- Home
- Entertainment
- నార్మల్ జీవితంలోకి సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి.. రెడ్ బాడీకాన్ డ్రెస్ లో సూపర్ హాట్ గా
నార్మల్ జీవితంలోకి సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి.. రెడ్ బాడీకాన్ డ్రెస్ లో సూపర్ హాట్ గా
హీరోయిన్ రియా చక్రవర్తి తిరిగి తన నార్మల్ జీవితంలోకి ప్రవేశించారు. కెరీర్ పై ఫోకస్ పెట్టి నటిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. నెలల తరబడి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రియా చక్రవర్తి సూపర్ హాట్ గ్లామర్ షూట్స్ చేస్తుంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రియా చక్రవర్తి (Rhea chakraborthy) జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆమెతో పాటు కుటుంబం మొత్తం అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జూన్ 14, 2020 యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సంఘటన రియా కెరీర్ ని అగాధంలోకి నెట్టేసింది.
సుశాంత్ (Sushanth Singh Rajput)మరణానికి రియాను బాధ్యురాలిని చేస్తూ, చట్టం, సోషల్ మీడియా ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సుశాంత్ మరణానికి సంబంధించి పలుమార్లు ఆమె విచారణ ఎదుర్కొన్నారు. సుశాంత్ సంపద మొత్తం దోచేసిన రియా... అతన్ని మోసం చేసిందని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.
సుశాంత్ డెత్ కేసులో అనుమానితురాలిగా మొదలైన విచారణ... డ్రగ్స్ కేసుగా మలుపు తిరిగింది. ఈడీ, నార్కోటిక్ అధికారులు ఆమెను విచారించారు. రియాతో పాటు ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తికి డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలున్నాయని తేల్చారు. షోవిక్, రియాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రియా దాదాపు నెల రోజులు జైలు జీవితం గడిపారు.
వీటన్నింటికీ మించి సోషల్ మీడియాలో రియాపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. రేప్ చేస్తామంటూ, చంపేస్తామంటూ, పచ్చిబూతులతో రోజూ కామెంట్స్. ఈ కామెంట్స్ భరించలేక నెలల పాటు రియా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.
రియా కెరీర్ పూర్తిగా ప్రశ్నార్థకమైంది. రియాకు సినిమాలో రోల్ ఇస్తే ఆ సినిమా మటాషే అన్న పరిస్థితి. సుశాంత్ మృతిపై కోపంతో అలియా భట్ సడక్ 2 చిత్రాన్ని ఎవరూ చూడలేదు. బాలీవుడ్ లోనే అత్యంత చెత్త చిత్రంగా ఆ సినిమాను రికార్డులు ఎక్కేలా చేశారు. అలియాకే సుశాంత్ ఫ్యాన్స్ సెగ అలా ఉంటే, ఇక రియా పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
కాలం గడిచే కొద్దీ రియా తప్పేం లేదని చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. ఆమెకు సోషల్ మీడియా వేధింపులు తగ్గాయి. దీంతో ఆమె నార్మల్ లైఫ్ లోకి తిరిగి అడుగుపెట్టారు. 2021 లో విడుదలైన చేహరే మూవీలో రియా నటించారు. కాగా రియా కెరీర్ మొదలైంది టాలీవుడ్ లోనే. తూనీగా తూనీగా ఆమె మొదటి చిత్రం.