- Home
- Entertainment
- Jailer Review:'జైలర్' ప్రీమియర్ షో టాక్.. ఫస్టాఫ్ లో అదొక్కటే మైనస్, రజనీకి సాలిడ్ కంబ్యాక్ దక్కినట్లేనా
Jailer Review:'జైలర్' ప్రీమియర్ షో టాక్.. ఫస్టాఫ్ లో అదొక్కటే మైనస్, రజనీకి సాలిడ్ కంబ్యాక్ దక్కినట్లేనా
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ గా తమన్నా నటించింది. ఇక రమ్యకృష్ణ, వసంత్ రవి కీలక పాత్రల్లో నటించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ గా తమన్నా నటించింది. ఇక రమ్యకృష్ణ, వసంత్ రవి కీలక పాత్రల్లో నటించారు. తలైవా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. సూపర్ స్టార్ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
దీనితో రజనీ అభిమానులు నెల్సన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఫస్ట్ డే ఫస్ట్ షోకి థియేటర్స్ వద్ద కోలాహలం నెలకొంది సెలవులు పెట్టి మరీ రజనీ అభిమానులు జైలర్ చిత్రానికి వెళుతున్నారు. యూఎస్ లో కూడా ప్రీమియర్ షోల సందడి మొదలయింది. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి నెల్సన్ దిలీప్ కుమార్ రజనీ ఫ్యాన్స్ కోరిక నెరవేర్చడా.. జైలర్ ఆకట్టుకున్నాడా అనేది ఇప్పుడు చూద్దాం.
2 గంటల 48 నిమిషాల నిడివిగల ఈ చిత్రం రాబరీ, మర్డర్ సన్నివేశాలతో ప్రారంభం అవుతుంది. తమిళనాడు అరక్కోణం అనే టౌన్ లో ఈ సంఘటనలు జరుగుతాయి. విలన్ ఎంట్రీ తర్వాత తలైవా రజనీకాంత్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ అనిరుద్ మాత్రం రజనీ ఎంట్రీకి బిజియం అదరగొట్టేశాడు. వసంత్ రవి రజనీకాంత్ కుమారుడిగా ఏసిపిగా ఎంట్రీ ఇస్తాడు. అయితే వెంటనే కథలో ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది.
ఫస్ట్ హాఫ్ లో యోగిబాబు, రజనీకాంత్ మధ్య కామెడీ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో వేగం పెంచడానికి దర్శకుడు కాస్త టైం తీసుకున్నాడు. ఈ లోపు యోగిబాబుతో ఫన్నీ సీన్స్, ఫ్యామిలీ సన్నివేశాలతో కథ సాగుతూ ఉంటుంది. అయితే ఫ్యామిలీ సీన్స్ అక్కడక్కడా బోరింగ్ గా అనిపిస్తాయి.
ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే విధంగా ట్విస్ట్ లు, కర్ణాటకకి స్టోరీ మారడం లాంటి అంశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఊహించని పరిస్థితుల్లో రజనీకాంత్ ఏం చేస్తారు అనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంటర్వెల్ వరకు దర్శకుడు యావరేజ్ అన్నట్లుగా కథని నడిపించారు. ఇంటర్వెల్ ఫైట్ ఆకట్టుకునే విధంగా.. సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగే విధంగా ఉంటుంది.
సెకండ్ హాఫ్ లో దర్శకుడు యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కించారు. రజని ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ ఫీలయ్యే విధంగా రచ్చ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో డల్ మూమెంట్స్ లేకుండా నెల్సన్ జాగ్రత్త పడ్డారు. అయితే సెకండ్ హాఫ్ లో మోహన్ లాల్ లాంటి హీరోల కామియో రోల్స్ వస్తూ పోతూ ఉంటాయి. రజనీ ఫ్యాన్స్ కోరుకునే విధంగా నెల్సన్ కొన్ని గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ పెట్టారు.
ఓవరాల్ గా జైలర్ చిత్రం రజనీకాంత్ కి మాత్రమే కాదు దర్శకుడు నెల్సన్ కి కూడా కంబ్యాక్ మూవీ అని అంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్ గా సాగినా సెకండ్ హాఫ్ పూర్తిగా ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. అనిరుధ్ తన బిజియంతో రజనీకి అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చారు.