Surekha Vani: సురేఖ వాణి సీక్రెట్ ఎఫైర్ రివీల్.. లీక్ చేసిన కూతురు, త్వరలోనే పెళ్లి ?
నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.
నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
అప్పుడప్పుడూ వీరిద్దరూ పోస్ట్ చేసే పిక్స్, విడియోలపై ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ తమపై వచ్చే ట్రోలింగ్ కి సురేఖ వాణి, సుప్రీత రియాక్ట్ అవ్వరు. ఎవరైనా ఆకతాయిలు అతిగా ప్రవర్తించినపుడు మాత్రం ఘాటుగా బదులిస్తారు.
ఇదిలా ఉండగా ఇటీవల సురేఖ వాణి వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువవుతున్నాయి. తన భర్త మరణం తర్వాత సురేఖ వాణి సింగిల్ గా ఉంటోంది. సురేఖ వాణి కుమార్తె సుప్రీతా పలు సందర్భాల్లో తన తల్లికి సరైన సమయంలో రెండో వివాహం చేస్తానని పేర్కొంది.
తాజాగా ఇంటర్వ్యూలో సుప్రీత.. సురేఖ వాణి రిలేషన్ షిప్ స్టేటస్ ని రివీల్ చేసింది. ఇంటర్వ్యూలో పొరపాటుగా తన తల్లి కొత్త బాయ్ ఫ్రెండ్ మ్యాటర్ ని సుప్రీత లీక్ చేసింది. ఇంటర్వ్యూలో సురేఖ వాణి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి మేమిద్దరం సింగిల్.. మాకు బాయ్ ఫ్రెండ్స్ కావాలి అని పేర్కొంది. సో ఆమె రిలేషన్ షిప్ కి రెడీ అని సంకేతాలు ఇచ్చింది.
మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అని యాంకర్ ప్రశ్నించారు. దీనితో సురేఖ వాణి సిగ్గు పడకుండా పెద్ద లిస్ట్ చెప్పుకొచ్చింది. నన్ను అర్థం చేసుకోవాలి, మంచి హైట్, కాస్త గడ్డం ఉండాలి.. డబ్బు కూడా ఉండాలి అని పేర్కొంది. దీనితో వెంటనే సుప్రీతా.. సురేఖ వాణి సీక్రెట్ ఎఫైర్ ని అనుకోకుండా లీక్ చేసింది.
కెమెరా వైపు చూస్తూ.. సార్ మీకు ఆ క్వాలిటీస్ ఏమీ లేవు కదా అని చెప్పేసింది. దీనితో సురేఖ వాణికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే మ్యాటర్ స్పష్టం అయింది. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవ్వరు అని ప్రశ్నించగా పేరు చెప్పడానికి మాత్రం ఎవరూ ఇష్టపడలేదు.
మీ అమ్మకు పెళ్లి చేస్తారా అని సుప్రీతని ప్రశ్నిస్తే.. త్వరలోనే పెళ్లి చేస్తాను అని బదులిచ్చింది. దీనితో సురేఖ వాణి త్వరలో రెండో వివాహాం చేసుకోబోతోంది అనే రూమర్స్ బలపడ్డాయి. 45 ఏళ్ల వయసులో కూడా సురేఖ వాణి గ్లామర్ తో అదరగొడుతోంది.