- Home
- Entertainment
- Brahmamudi: తన నిర్ణయాన్ని చెప్పి అందరికీ షాకిచ్చిన అపర్ణ.. స్వప్న ఫేక్ గర్భం బయటపడనుందా?
Brahmamudi: తన నిర్ణయాన్ని చెప్పి అందరికీ షాకిచ్చిన అపర్ణ.. స్వప్న ఫేక్ గర్భం బయటపడనుందా?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని ఆపై టెన్షన్ పడుతున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్న తన ఫ్రెండు డాక్టర్ సాక్షికి ఫోన్ చేసి మా అత్తగారితో కలిపి హాస్పిటల్ కి వస్తున్నాము వాళ్లకి దొరికిపోకుండా నువ్వే హెల్ప్ చేయాలి అంటుంది. ఈరోజు నేను హాస్పిటల్ కి రావడం లేదు మా అత్తగారితో కలిపి గుడికి వెళుతున్నాను అంటుంది సాక్షి. మీ హాస్పిటల్లో వేరే ఎవరికైనా చెప్పి మేనేజ్ చెయ్యు అంటుంది స్వప్న. డాక్టర్లంటే డబ్బుకు ఆశపడే వాళ్ళు అనుకుంటున్నావా, నేనంటే నీ ఫ్రెండ్ ని కాబట్టి హెల్ప్ చేస్తున్నాను అని స్వప్నకి చివాట్లు పెట్టి ఫోన్ పెట్టేస్తుంది సాక్షి.
మరోవైపు టిఫిన్ రెడీ చేసిన కావ్య అందరిని గంట కొట్టి టిఫిన్ కి పిలుస్తుంది. టిఫిన్ మీద పేర్లు రాసి పెడుతుంది. అలా ఎందుకు చేసావ్ నోటితో చెప్పొచ్చు కదా మౌనవ్రతమా అంటాడు సుభాష్. అత్త వ్రతం అంటూ అపర్ణ పెట్టిన కండిషన్ గురించి చెప్తుంది చిట్టి. మా పెద్దరికానికి విలువ లేకుండా పోతుంది అని కొడుక్కి కంప్లైంట్ ఇస్తుంది. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాము అమ్మని ఇబ్బంది పెట్టొద్దు అంటాడు రాజ్. నువ్వు కూడా ఆ తానులో గుడ్డవే కదా పెళ్ళాన్ని వర్షంలో నిలబెట్టావు అని మనవడిని కూడా మందలిస్తుంది చిట్టి.
కావ్య వాళ్ళ తల్లిదండ్రులు ఆమెని తీసుకు వెళ్ళిపోతుంటే నేనే ఆపాను. నన్ను నమ్మి వాళ్ళు తనని ఈ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తే నువ్వు ఇంత పని చేస్తావా అని భార్యని మందలిస్తాడు సుభాష్. నేను అత్తగారికి ఆంక్షలు పెట్టిన మాట నిజమే అందుకు క్షమాపణలు చెప్తున్నాను కానీ ఈ కావ్యని మాత్రం జీవితంలో కోడలుగా అంగీకరించలేను తను వచ్చిన తర్వాతే మీకు నాకు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి అని తన నిర్ణయాన్ని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆపర్ణ.
మరోవైపు రుద్రాణి వచ్చి స్వప్నని హాస్పిటల్ కి వెళ్దాం రమ్మంటుంది. ఈరోజు డాక్టర్ రాలేదట అని స్వప్న చెప్తుంది. ఏం పర్వాలేదు మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి స్వప్న ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు రుద్రాణి, రాహుల్. టెన్షన్ పడుతూనే వాళ్ళ వెనక బయలుదేరుతుంది స్వప్న. మరోవైపు కూతురు రాలేదని ఎదురు చూస్తూ ఉంటాడు కృష్ణమూర్తి. ఇంతలోనే కావ్య ఫోన్ చేసి ఈరోజు రావడం కుదరదు ఆఫీసుకు సంబంధించిన పని ఉంది అని కావ్య చెప్పటంతో భర్తకి ఆఫీస్ పనులు చేస్తున్నందుకు ఆమెని మెచ్చుకుంటూ ఫోన్ పెట్టేస్తారు కృష్ణమూర్తి దంపతులు.
తరువాత కావ్య ని తలచుకొని గర్వంగా ఫీల్ అవుతారు. మరోవైపు హాస్పిటల్ కి వెళ్లిన రుద్రాణి వాళ్ళని వెయిట్ చేయండి డాక్టర్లు వస్తారు అని రిసెప్షన్ చెప్తుంది. వెయిటింగ్ హాల్లో కూర్చున్న స్వప్నకి టెన్షన్ తో చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏసీలో ఉన్నా ఎందుకు చెమటలు పడుతున్నాయి అంటుంది రుద్రాణి. హాస్పిటల్ ఎట్మాస్ఫియర్ పడదు అని అత్తగారికి చెప్తుంది కానీ నిజం బయటపడితే ఇటు నుంచి ఇటే బయటికి పంపించేసేలాగా ఉన్నారు అని భర్తని అత్తని తలుచుకొని మరింత టెన్షన్ పడుతుంది.
ఈలోపు డాక్టర్ అసిస్టెంట్ వచ్చి అర్జెంట్ కేసు ఉంది మీరు ఇంకొక 20 నిమిషాలు వెయిట్ చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నారు. మీకు విలువ ఇవ్వని హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ చేయించుకోను పదండి వెళ్ళిపోదాం అంటుంది స్వప్న. ఇప్పుడు ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు వాళ్ళు వెయిట్ చేయమనే కదా చెప్పారు.
రేపు అంటే మళ్లీ నాకు అవ్వదు అని చెప్పి స్వప్నకి చివాట్లు పెట్టి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు రాహుల్ వాళ్ళు. మరోవైపు మహిళా సమాజం సభ్యులు కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇంత డబ్బు ఉన్న వాళ్ళు అయినప్పటికీ మట్టి తొక్కుతున్నారు, భార్యకి అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు అని చెప్పి రాజ్ కి సన్మానం చేస్తాం అంటారు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అంటాడు రాజ్.
అలా అనటం మీ సంస్కారం. బహుశా మీ తల్లి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది ఈ సంస్కారం అంటారు మహిళా సమాజం వాళ్ళు. అవును ఇదంతా మా అత్తగారు గొప్పతనమే అంటూ భర్తని అత్తగారిని పొగుడుతుంది కావ్య. తరువాయి భాగంలో వరలక్ష్మీ వ్రతం ఇన్నాళ్లు నా పెద్ద కోడలు అపర్ణ చేసేది, ఇప్పుడు తన కోడలు కావ్యకి ఈ బాధ్యత అప్పజెప్తున్నాను అంటుంది చిట్టి. అందుకు సీరియస్ అవుతుంది అపర్ణ.