అమ్మ మీద అలాంటి కామెంట్స్ చేశారు.. రెండో పెళ్లి ఆలోచనపై సురేఖ వాణి కూతురు
నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
అప్పుడప్పుడూ వీరిద్దరూ పోస్ట్ చేసే పిక్స్, విడియోలపై ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ తమపై వచ్చే ట్రోలింగ్ కి సురేఖ వాణి, సుప్రీత రియాక్ట్ అవ్వరు. ఎవరైనా ఆకతాయిలు అతిగా ప్రవర్తించినపుడు మాత్రం ఘాటుగా బదులిస్తారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రీతా తన తల్లి సురేఖ వాణిపై వచ్చే కామెంట్స్ కి స్పందించింది. మా నాన్న చనిపోయాక అమ్మ చాలా రోజులు ఇంట్లోనే బాధపడుతూ ఉండేది. అది చూసి నాకు కూడా బాధగా అనిపించేది. సాధారణంగా ఫ్రెండ్స్ వీకెండ్ పార్టీలు చేస్తుంటారు. అమ్మని ఆబాధ నుంచి దూరం చేయాలని బలవంతం చేసి పార్టీకి తీసుకువెళ్లాను.
ఆ ఫోటోలని షేర్ చేస్తే ఎన్నో కామెంట్స్ చేశారు. వీళ్లేంది.. వీళ్ళ బట్టలు ఏంటి అంటూ కామెంట్స్ పెట్టారు. దానికి నా సమాధానం ఒక్కటే.. మా ఇంటి రెంట్, బిల్స్ వీళ్ళెవరూ పే చేయడం లేదు. వీళ్ళ కామెంట్స్ నేనెందుకు పట్టించుకోవాలి అని అన్నారు.
ఇక 'నేను యస్ చెప్పాను' అనే పోస్ట్ పెట్టినప్పుడు కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ అమ్మ అడిగింది. నేను ఒక్కటే చెప్పాను. అలాంటివి పట్టించుకోవద్దు అని చెప్పాను. నేను యస్ చెప్పింది లవ్ ఎఫైర్ అని కాదు, మ్యూజిక్ వీడియోకి అంటూ సుప్రీతా మరో పోస్ట్ లో క్లారిటీ ఇచ్చింది. తన లైఫ్ లో కిస్సులు, హగ్గులు జరగలేదని సుప్రీతా క్లారిటీ ఇచ్చింది.
ఇక తన తల్లి రెండవ వివాహంపై సుప్రీత క్లారిటీ ఇచ్చింది. మా అమ్మ రెండో వివాహం చేసుకుంటుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ నేను ట్రై చేస్తా. కానీ ఇప్పుడే కాదు. ఇంకా రెండు మూడేళ్ళ తర్వాత అని సుప్రీత క్లారిటీ ఇచ్చింది.