MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చచ్చినా కూడా సుశాంత్ ను వదిలిపెట్టవా..? రియా చక్రవర్తిని ఏకిపడేస్తున్న హీరో ఫ్యాన్స్

చచ్చినా కూడా సుశాంత్ ను వదిలిపెట్టవా..? రియా చక్రవర్తిని ఏకిపడేస్తున్న హీరో ఫ్యాన్స్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన సామాన్యుడు. ఎంతో మంది హృదయాలను తన నటనతో.. తన బిహేవియర్ తో గెలుచుకున్న యువకుడు. చాలా చిన్నవయస్సులో ఈలోకాన్ని వదిలివెళ్లిన బాలీవుడ్ హీరో.. కాని ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీనే. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 24 2023, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన సామాన్యుడు. ఎంతో మంది హృదయాలను తన నటనతో.. తన బిహేవియర్ తో గెలుచుకున్న యువకుడు. చాలా చిన్నవయస్సులో ఈలోకాన్ని వదిలివెళ్లిన బాలీవుడ్ హీరో.. కాని ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీనే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సుశాంత్ మరణానికి కారణం ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అంటూ.. గట్టిగానే వాదనలువినిపించాయి. అంతే కాదు ఆమె వల్ల సుశాంత్ చాలా కష్టాలు పడ్డాడని. ప్రేమించిన పాపానికి సుశాంత్ ను టార్చర్ పెట్టేదని మాటలు గట్టిగా వినిపించాయి. ఈక్రమంలో సుశాంత్ మరణంతో కొన్నాళ్లు జైల్లో గడిపి వచ్చింది రియా చక్రవర్తి. అప్పటి నుంచి సైలెంట్  ఉంటోంది. 

38

ఇక నిన్న  సుశాంత్ రాజ్ పుత్ పుట్టిన రోజు సందర్భంగా గతంలో సుశాంత్ తో దిగిన  ఫొటోలను రియా తన సోషల్ మీడియా ఖాతాలో  షేర్ చేసింది. కాఫీ మగ్స్ వెనుక దాక్కున్న ఫొటో ఒకటి, అలానే బెడ్ పై పడుకొని తీసుకున్న సెల్ఫీలను పంచుకుంది. 

48

ఇక ఈ  ఫొటోలపై మండిపడుతున్నారు సుశాంత్ సింగ్ ఫ్యాన్స్. ఆమెపోస్ట్ పై నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. చేసిందంతా చేసి.. ఇప్పుడు మొసలికన్నారు కారుస్తుంది.. ఇంకా సుశాంత్ ని వదిలిపెట్టవా..? అంటూ కొందరు రియాని ట్రోల్ చేస్తున్నారు. సింపతీ కోసం ఇదంతా చేస్తుందంటూ ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

58

అంతే కాదు నువ్ ఎన్ని పోస్ట్ లు పెట్టినా.. చేసిన పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది.. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు అంటూ..  ఆమెని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా..  తనపై ఈ రేంజ్ లో  ట్రోలింగ్ జరుగుతున్నా.. రియా మాత్రం ఆ ఫొటోలను డిలీట్ చేయలేదు.

68

నటి రియా చక్రవర్తి బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో కూడా ఓ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ హీరోయిన్ గా ఆమె పాపులర్ కాలేకపోయింది. కానీ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ గా ఆమెకి గుర్తింపు ఉంది. 

78
Sushant Singh's birthday girlfriend Rhea Chakraborty's emotional post...

Sushant Singh's birthday girlfriend Rhea Chakraborty's emotional post...

సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి పరోక్షంగా ఆమెనే కారణమంటూ అప్పట్లో పుకార్లు వినిపించాయి. సుశాంత్ తండ్రి కూడా ఆమెపై ఆరోపణలు చేశారు. ఆ తరువాత డ్రగ్ కేసులో ఇరుక్కుంది రియా చక్రవర్తి.

88
Rhea Chakraborty

Rhea Chakraborty

ఈ కేసులో ఆమె జైలుకి కూడా వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై దారుణమైన ట్రోలింగ్ నడిచింది. దీంతో కొన్నాళ్లపాటు సైలెంట్ అయిపోయింది రియా చక్రవర్తి. ఇప్పుడిప్పుడే మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Chaitanya: ఎలాంటి పాటని ఎలా చేశావు బ్రో.. నాగ చైతన్య సాంగ్ తో నవ్వులే నవ్వులు, సోషల్ మీడియా షేకింగ్
Recommended image2
Yash Radhika Pandit: యష్, రాధికా జాతకాలు కలవలేదా.. అయినా ఇంత అన్యోన్యంగా ఉండటానికి కారణం అదే!
Recommended image3
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved