MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • 'యానిమల్' పై సందీప్ వంగా పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

'యానిమల్' పై సందీప్ వంగా పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

 రణ్‌బీర్‌కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం యానిమల్‌. అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. 

3 Min read
Author : Surya Prakash
Published : Jul 07 2024, 06:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Taapsee Pannu

Taapsee Pannu


రిలీజయ్యి ఇంతకాలం అవుతున్నా ఇంకా యానిమల్ టాపిక్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో అదే స్దాయి వివాదాలు చుట్టు ముట్టాయి. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాని విమర్శిస్తూ ఇప్పటికే కామెంట్స్ చేసారు. అదే విధంగా దర్శకుడు సందీప్ వంగా సైతం ఆ వివాదాలను అంతే పదునైన తన మాటలతో తిప్పి కొట్టారు. ఇప్పుడు మరోసారి తాప్సీ ఈ సినిమా గురించి మాట్లాడింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211


సినీ పరిశ్రమలో డేరింగ్ హీరోయిన్‌ ఎవరంటే తాప్సీనే అని చెప్పారు. తనకు నచ్చకపోయినా.. తనకు తోచింది ఏదైనా బయటకు చెప్పే మనస్తత్వం ఆమెది. టాలీవుడ్‌లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

311


ఈ సొట్టబుగ్గల సుందరి హీరోయిన్ తాప్సి తన సినీకెరీర్​ను 'ఝమ్మంది నాదం' తెలుగు సినిమాతోనే మొదలు పెట్టింది. రవితేజ, మంచుమనోజ్, గోపిచంద్, ప్రభాస్​​ సహా పలువురు హీరోలతో కలిసి యాక్ట్ చేసింది. కానీ అంతగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్​కు వెళ్లింది. అక్కడ ముల్క్ , బడ్లా, తప్పడ్ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విజయాలను అందుకుంది. చివరిగా డంకీ చిత్రంలో చేసింది. డంకీ చిత్రం వర్కవుట్ కాలేదు. షారూఖ్ కెరీర్ లో బిలో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. 

411


అయితే తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్ అవటం చాలా సార్లు జరిగింది.  గతంలో తెలుగు దర్శకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా నటి రష్మిక మందన్నను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా బాలీవుడ్‌లో వసూళ్ల వర్షం కురిపించిన యానిమల్‌ చిత్రంపై  విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

511

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం యానిమల్‌. అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.  ఈ చిత్రంపై విమర్శలు సైతం అదేస్థాయిలో వచ్చాయి. మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు, వ్యతిరేక సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

611
Taapsee Pannu

Taapsee Pannu


నటి రాధికా శరత్‌కుమార్‌ యానిమల్‌ అసలు చిత్రమే కాదంటూ తీసి పారేశారు. ప్రముఖ గాయకుడు శ్రీనివాస్‌ ఆది జంతువుల కోసం తీసిన చిత్రం అని పేర్కొన్నారు. ఇలాంటి  కామెంట్స్ వచ్చిన ప్రతీసారి కలెక్షన్స్ పెరుగుతూనే పోయాయి. ఇక తాప్సీ గతంలోనూ ఈ సినిమా గురించి మాట్లాడింది.  ఈ సినిమా కోసం రాసిన స్క్రిప్ట్ చదివి ఉంటే తాను కూడా ఓకే చెప్పుంటానని, కానీ స్క్రిప్ట్‌లో మాత్రమే చెప్పినట్లు కాకుండా డైరక్టర్ ఈ సినిమాను మరోలా తీశారంటూ ఆమె కామెంట్​ చేసింది.

711


తాప్సీ మాట్లాడుతూ..."ఈ సినిమా స్క్రిప్ట్ మాత్రమే చదివి ఉంటే నేను కూడా రణబీర్ కపూర్‌లా ఎగ్జైట్ అయ్యేదాన్ని. దీన్ని ఎలా తీస్తారనేది నాకు కూడా తెలియదు కదా. డైరక్టర్ ఈ మూవీని ఎలా తీయాలనుకుంటున్నారో అది స్క్రిప్ట్‌లో ఉండదు. అది కేవలం డైరక్టర్‌కి మాత్రమే తెలుసు. ఏ సన్నివేశాన్ని ఎలా తీస్తున్నారనేది, ఎప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువగా వస్తుందనేది డైరక్టర్ చేతుల్లోనే ఉంటుంది.

811


 కేవలం అతను మాత్రమే కెమెరా మెన్లతో గానీ, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌తో గానీ కమ్యూనికేట్ అవుతుంటారు. షాట్ తీసిన విధానం బట్టే హీరోయిజం ఎలివేట్ అవుతుంది. అవన్నీ పేపర్ మీద ఉండవు. సినిమాలోని కొన్ని సీన్స్​కు విజిల్స్, అరుపులు విని నేను చాలా వింతగా ఫీలయ్యా. సడన్‌గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెరిగిపోవడం, ప్రేక్షకులు బలవంతంగా చప్పట్లు కొట్టడం, అభిమానులకు ఈలలు వేయాల్సి రావడం వంటివి గమనించాను" అంటూ తాప్సీ డైరెక్టర్ సందీప్​పై కామెంట్ చేసింది.
 

911

ఇంతకు ముందు కూడా తాప్సీ యానిమల్ చిత్రం గురించి మాట్లాడుతూ... విమర్శలు చేశారు. తానైతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఒక పవర్‌ ఉంటుందని.. అదే విధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని అన్నారు. అలాగని యానిమల్‌ తరహా చిత్రాల్లో నటించే.. ఇతర స్టార్స్  ఇలాంటివీ పట్టించుకుంటే బాగుంటుందని తాను చెప్పలేనన్నారు. అది వారి వ్యక్తిగత విషయమని తాప్సీ పేర్కొన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, నచ్చింది చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. అయితే తానైతే యానిమల్‌ చిత్రంలో నటించడానికి సమ్మతించేదాన్ని కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 

1011


తాప్సీ ప్రస్తుతం 'ఖేల్ ఖేల్ మే' అనే ప్రాజెక్టులో నటిస్తోంది. అక్షయ్ కుమార్, వాణీ కపూర్, ఫర్దీన్ ఖాన్, అమ్మీ విర్క్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటితో పాటు 'ఫిర్ ఆయి హసీన్ దిల్​రుబా', 'వో లడ్​కీ హై కహా' మూవీస్​లోనూ నటిస్తోంది. ఈ రెండూ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.
 

1111


తన బాలీవుడ్‌ ఎంట్రీకి, ఛాన్స్​లు రావడానికి నటి ప్రీతి జింటాకు సంబంధం ఉందని తాప్సీ చెప్పింది. "చాలా మంది నేను ప్రీతి జింతాకు న్యూ వెర్షన్​ అనుకుంటారు. అందుకే నాకు బాలీవుడ్​ ఆఫర్లు వచ్చాయి. అందుకే ఆమెలా ఉండటానికి కొంచెం ట్రై చేస్తాను. ఆమె ఎంతో పాజిటివ్​ ఎనర్జీగా ఉంటుంది. ఈ విషయం నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. నేను ఆమెను కేవలం టీవీ, బిగ్​స్క్రీన్​పై చూశాను" అని పేర్కొంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Mumbai House: భార్య కోసం షాకింగ్ డెసిషన్.. సూర్య రూ.200 కోట్ల ఇల్లు ఎందుకు వదిలేశాడో తెలుసా ?
Recommended image2
Shruti Haasan: సీరియస్ సమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్.. అందుకే పిల్లల్ని దత్తతకు రెడీ
Recommended image3
Baby Do Die Do OTT: రామ్ చరణ్ కి నచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎందులో స్టీమింగ్ అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved