ఊపందుకుంది. టైమ్, వేదిక కూడా పిక్స్ చేసుకుందట. మరి దీనిపై తాప్సీ ఏం చెప్పిందంటే..
తాప్సీ తెలుగులో హీరోయిన్‌గా ఎదిగింది. సొట్టబుగ్గల అందంతో తెలుగు ఆడియెన్స్ ని తన బుట్టలో వేసుకుంది. క్యూట్ అందాలతో మెప్పించింది. టాలీవుడ్‌లో నెమ్మదిగా విజయాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రభాస్, రవితేజ, గోపీచంద్, మంచు మనోజ్ వంటి హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది.
టాలీవుడ్‌లో కెరీర్ కాస్త ఒడిదుడుకులకు లోను అవుతున్న నేపథ్యంలో ఆమె బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ నెమ్మదిగా పుంజుకుంటూ వచ్చింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంది. `పింక్` మూవీ తాప్సీ కెరీర్ ని మలుపుతిప్పింది. ఈ సినిమాతో ఆమెకి బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. ఇటీవల `డంకీ` చిత్రంలో మెరిసింది. షారూఖ్ ఖాన్‌తో కలిసి నటించి మంచి విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉంటే తాప్సీ పెళ్లి చేసుకోబోతుందట. ఇటీవల హీరోయిన్లు వరుసగా మ్యారేజ్‌లు చేసుకుంటున్నారు. అలియాభట్, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, అలాగే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిళ్లు చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యారు. అలాగే కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాప్సీ కూడా మ్యారేజ్ చేసుకోబోతుందని తెలుస్తుంది.
Taapsee Pannu, wedding,
తాప్సీ దాదాపు పదేళ్లుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బోయ్‌తో ప్రేమలో ఉంది. ఇన్నాళ్లు చాలా సైలెంట్‌గా తన లవ్ ట్రాక్‌ని నడిపించింది. ఇటీవలే ఆమె ప్రేమ విషయం బయటకు వచ్చింది. అడపాదడపా మీడియా కంటపడ్డారు. దీంతో ప్రేమ విషయం బహిర్గతమైంది.
Taapsee Pannu Mathias Boe
ఇదిలా ఉంటే ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారట ఈ జోడీ. ప్రియుడిని పెళ్లాడేందుకు తాప్సీ ప్లాన్ చేస్తుందట. వచ్చే నెలలోనే మ్యారేజ్ కి రెడీ అవుతున్నారట. ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో మ్యారేజ్ జరగబోతుందని, క్రిస్టియన్, సిక్కు సంప్రదాయాల ప్రకారం వీరి మ్యారేజ్ జరగబోతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పెళ్లి వార్తలపై యాంకర్ ప్రశ్నించగా, విభిన్నంగా రియాక్ట్ అయ్యింది. తన వ్యక్తిగత విషయాలకు తాను ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్‌లో కూడా ఇవ్వను` అని పేర్కొంది. మరి తన పెళ్లి వార్తలు నిజమేనా, కాదా అనేది మాత్రం అలానే సస్పెన్స్ లో పెట్టింది. ఇటీవల హీరోయిన్లు మ్యారేజ్ చేసుకుంటున్న నేపథ్యంలో తాప్సీ కూడా మ్యారేజ్ చేసుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
తాప్సీ కెరీర్ విషయానికి వస్తే ఇటీవల షారూఖ్‌తో `డంకీ`లో మెరిసింది, విజయాన్ని అందుకుంది. ఇప్పుడు `వాహ్ లడ్కీ హై కహాన్`, `ఫిర్ ఆయి హసీన్ దిల్‌రూబా`, `ఖేల్ ఖేల్ మెయిన్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.