MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కూతురి కెరీర్ ని రిస్క్ లో పెడుతున్న మహేష్ ? సూపర్ స్టార్ కి ఆ విషయం తెలియదా..

కూతురి కెరీర్ ని రిస్క్ లో పెడుతున్న మహేష్ ? సూపర్ స్టార్ కి ఆ విషయం తెలియదా..

సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బ్రాండ్స్ విషయంలో కూడా మహేష్ కి తిరుగులేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2022, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బ్రాండ్స్ విషయంలో కూడా మహేష్ కి తిరుగులేదు. ఎండార్స్మెంట్ విషయంలో మహేష్ సౌత్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పదుల సంఖ్యలో సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆ జాబితాలోకి జీ నెట్వర్క్ సంస్థ కూడా చేరింది. 

27

మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంటర్ అయి ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నారు. మహేష్ నటన, ఎదుగుదల చూసి కృష్ణ కూడా గర్వపడుతుంటారు. కృష్ణ ఇమేజ్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు సపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే మహేష్ పిల్లలు గౌతమ్, సితార కూడా ఎదుగుతున్నారు. 

37

అప్పుడప్పుడూ ఇండస్ట్రీలో వారి ప్రమేయం కనిపిస్తోంది. తన పిల్లలని నటీనటులుగా చూడాలని మహేష్.. తండ్రిలాగా ఎదగాలని పిల్లలు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ దిశగా సరైన ప్రణాళిక ఉండాలి. అంతా ఒకే కానీ ఒక విషయంలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గౌతమ్ కంటే సితార బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇటీవల సర్కారు వారి పాట చిత్రంలో పెన్నీ సాంగ్ డాన్స్ తో అదరగొట్టింది. 

47
sitara ghattamaneni

sitara ghattamaneni

సితార ఫ్యూచర్ లో తప్పకుండ తిరుగులేని నటి కావడం ఖాయం అనే అంచనాలు మొదలయ్యాయి. కానీ జీటివికి సంబంధించిన ప్రకటనల్లో మహేష్ బాబు సితారని కూడా ఇన్వాల్వ్ చేయడం రిస్క్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలు మహేష్ బాబే టివి సీరియల్స్ కి ప్రచారం కల్పించడం అభిమానులకు నచ్చడం లేదు. పైగా ఇందులో సితార కూడా ఉంది. 

57

బుల్లితెర అయినా, సినిమాలు అయినా ఇండస్ట్రీనే. కానీ బుల్లితెరకి, సినిమాకి మధ్య వ్యత్యాసం ఉందనేది వాస్తవం. సినిమాల్లో కనిపించేవారికే కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సితారని తీసుకువచ్చి సీరియల్ యాడ్స్ లో నటింపజేయడం ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రేమానురాగాలు, ఆత్మీయత అంటూ సీరియల్స్ లో చూపించే ఎమోషన్స్ తోనే ఓ యాడ్ కూడా షూట్ చేశారు. 

 

67

ఆ యాడ్ ఫ్యాన్స్ కి ఏమాత్రం నచ్చడం లేదు. దీనివల్ల సితారపై బుల్లితెర ఇమేజ్ పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జీ నెట్వర్క్ సంస్థ మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు దాదాపు 9 కోట్ల పారితోషికం చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 

77

సితారని ఇండస్ట్రీలో నటిగా లాంచ్ చేసేందుకు అన్ని చర్యలు జరుగుతున్నాయి. ఇప్పటికే యాక్టింగ్, డ్యాన్స్ లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతా ఒకే కానీ.. స్టార్ కిడ్స్ సర్ప్రైజింగ్ గా వచ్చినప్పుడే ఆ క్రేజ్ ఉంటుంది. ఇలా టివి యాడ్స్ లో సైతం కనిపించకూడదు అని అంటున్నారు. మరి మహేష్ బాబు తన కుమార్తె కెరీర్ ని ఎందుకు రిస్క్ లో పెడుతున్నాడో !

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబు నటిస్తూ నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Thalapathy Vijay: 2 లక్షల నుంచి 9 కోట్ల వరకు.. దళపతి గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఇవే..
Recommended image3
Illu Illalu Pillalu మార్చి 4 ఎపిసోడ్: నర్మదపై రామరాజు కడుపు మంట రైస్ మిల్ కొట్టేయడానికి భాగ్యం ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved