రజినీకాంత్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ఏదో తెలుసా..?
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం ఆయన సినిమాకు 200 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే అన్ని కోట్లు తీసుకునే రజినీ.. రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ఏంటో తెలుసా..?

తమిళంతో పాటు సౌత్ నార్త్ తేడా లేకుండా స్టార్ గా ఎదిగాడు...సూపర్ స్టార్ రజినీకాంత్. సౌత్ లోనే కాదు.. ఇండియాలో కూడా మొదటి 100 కోట్ల హీరో రజినీకాంత్. ఆయనకు తమిళంతో పాటు.. అన్ని భాషల్లో భారీగా ఇమేజ్ ఉంది. అయితే తమిళంలో మాత్రం లెజెండరీ డైరెక్టర్ ఎస్పీ ముత్తురామన్, రజనీకాంత్ ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. ఒక్క ఎస్ బి ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ మొత్తం 25 సినిమాల్లో నటించారు.
అప్పట్లో కనీసం ఏడాదికి రెండు మూడు సినిమాలైనా ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ నటించారు.1990వ దశకంలో..ఎస్‌బి ముత్తురామన్ హవా నడిచింది. ఆయన వరుస సినిమాలు తెరకెక్కించారు. దాంతో ఆయనకు ప్రత్యేకంగా టీమ్ ఉండేవారు. వారు ఇతర సినిమాలకు పనిచేసేవారు కాదు. ఆయన బృందంలో సినిమాటోగ్రాఫర్ వినాగం, ఎడిటర్ విట్టల్ మరియు మేకప్ ఆర్టిస్ట్ ముస్తఫాతో సహా 14 మంది కీలక సభ్యులు ఉన్నారు. .
అయితే వారుఇతర సినిమాలకు పనిచేయకపోవడంతో.. ఆయన టీమ్ లో 14 మంది టెక్నీషియన్లకు ఆర్ధికంగా తక్కువ డబ్బులు రావడం..ఇబ్బందులు ఎదురవ్వడం లాంటివి జరిగాయంట. ఈ విషయంలో ఎస్బి ముత్తురామన్ ఆందోళన చెందారట కూడా. అందుకే ఈ సమస్య గురించి రజనీకాంత్‌ని సంప్రదించి తన కోసం ఒక సినిమాలో నటించమని అభ్యర్థించాడు. ఆయన కోరిక మేరకు తీసిన సినిమా పాండ్యన్.
Rajinikanth
తక్కువ కాల్షీట్‌తో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమా పాండియన్. ఈ సినిమా టైటిల్‌లో కూడా రజనీ స్నేహం నేపథ్యంలో ఉంటుంది. అంతే కాదు... ఈసినిమా కోసం రజినీకాంత్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటించారని సమాచారం. ఈసినిమాను ఎస్‌బి ముత్తురామన్ స్వయంగా నిర్మించారు. సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందినందున, ఈ సినిమాలోని ఫైట్ సన్నివేశాన్ని కూడా ఏ వస్తువు పగలకుండా చిత్రీకరించారు.
వింటానికి విచిత్రంగా ఉన్నా.. ఈ సినిమాలోని ఫైట్ సీన్ లో రజనీపై దాడి చేస్తున్న వ్యక్తి అద్దం కొట్టబోతుంటే, రజనీ అతన్ని ఆపి, నేను ఉద్యోగం అడగడానికి వచ్చాను. నువ్వు ఇలా గ్లాస్ లు అవీ.. పగలగొడితే నాకు ఉద్యోగం రాదు. అందుకే కొట్టేస్తాను కానీ నువ్వు పగలకుండా పడిపోవాలి అని రజనీ చెప్పే డైలాగ్ కూడా హైలెట్ గా ఉంటుంది.
ఇక ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చేసిన సినిమా హిట్ అవ్వడంతో.. పాండియన్ సినిమాతో వచ్చిన లాభాన్ని డైరెక్టర్ కమ్ నిర్మాత ఎస్.బి.ముత్తురామన్‌తో సహా డివిజన్‌లోని 14 మంది పంచుకున్నారు. ఆ విధంగా పాండ్యన్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విఎ దురైకుమ్‌కి సినిమా లాభాల్లో వాటా ఇచ్చారు. దీంతో తాను ఇల్లు కొన్నానని రీసెంట్ గా ఓ సందర్భంలో ఆయన వెల్లడించారు.