MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు పార్ట్ 2 చేయాలనుకున్న మూవీ ఏదో తెలుసా, ఎందుకు కుదర్లేదంటే.. ఇంకా ఛాన్స్ ఉంది

మహేష్ బాబు పార్ట్ 2 చేయాలనుకున్న మూవీ ఏదో తెలుసా, ఎందుకు కుదర్లేదంటే.. ఇంకా ఛాన్స్ ఉంది

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కథ తనకి సెట్ అయ్యే విధంగా ఉంటేనే అంగీకరిస్తారు. అనవసరమైన ఎక్స్ పెరిమెంట్స్ చేయడం మహేష్ ఎప్పుడో మానేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 26 2024, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కథ తనకి సెట్ అయ్యే విధంగా ఉంటేనే అంగీకరిస్తారు. అనవసరమైన ఎక్స్ పెరిమెంట్స్ చేయడం మహేష్ ఎప్పుడో మానేశారు. అందుకే మహేష్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే చిత్రాలు వస్తున్నాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఒక చిత్రం మాత్రం అసలు ఇది తన బాడీ లాంగ్వేజ్ కి కరెక్టేనా అని భయపడి చివరికి నటించారు. అలా భయపడి చేసిన చిత్రానికే పార్ట్ 2 కూడా ఉంటే బావుంటుంది అని మహేష్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

 

36

ఆ మూవీ ఏదో కాలేదు.. మహేష్ సీఎం గా నటించిన భరత్ అనే నేను. కొరటాల శివ.. మహేష్ బాబుకి భరత్ అనే నేను కథ బ్యాంకాక్ లో 5 గంటలు చెప్పారట.ఆ కథ మొత్తం 5 గంటలు ఉంటుంది. కానీ సినిమాలో కేవలం రెండున్నర గంటలు మాత్రమే చూపించాని. దీనితో చాలా అద్భుతమైన సన్నివేశాలు తీసేయాల్సి వచ్చింది. 

 

46
Bharat Ane Nenu

Bharat Ane Nenu

ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉంటే బావుంటుంది అనిపిస్తునట్లు మహేష్ తెలిపారు. కొరటాల ముందుగా ఇది సీఎం పాత్ర అని చెప్పగానే.. పాలిటిక్స్ నాకు ఎలా సెట్ అవుతాయి అని భయపడ్డా. అసలు పాలిటిక్స్ తో నాకు ఎలాంటి టచ్ లేదు అని మహేష్ తెలిపారు. 

 

56
Bharat Ane Nenu

Bharat Ane Nenu

28 ఏళ్ళ తర్వాత భారతీయుడుగా కమల్ తిరిగి వస్తున్నారు. భారతీయుడు, భరత్ అనే నేను రెండు చిత్రాల్లో మోటివ్ ఒకటే..రాజకీయ నాయకులతో పాటు సమాజం కూడా మారాలి. ఇన్నేళ్ల తర్వాత వస్తున్నప్పటికీ భారతీయుడు క్రేజ్ తగ్గలేదు. కుదిరితే భరత్ కూడా తిరిగి రావాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

 

66

ఆ ఛాన్స్ కూడా లేకపోలేదు. కొరటాల ప్రతి చిత్రంలో సమాజానికి సంబంధించిన అంశం ఏదో ఒకటి ఉంటుంది. మహేష్ ని సీఎం పాత్రలో చూపిస్తూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలపై ఫోకస్ చేసేలా కథ సిద్ధం చేసుకోవచ్చు.మరి భరత్ అనే నేను 2 రావాలనే మహేష్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Ameesha Patel: నెలకు 2, ఏడాదికి 25కోట్లు.. పవన్‌ హీరోయిన్‌ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే
Recommended image2
OTT Movies: ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌ ఇవే
Recommended image3
Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved