- Home
- Entertainment
- Karthika Deepam: బెడిసికొట్టిన శోభ ప్లాన్.. స్వప్నకు సూపర్ షాకిచ్చిన నిరుపమ్.. నా పెళ్లి నా ఇష్టం అంటూ!
Karthika Deepam: బెడిసికొట్టిన శోభ ప్లాన్.. స్వప్నకు సూపర్ షాకిచ్చిన నిరుపమ్.. నా పెళ్లి నా ఇష్టం అంటూ!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుయింది. ఇక ఈ రోజు జూన్ 7వ తేదీన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే నిరుపమ్ (Nirupam) జరిగినదానికి జ్వాలకు సారీ చెబుతాడు. ఇక జ్వాల (Jwala) నాకు కోపం ఏమీ లేదు మీరేమన్నా నేను పడతాను అని అంటుంది. అంతే కాకుండా హిమను జ్వాల మెచ్చుకుంటుంది. మరోవైపు స్వప్న నా పరువు తీసావు అంటూ శోభపై విరుచుకు పడుతుంది. ఇక హిమే మన పరువు కాపాడింది అని అంటుంది.
మరోవైపు సప్న (Swapna) నిరూపమ్ (Nirupam) తో నువ్వు శోభను పెళ్లి చేసుకోక తప్పదు అని అంటుంది. ఇక నిరూపమ్ నా లైఫ్ నా ఇష్టం.. కాపురం చేయాల్సింది నేను.. మీకు ఈ విషయంలో హక్కు లేదు అన్నట్లుగా మాట్లాడుతాడు. ఇక సత్య మనం వాళ్ళ క్షేమం గురించి ఆలోచించే వాళ్ళం అయితే.. వాళ్ల పెళ్లి నిర్ణయం వాళ్ళకి వదిలేద్దాం అని అంటాడు.
ఇక నిరూపమ్ (Nirupam) నాకు కాబోయే భార్య ని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్ అది తప్పు కాదా అని అంటాడు. స్వప్న (Swapna) నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే మీ అమ్మ బ్రతికి ఉండదు అని నిరూపమ్ కి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు ప్రేమ్ హిమ కు తాను పంపిన వీడియో చూడలేదని హిమ దగ్గరకు వెళ్లి మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక హేమ ఫోన్ రిపేర్ కి ఇచ్చింది అన్న సంగతి తెలిసి మళ్లీ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఇక నిరూపమ్ (Nirupam) ను సత్య వాళ్ల ఇంట్లో చూసి జ్వాల (Jwala) ఆశ్చర్యపోతుంది. మీరు ఇక్కడున్నారు ఏంటి అని అడుగుతుంది. ఇక నిరూపమ్ హిమ ను ఉద్దేశించి ఒక మాట చెబుతాడు. కానీ జ్వాల తన గురించి అన్నాడేమో అని మనసులో మరింత ప్రేమను పెంచుకుంటుంది. ఈ క్రమంలో సత్య ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే బాగుంటుంది అని అంటాడు. ఈ లోపు నిజంగానే అక్కడకు స్వప్న వస్తుంది.
ఇక నువ్వు ఇంటి నుంచి వచ్చినప్పటినుంచి నాకు అందర్నీ వదులుకున్న అనే ఫీలింగ్ కలుగుతుంది అని సప్న నిరూపమ్ (Nirupam) తో చెబుతుంది. ఇక నేను కూడా మీతోపాటే ఇక్కడ ఉండాలని వచ్చాను అన్నట్లు చెబుతుంది. దానికి సత్య (Sathya) ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాడు. ఇక స్వప్న నువ్వు టిఫిన్ లు మోయ్యాల్సిన అవసరం లేదు అని జ్వాల కు దీటుగా చెబుతుంది. ఇక నేను ఇలా మారడానికి శోభ కారణం అని అంటుంది.
ఇక తరువాయి భాగంలో నేను మీరు చేయలేని మంచి పని చేశాను అని శోభ (Sobha)..హిమ జ్వాల ల తో అంటుంది. ఈ దెబ్బతో నీ కనెక్షన్ కట్ .. నీ లంచ్ బాక్స్ లు కట్ అంటూ ఇద్దరిని దెప్పి పొడుస్తుంది. ఈ లోపు అక్కడకు స్వప్న (Swapna) వచ్చి శోభ మా కుటుంబంలో ఒకటి కాబోతుంది అని అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.