MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Karthika Deepam: హిమ, నిరుపమ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. తిండీ తిప్పలు మానేసిన స్వప్న!

Karthika Deepam: హిమ, నిరుపమ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. తిండీ తిప్పలు మానేసిన స్వప్న!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్, కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం...  

3 Min read
Author : Navya G
Published : Aug 04 2022, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... నిరుపమ్, ప్రేమని తాళం తీయడానికి ప్రయత్నించమని చెప్తాడు. ప్రేమ్ ,తాళం తీస్తున్నట్టు నటిస్తాడు.ఈ లోగ సౌర్య లేసి  తాళం తీస్తున్నారా?అని అడుగుతుంది. అప్పుడు ప్రేమ్ తాళం వచ్చేసింది అని చెప్పి తలుపు తీస్తాడు. ఈ చిన్న తాళం తీయలేక పోయావని నిరూపం, సౌర్యలు ప్రేమ్ ని ఆటపట్టించారు.  హిమ శౌర్యకి మంచినీళ్లు ఇవ్వగా శౌర్య వద్దని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సౌందర్య కంగారుగా సౌర్య దగ్గరికి వెళ్లి,ఏమైందమ్మా? నిన్ను  ఎవరు కిడ్నాప్ చేశారు? అని అడగగా, శౌర్య కోపంతో ఆటో నడుపుకునే దాన్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు! అనా నీ ఉద్దేశం,అని అడుగుతుంది. అప్పుడు సౌందర్య, నేను ఆ విధంగా అనలేదు,సరే ఇక్కడితో ఈ టాపిక్ వదిలేయండి అని చెప్తుంది. దాని తర్వాత ప్రేమ్ జోక్ వేస్తాడు. ఇంట్లో వాళ్ళు నవ్వరు.  ఈలోగా స్వప్న అక్కడికి వచ్చి కోపంతో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అని అరుస్తుంది. 
 

38

శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారు అని సౌందర్య చెప్పగా, ఈ విషయాలు, నాకు ఎందుకు? నా పిల్లల్ని ఇంకా మీ దగ్గరే ఉంచుకుంటారా?. మా ఇంటికి పంపరా? అని గట్టిగా అడుగుతుంది స్వప్న. మా పిల్లలు మీ మనవరాలు కోసమే పుట్టినట్టు,మీ మనవరాళ్ళు మా పిల్లలని మాయ చేస్తున్నారు అని అనగా శౌర్య తిరిగి గట్టిగా సమాధానం ఇస్తుంది. దానికి స్వప్న "ఎప్పుడైతే ఈ కొరివిదయాన్ని ఇంట్లో పెట్టుకున్నారో అప్పటినుంచి ఇల్లంతా అల్లకల్లోలంగా తయారైంది. 
 

48

అప్పుడు, ప్రేమ వ్యవహారాలు మొదలయ్యి,ఇప్పుడు అది కిడ్నాప్ వరకు వచ్చింది.దీనికోసం మా పిల్లల్ని బలి ఇస్తారా అని అరుస్తుంది. దానికి నిరూపం ప్రేమ్ లు స్వప్నని ఎదిరిస్తారు. అప్పుడు స్వప్న "నేను చస్తేగాని నాకు ఈ టెన్షన్ పోయేలా లేదు" అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో శోభ నిరుపమ్, శౌర్యని కాపాడాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏదైనా మంచి ప్లాన్ వేయాలి, స్వప్న ఆంటీ వాళ్ళ నాకేం ఉపయోగం లేదు, అనుకుంటూ ఉండగా స్వప్న అక్కడికి కోపంగా వస్తుంది. 
 

58

ఏమైంది అని అడగగా, ఇప్పుడే వాళ్ళందరినీ దులిపి వచ్చాను.అయినా ఈ కిడ్నాప్ వల్ల వాళ్ళు అందరూ ఒకటే పోయినట్టు నాకు అనిపిస్తుంది. ఇంక వాళ్లని మార్చడం నావల్ల కాదేమో అనిపిస్తుంది? ఏం చేయాలో తెలియట్లేదు? అని స్వప్న శోభ కి చెప్తుంది. అప్పుడు శోభ, స్వప్నతో, నిరూపమ్ కి హిమంటే అంత ఇష్టమో మీరు కూడా అంత ఇష్టం. కనుక మీరు రెండు రోజులు తినడం మానేస్తే నిరూపమే ఇంటికి వస్తాడు అని సలహా ఇస్తుంది. 
 

68

దాని తర్వాత సీన్లో ఆనందరావు సౌందర్య దగ్గరకు వచ్చి నాకు ఈ కిడ్నాప్ సీన్లు డౌట్లు ఉన్నాయి అని చెప్పి అడుగుతాడు. ఈ కిడ్నాప్ వెనుక ఎవరుంటారు అని సౌందర్య ఆనందరావు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు శౌర్య, నిన్న రాత్రి నిరూపం తనతో అన్న మాటలు గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ దిండుని అటువైపు విసురుతాది.అదే సమయంలో ఆనందరావు అక్కడికి వస్తాడు. సారీ తాతయ్య అని సౌర్య అనగా పర్లేదు అని ఆనందరావు అంటాడు. ఇంత కోపం ఎవరిమీద అని ఆనందరావు సౌర్యని అడుగుతాడు. 
 

78

నా మీద నాకే కోపం అని సౌర్య చెప్పగా, కోపం నాకు చెప్పుకుంటే బాధ తగ్గుతాది కదా అని అంటాడు అందంద రావు. అలాగ వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత హిమా, మెట్లు దిగి కిందకు వస్తుంది. కిందకి వచ్చి నిన్న నిరూపం, సౌర్యలు ఒంటరిగా ఉంటే వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి మార్పు రాలేదు అని బాధపడుతూ ఉండగా సౌందర్య హిమకి తన పెళ్లి శుభలేఖ కార్డు ఇస్తుంది. 
 

88

ఇది ఏంటి అని హిమ సౌందర్యాని అడగగా ఈ సమయానికి, ఈ ముహూర్తానికి మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది అని గట్టిగా చెప్తుంది. అప్పుడు హిమ సౌర్యని, బావతో పెళ్లి చేద్దాము అని అనగా హిమ ని కొడుతుంది సౌందర్య. సౌర్య నిరూపంలో కోరుకుంటుంది కానీ నిరూపం సూర్యుని కోరుకోవడం లేదు కదా నిరూపం నిన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పి చాలా గట్టిగా తిడుతుంది సౌందర్య. ఈ లోగ శౌర్య ఆ మాటను వింటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved