MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూపర్ స్టార్ కృష్ణ టోటల్ ఫ్యామిలీ డిటేయిల్స్.. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ చూడని అరుదైన ఫొటోలు!

సూపర్ స్టార్ కృష్ణ టోటల్ ఫ్యామిలీ డిటేయిల్స్.. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ చూడని అరుదైన ఫొటోలు!

నట శేఖరుడు, సాహసాల వీరుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Krishna). తాజాగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన యాదిలో కృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన రేర్ పిక్స్ కొన్ని అభిమానుల కోసం..

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 15 2022, 07:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నట శేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ పూర్తి పేరు.. ఘట్టమనేని  శివ రామ కృష్ణ మూర్తి (Krishna Ghattamaneni). ఘట్టమనేని రాఘవయ్య చౌదరి - నాగరత్నమ్మ దంపతులకు మే 31న 1943లో ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా  తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. వీరిది మధ్య ఆదాయ, వ్యవసాయ ఆధారిత కుటుంబం. కృష్ణతో కలిపి మొత్తం ఐదుగురు తోబుట్టువులు. అందిరిలోకెల్లా కృష్ణ పెద్దవాడు. 
 

26

తెనాలి, నర్సాపూర్ లో పదోతరగతి, ఇంటర్మీడియేట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏలూరులో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించాడు. శోభన్ బాబు, మురళీ మోహన్ కాలేజీ చదువుకునే రోజుల్లోనే కలవడంతో సినీ రంగంవైపు అడుగులు వేశారు. ఇక డిగ్రీ పూర్తయ్యాక ఇందిరాదేవి (Indira Devi)ని 1962 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నాడు. 
 

36

1965లో కృష్ణ - ఇందిరా దేవి వారి మొదటి సంతానమైన రమేష్ బాబు ఘట్టమనేనికి జన్మనిచ్చారు. ఆ ఏడాదే ‘తెనే మనస్సులు’ అనే చిత్రంతో కృష్ణ చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మూడేండ్లకు 1968లో కృష్ణకు కుమార్తె పద్మావతి జన్మించింది. 1970లో మంజుల ఘట్టమనేని, 1975లో సూపర్ స్టార్  మహేష్ బాబు, 1979లో ప్రియదర్శినికి జన్మనిచ్చారు. 
 

46

ఇక 1969లోనే కృష్ణ, అలనాటి నటి విజయ నిర్మలని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య ఇందిరాదేవితో ముగ్గురు పిల్లలకు జన్మినిచ్చాక రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే విజయ నిర్మలకు కొడుకు నరేష్ ఉండటంతో కృష్ణ.. తదుపరి బాధ్యతలను నిర్వర్తించారు. ఇప్పటికీ నటుడు నరేశ్ కృష్ణ ఫ్యామిలీతో ఎంతో ప్రేమగా ఉంటున్న విషయం తెలిసిందే.
 

56

మొదటి భార్య ఇందిరాతో ఐదుగురు పిల్లలకు జన్మిచ్చారు. వీరిలో ఇద్దరు కుమారులు. ముగ్గురు కుమార్తెలు. రమేష్ బాబు (Ramesh Babu), మహేష్ బాబు (Mahesh Babu). కూతుర్లు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. రమేష్ బాబు సినిమా నిర్మాత కాగా.. మహేష్ బాబు తెలుగు సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఇకరి స్థానం సంపాదించుకున్నాడు. రమేశ్ బాబు గతేడాది మరణించిన విషయం తెలిసిందే.
 

66

కూతురు పద్మావతికి పొలిటిషన్ గల్లా జయదేవ్‌తో వివాహం జరిపించారు. రెండో కూతురు మంజులకు నిర్మాత, నటుడు సంజయ్ స్వరూప్‌ను ఇచ్చి వివాహం చేశారు. ఇక చిన్న కూతురు ప్రియదర్శిని నటుడు, నిర్మాత సుధీర్ బాబును పెళ్లి చేసుకుంది.  సుధీర్ కూడా ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ఒకరిగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబుకు కూతరు సితారా, కొడుకు గౌతమ్ ఘట్టమనేని ఉన్న విషయం తెలిసిందే.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image2
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image3
Rajasekhar: అందుకే నాకు సాయికుమార్ డబ్బింగ్ చెప్తారు.. క్లారిటీ ఇచ్చేసిన రాజశేఖర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved