డీలా పడిన మూడో వారం ఎపిసోడ్.. గ్లామర్ డోస్ పెంచిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ 4 మూడో వారం పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. ఒక్కో దెయ్యం ఎపిసోడ్ గందరగోళంగా తయారైంది. మొత్తానికి గురువారంతో ఆ ఎపిసోడ్ పూర్తయ్యింది. ఫైనల్‌గా వరస్ట్ పర్‌ఫెర్మెన్స్ తో నోయల్ జైలుకెళ్ళాడు. ఆయనకు రాగి జావ తప్ప మరేది ఇవ్వడానికి వీళ్లేదని బిగ్‌బాస్ చెప్పేశాడు.
ఇక ఈ ఎపిసోడ్ క్లోజ్ అయ్యింది. మూడో వారంలో మరో కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బిగ్‌బాస్‌కి గ్లామర్ పెంచే చర్యల్లో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో నటిని హౌజ్‌లోకి పంపబోతున్నారు. హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ని `బిగ్‌బాస్` హౌజ్‌లోకి పంపబోతున్న ప్రోమోని పంచుకున్నారు.
ఇందులో ముఖానికి మాస్క్ ధరించి ఓ లేడీ ఎంటర్ కాగా, అందరు గంతేశారు. అయితే ఆమె స్వాతి దీక్షితే అని కన్ఫమ్ అని తెలుస్తుంది.
బిగ్‌బాస్4లో గ్లామర్ తగ్గింది. ఒక్క మోనాల్ గజ్జర్ పైనే అంతా ఆధారపడి ఉండాల్సి వస్తుంది. ఆమె చుట్టూతే అభిజిత్, అఖిల్, నోయల్, అవినాష్ తిరుగుతున్నారు.
సుజాత, దేవి, దివి, హారిక, అరియానా ఉన్నప్పటికీ గ్లామర్ పరంగా వారిని చూడటం లేదు. దీంతో మరింత గ్లామర్ తెచ్చి రెండో వారంలో పడిపోయిన టీఆర్పీని పెంచే ప్రయత్నం చేస్తుంది స్టార్‌మా. మరి ఈ బ్యూటీ ఎలా మెప్పిస్తుందో చూడాలి. మొదటి వారంతో పోల్చితే రెండో వారం భారీగా టీఆర్పీ పడిపోయిందని తెలుస్తుంది.