సోషల్ మీడియాకు అందుకే దూరంగా ఉన్నా.. అసలు విషయం బయట పెట్టిన తాప్సీ..
గత కొంతకాలంగా సోషల్‌మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది పంజాబీ భామ తాప్సీ పన్ను. అసలు తాను సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నది అసలు విషయం వెల్లడించింది బ్యూటీ.
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంది స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను. తాజాగా ఆమె షారుఖ్‌ఖాన్ సరసన డంకీ సినిమాలో నటిస్తోంది. అయితే చాలా కాలంగా ఫ్యాన్స్ తో టచ్ లో లేని తాప్సీ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపింది.
చాలా కాలంగా సోషల్‌మీడియాకు దూరంగా ఉంటూ వస్తుంది పంజాబీ భామ తాప్సీ. వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్ల సోషల్ మీడియా దూరంగా ఉన్నానని తెలిపింది బ్యూటీ. తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొనడం వల్లే తాను సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్టు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
అంతే కాదు ప్రస్తుతం నటిస్తున్న డంకీ సినిమా గురించి.. షారుఖ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. డంకీ చిత్రం గురించి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నా. నాపాత్ర తాలూకు షూటింగ్ ఇంకా కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది. నా కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైన సినిమ ఇది అంటూ ఫ్యాన్స్ తో తన సంతోషాన్ని శఏర్ చేసుకుంది బ్యూటీ.
ডানকি
అంతే కాదు షారుఖ్‌ఖాన్‌తో స్క్రీన్ ను శేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటోంది తాప్సీ. ఆయనతో నటిస్తుంటే.. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అంటూ షారూఖ్ పై అభిమానాన్ని వెల్లడించింది బ్యూటీ.
তাপসী -পান্নু
ఈ సినిమాలో వినోదంతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. నా పాత్ర కూడా సర్‌ఫ్రైజింగ్‌గా అనిపిస్తుంది. దేశమంతా మాట్లాడుకుంటున్న గొప్ప చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. గత కొంతకాలంగా నా పూర్తి సమయాన్ని సినిమాలకే వెచ్చిస్తున్నా. అందుకే సోషల్‌మీడియాకు బ్రేక్ తీసుకున్నా అని చెప్పింది.
ఇక టాలీవుడ్ సినిమాల ద్వారానే వెండితెరకు పరిచయం అయిన తాప్సీ..బాలీవుడ్ చేరిన తరువాత ఇటువైపు చూడటంలేదు.గతంలో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా తర్వాత తెలుగులో మరే సినిమాకు సైన్ చేయలేదు తాప్సీ. అంతే కాదు.. తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు కూడా రావడంలేదు. హిందీలో మాత్రం ఆరు సినిమాలతో బిజీగా గడిపేస్తోంది బ్యూటీ.