- Home
- Entertainment
- ఆ మూవీ హిట్ అయితే మహేష్ ఎప్పటికీ స్టార్ కాలేడు, ఫ్లాప్ కావాలని కోరుకున్న సూపర్ స్టార్ కృష్ణ..నమ్రతతో ఆరోజు
ఆ మూవీ హిట్ అయితే మహేష్ ఎప్పటికీ స్టార్ కాలేడు, ఫ్లాప్ కావాలని కోరుకున్న సూపర్ స్టార్ కృష్ణ..నమ్రతతో ఆరోజు
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆయన తండ్రి కృష్ణ బ్యాక్ బోన్ లా నిలిచారు. కెరీర్ బిగినింగ్ లో మహేష్ కి కృష్ణ అవసరమైన సపోర్ట్ మొత్తం అందించారు. అయితే కథల ఎంపికలో ఫైనల్ డెసిషన్ మాత్రం తనదే అని మహేష్ బాబు తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆయన తండ్రి కృష్ణ బ్యాక్ బోన్ లా నిలిచారు. కెరీర్ బిగినింగ్ లో మహేష్ కి కృష్ణ అవసరమైన సపోర్ట్ మొత్తం అందించారు. అయితే కథల ఎంపికలో ఫైనల్ డెసిషన్ మాత్రం తనదే అని మహేష్ బాబు తెలిపారు. మహేష్ బాబు నటించిన చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణకి ఇష్టం లేని చిత్రాలు కూడా ఉన్నాయి.
నాన్నకి మురారి చిత్రం అంటే చాలా ఇష్టం అని మహేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ మూవీలో మహేష్ నటన చూసి కృష్ణ భావోద్వేగానికి గురయ్యారట. ఇక ఇష్టం లేని చిత్రం కూడా ఒకటి ఉంది.
2004లో మహేష్ బాబు ఎస్ జె సూర్య దర్శకత్వంలో నాని అనే చిత్రంలో నటించాడు. సైన్స్ ఫిక్షన్ కథగా ప్రయోగాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ డిజాస్టర్ అయింది. రిలీజ్ కి ముందే కృష్ణ ఈ చిత్రాన్ని ప్రీమియర్ షో చూశారట. మూవీ చూసిన వెంటనే ఈ సినిమా కనుక హిట్ అయితే మహేష్ బాబు స్టార్ హీరో కాదు అని అనేశారట.
Mahesh Babu
కృష్ణ అంత పెద్ద మాట ఎందుకు అన్నారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆయన మాటలకు అర్థం మహేష్ బాబు వివరించారు. స్టార్ హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదు అనేది కృష్ణ ఒపీనియన్. ఇలాంటి చిత్రాలని ప్రేక్షకులు స్టార్ హీరోల నుంచి ఆశించరు అని కృష్ణ అన్నారు. నాని చిత్రం తనకి ఒక లెసన్ అని మహేష్ బాబు తెలిపారు.
ఇక శ్రీమంతుడు చిత్రం కూడా తన లైఫ్ లో మెమొరబుల్ మూవీ అని మహేష్ బాబు అన్నారు. కథ వినగానే ఇది నా లైఫ్ లోనే స్పెషల్ మూవీ అనిపించింది. ఎందుకంటే ఈ చిత్రంలో ప్రతి అంశం ఉంది. డైరెక్టర్ కొరటాల శివ దాదాపు 40 నిముషాలు నాకు కథ చెప్పారు. ఒక ప్యాకేజ్ లాగా ఈ కథ ఉంటుంది.
ఇలాంటి కథ దొరకడం చాలా అదృష్టం. కథ వినగానే ఆ రోజు నమ్రతతో కూడా చెప్పా. ఈ రోజు చాలా మంచి కథ విన్నానని చెప్పా. కథని నమ్మి అదే విధంగా కష్టపడ్డాం. మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి మా టెన్షన్ మొత్తం ఒక్కసారిగా దిగిపోయింది అని మహేష్ బాబు అన్నారు.