MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Superstar Krishnaతో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌

Superstar Krishnaతో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణతో సినిమా ప్రారంభించగా అది ఆగిపోయింది. మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు. అయినా ఎక్కడా తగ్గలేదు.  మహేష్‌ తో ఇండస్ట్రీ షేక్‌ అయ్యే హిట్‌ కొట్టాడు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : May 11 2026, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తండ్రితో సాధ్యం కాలేదు, కొడుకుతో ఇండస్ట్రీ హిట్‌
Image Credit : our own

తండ్రితో సాధ్యం కాలేదు, కొడుకుతో ఇండస్ట్రీ హిట్‌

చిత్ర పరిశ్రమలో ఏ క్షణంలో అయినా మిరాకిల్స్ జరగొచ్చు. ఇక్కడ ఓపిక, సహనం చాలా అవసరం. మన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపొద్దు. అవే కొన్నిసార్లు పెట్టుబడిగా మారతాయి. అలాంటి సందర్భమే ఒక స్టార్‌ డైరక్టర్‌ విషయంలో జరిగింది. ఒక ఇండస్ట్రీ హిట్‌ కోసం ఆయన దాదాపు 9ఏళ్లు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. మొదట సూపర్‌ స్టార్‌ కృష్ణతో సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సూపర్‌ హిట్‌ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు, కానీ ఒక్కటి మాత్రం జరగడం లేదు. రవితేజతోనూ బ్లాక్‌ బస్టర్‌ తీశాడు, కానీ సంతృప్తి లేదు. మహేష్‌ బాబు మూడు సార్లు రిజెక్ట్ చేశాడు. అయినా తగ్గలేదు. ఒక సినిమా విషయంలో తొమ్మిదేళ్లు వెయిట్‌ చేశాడు. చివరికి తండ్రితో సాధ్యం కాలేదు, కొడుకుతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు.ఇండస్ట్రీని షేక్‌ చేశాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
కృష్ణతో దర్శకుడిగా పరిచయం కావాల్సిన పూరీ జగన్నాథ్‌
Image Credit : facebook/@SuperstarNatasekharaKrishna

కృష్ణతో దర్శకుడిగా పరిచయం కావాల్సిన పూరీ జగన్నాథ్‌

ఇప్పటికే ఆ దర్శకుడు ఎవరు? ఆ మూవీ ఏంటో అర్థమై ఉంటుంది. ఆ స్టార్‌ డైరెక్టర్‌ ఎవరో కాదు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. ఆయన కృష్ణవంశీ, రామ్‌ గోపాల్‌ వర్మల వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ప్లాన్‌ చేశారు. సినిమా ఓకే అయ్యింది. ప్రారంభం కూడా జరుపుకుంది. దీనికి `తిల్లాన` అనే టైటిల్‌ని  అనుకున్నారు. కానీ ఆ తర్వాత సినిమా ఆగిపోయింది. నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకున్న నేపథ్యంలో సినిమాని ఆపేశారు. దీంతో మళ్లీ మొదటికొచ్చింది కథ. ఆ తర్వాత దాదాపు మూడేళ్లు కథలు పట్టుకొని తిరిగాడు పూరీ.

Related Articles

Related image1
Comedian Ali: ప్రివ్యూ షో చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. అలీతో పూరి జగన్నాధ్ చేసిన అద్భుతం ఏంటో తెలుసా ?
Related image2
Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది
36
సాలిడ్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేసిన పూరీ
Image Credit : facebook/@PuriJagannadh

సాలిడ్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేసిన పూరీ

ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్‌ ఓకే చెప్పాడు. మొదట ఆయన కూడా రిజెక్ట్ చేశాడు. క్లైమాక్స్ మార్చమని చెప్పాడు. కానీ మార్చకుండానే రెండోసారి కథ చెప్పాడు పూరీ. అదే పవన్‌కి నచ్చింది. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. అదే `బద్రి`. ఆ తర్వాత రవితేజకి బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు హిట్లు అందించారు. `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `ఇడియట్‌`, `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`తో హ్యాట్రిక్‌ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత ఏదో లోటు. సరైన సినిమా పడటం లేదు. మహేష్‌ బాబుని కలిసి మూడు కథలు చెప్పాడు. మూడూ రిజెక్ట్ చేశాడు. తాను దాచుకున్న కథ తీశాడు పూరీ. చాలా మంది హీరోలకు చెప్పాడు, అయినా వర్కౌట్‌ కాలేదు. పవన్‌ కళ్యాణ్‌ రిజెక్ట్ చేశాడు. రవితేజ చేస్తానని చెప్పి పక్కన పెట్టాడు, సోనూ సూద్‌తో చేయాలనుకున్నా వర్కౌట్‌ కాలేదు.

46
`పోకిరి` ముందు జరిగిన కథ
Image Credit : our own

`పోకిరి` ముందు జరిగిన కథ

ఇక చివరి ప్రయత్నంగా మరోసారి మహేష్‌ వద్దకే వెళ్లాడు పూరీ. కాకపోతే ఈ సారి సాలిడ్‌ కథతో వెళ్లాడు. మహేష్‌ కూడా రెండు మూడు కథలు వద్దు, సాలిడ్‌గా ఉండే ఒక్క కథ చెప్పమని చెప్పాడు. దీంతో తన అసలైన ఆయుధం బయటకు తీశాడు పూరీ. అదే `ఉత్తమ్‌ సింగ్‌ సన్నాఫ్‌ సూర్యనారాయణ`. స్క్రిప్ట్ చెప్పగానే ఫిదా అయిపోయాడు మహేష్‌. కొన్ని మార్పులు చెప్పాడు. ఆ మార్పులు పూరీ చేశాడు. మహేష్‌ బాబు స్వతహాగా తానే ప్రొడ్యూస్‌ చేయడానికి ముందుకు వచ్చాడు. తన అక్క మంజులని నిర్మాతని చేశాడు. అలా `పోకిరి` ప్రారంభమైంది. మహేష్‌బాబు, పూరీ జగన్నాథ్‌ కలవడానికి ముందు ఇంత కథ జరిగింది. కలిశాక ఇండస్ట్రీ షేక్‌ అయ్యింది.

56
టాలీవుడ్‌ని షేక్‌ చేసిన `పోకిరి`
Image Credit : Prime Video

టాలీవుడ్‌ని షేక్‌ చేసిన `పోకిరి`

2006లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో మహేష్‌ బాబు సరసన ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్‌ రాజ్‌ విలన్‌గా చేశారు. మహేష్‌కి తండ్రిగా నాజర్‌ చేశాడు. ఈ సినిమా సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 28న విడుదలైంది. ఫస్ట్ షోతోనే మైండ్‌ బ్లాక్‌ చేసింది. క్లైమాక్స్ చూసి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఆ క్లైమాక్స్ కోసమే చాలా మంది రిపీటెడ్‌గా చూశారని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో అప్పటి వరకు కలెక్షన్ల గురించి పెద్దగా చర్చ లేదు. ఎన్ని రోజులు ఆడిందనే దాన్ని బట్టే సినిమా విజయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కానీ `పోకిరి`తో కలెక్షన్లపై చర్చ ప్రారంభమైంది. ఈ మూవీ ఓవరాల్‌గా రూ.70కోట్ల గ్రాస్‌, రూ.40కోట్ల షేర్‌ సాధించింది. టాలీవుడ్‌లో మొదటిసారి యాభై కోట్లు దాటిన సినిమాగా, ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. ఈ మూవీ గురించి మహేష్‌ బాబు ఎప్పుడూ ప్రత్యేకంగా చెబుతారు. పూరీ గురించి ప్రత్యేకంగా చెబుతారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ సైతం సినిమా చూసి ఫిదా అయ్యారు. సినిమా చూసి మహేష్‌ని ప్రత్యేకంగా అభినందించారట. అలా కృష్ణతో సినిమా చేయలేకపోయిన పూరీ, ఆ తర్వాత మహేష్‌తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు పూరీ.

66
రమాప్రభ చెప్పిన మాట నిజమైంది
Image Credit : youtube/99tv

రమాప్రభ చెప్పిన మాట నిజమైంది

అయితే కృష్ణతో సినిమా చేసేటప్పుడే సీనియర్‌ నటి రమాప్రభ ఒక మాట అన్నారట. కృష్ణతో సినిమా ఆగిపోయినప్పుడు పూరీ చాలా బాధపడ్డాడట. దర్శకుడిగా పరిచయం కావాల్సిన సినిమా ప్రారంభమై ఆగిపోవడంతో చాలా కుంగిపోయాడు. ఆ సమయంలో పూరీ బాధని చూసిన నటి రమాప్రభ .. ఎందుకు అలా బాధపడటం, కృష్ణగారి సినిమా ఆగిపోతేనేమి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళబ్బాయితో పెద్ద హిట్ కొడతావేమో ?` అని అన్నారట. సరిగ్గా 9ఏళ్లకు అదే నిజమైంది. దీంతో ఆమె మాటలను పూరీ ఎప్పటికీ మర్చిపోలేరట. ఆమెని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారట. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Comedian Ali: ప్రివ్యూ షో చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. అలీతో పూరి జగన్నాధ్ చేసిన అద్భుతం ఏంటో తెలుసా ?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: తెరపైకి సుమిత్ర తండ్రి- శివన్నారాయణ విశ్వరూపం- తల బాదుకున్న సుమిత్ర
Recommended image3
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Related Stories
Recommended image1
Comedian Ali: ప్రివ్యూ షో చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. అలీతో పూరి జగన్నాధ్ చేసిన అద్భుతం ఏంటో తెలుసా ?
Recommended image2
Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved