హిందీ వెర్షన్: సాహో మిస్సైన చోట సైరా క్లిక్

First Published Sep 30, 2019, 1:53 PM IST

ఏ ఇద్దరు సినిమా అభిమానుల మధ్య చిన్నపాటి డిస్కషన్ నడిచినా అది ఖచ్చితంగా సైరా సినిమా గురించే అయి ఉంటుంది. ఇంతలా సైరా మేనియా ప్రపంచాన్ని ఊపేస్తోంది. అనకాపల్లి నుండి అమెరికా వరకు మెగాస్టార్ చిరంజీవి మాస్ నడుస్తుంది. 250 కోట్లతో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా ను ఇప్పుడు సినిమా ప్రేమికులందరూ మొన్ననే విడుదలైన మరో భారీ బడ్జెట్ చిత్రం సాహూతో  పోల్చి చూసుకుంటున్నారు.