- Home
- Entertainment
- Karthika deepam: కుటుంబం ముందు శోభ రహస్యాన్ని బయటపెట్టిన శౌర్య.. చెంప చెల్లుమనిపించిన స్వప్న!
Karthika deepam: కుటుంబం ముందు శోభ రహస్యాన్ని బయటపెట్టిన శౌర్య.. చెంప చెల్లుమనిపించిన స్వప్న!
Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 10వ తేదీన ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... స్వప్న, నిరూపమ్ని పెళ్లికి రెడీ అయినందుకు పొగుడుతూ ఉంటుంది. నిరూపమ్ ఫ్రెండ్స్ అందరికీ స్వప్న ఫోన్ చేసి పెళ్లికి పిలుస్తుంది.సత్యం మొఖం మాడ్చేస్తాడు. ఆ తర్వాత సీన్లో సౌందర్య ఇంట్లో పెళ్లి పనులు ఘనంగా అవుతున్నా హిమ మాత్రం ఫోన్ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.ఎందుకు ఏడుస్తున్నావు? అని సౌందర్య, ఆనందరావు హిమని అడగగా హిమ ఫోన్లో ఉన్న ఫోటోని సౌందర్య కి చూపిస్తుంది.
ఆ ఫోన్లో నిరూపం పెళ్లి బట్టలతో శోభతో తీసుకున్న ఫోటో ఉంటుంది. ఎవరు పంపారు ఇది నీకు? అని సౌందర్య అడగగా స్వప్నత్త పంపింది అని అంటుంది హిమ. నేను అప్పటికి చెప్పాను నిరూపమ్ కి వెళ్లొద్దు అని అయినా వెళ్ళాడు. ఇప్పుడు వాడి మనసు మార్చేసింది స్వప్న అని సౌందర్య బాధపడుతూ ఉండగా ఈలోగా శౌర్య అక్కడికి వచ్చి ఈ ఏడుపుల్ని ఆపండి చేసింది చాలు. ఇప్పుడేమైంది అని ఇలా ఏడుస్తున్నారు అని శౌర్య అడుగుతుంది. ఆ ఫోటో నీ చుస్పిస్తుంది సౌందర్య.
ఈ పెళ్లి నేను ఎలాగైనా చెడగొడతాను. కంగారు పడొద్దు నాతో రండి అని అంటుంది శౌర్య. దాని తర్వాత సీన్లో శోభ పెళ్లి దుస్తుందో ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి జరిగితే నా హాస్పిటల్ అప్పులన్నీ తీరిపోతాయి అని ఆనందపడిపోతూ ఉంటుంది. ఈలోగా శౌర్య, హిమ, సౌందర్య ,ఆనంద్ రావు అక్కడికి వస్తారు. వాళ్లతో పాటు శౌర్య గతంలో తనని కిడ్నాప్ చేసిన వాడిని కూడా లాక్కొని వస్తుంది. శౌర్య, స్వప్న వాళ్ళందరినీ పిలిచి వాడి చేత నిజం చెప్పిస్తుంది. అయినా సరే స్వప్న మనసు కరగదు.
నాకు ఇక్కడ కూడా శోభా ప్రేమే కనిపిస్తుంది అని అంటుంది. మీరు ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలనుకుంటున్నారు కానీ నా మనసు మారదు శోభతో నిరూపమ్ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని అంటుంది. అప్పుడు శోభ, మీరు ఏదో చేద్దామని వచ్చారు కానీ అది జరగదు తిరిగి వెళ్ళిపోండి అని వారిని ఎటకారిస్తుంది. అంటట్లో శౌర్య బ్యాంక్ ఆఫీసర్లు పిలుస్తుంది.
అప్పుడు బ్యాంకు వాళ్లు వచ్చి శోభని తిడుతూ, హాస్పిటల్ కి అన్ని లక్షల అప్పు తీసుకున్నారు ఎప్పుడు కడతారు అని అనగా ఒక రిచ్ డాక్టర్ ఫ్యామిలీని పట్టాను వాళ్ళ అమ్మని బుట్టలో వేసుకున్నాను. పెళ్లయిన తర్వాత నెమ్మదిగా ఆస్తంతా నా పేరు మీద రాయించుకొని అప్పులన్నీ కట్టేస్తా అన్నావు, తీరా ఇక్కడ చూస్తే పెళ్లి ఆగిపోయే స్థితిలో ఉన్నదని చెప్పారు. మా అప్పులు ఎప్పుడు కడతావు? అని అంటారు. అది విన్న ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు స్వప్నతో సహా.
అప్పుడు శౌర్య, శోభ.. నిరుపమ్ ని పెళ్లి చేసుకుంటుంది. మీ మీద అభిమానంతోనో నిరుపమ్ మీద ప్రేమతోనో కాదు ఆస్తి మీద ఉన్న తీపి తోని అని అంటుంది. అప్పుడు శోభ, వీళ్ళందరూ అబద్ధం చెబుతున్నారు బ్యాంక్ ఆఫీసర్లు కూడా నకిలీ అని అనగా స్వప్న శోభని చెల్లుమని చంప దెబ్బ కొడుతుంది. ఈ ఇంటికి కాబోయే కోడల్ని కొడుతున్నారా ఆంటీ? అని అనగా మళ్లీ కొట్టి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. చేసేదేమీ లేక శోభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
నిజం తెలుసుకుని తన తప్పు తెలుసుకున్న స్వప్న పశ్చాతాపంతో శౌర్యకు వెళ్లి ధన్యవాదాలు చెబుతుంది. దాని తర్వాత సీన్లో స్వప్న సత్యం దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి. నేనే మిమ్మల్ని అశ్రద్ధ చేశాను ఒక మెట్టు దిగి క్షమించమని అప్పుడే అడగాల్సింది. ఇన్నేళ్లు మన మధ్య దూరం పెరిగింది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సత్యం, ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావు. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిత్య విషయంలో నా తప్పేమీ లేదు అని అంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!