Mahesh Babu: స్టార్ డైరెక్టర్ కు సారీ చెప్పిన మహేష్ బాబు..? అంతా మెహర్ రమేష్ వల్లే..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్ పెరుగుతున్నా కొద్ది.. మహేష్ గ్లామర్ కూడా రెట్టింపు అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) అంటే ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక అమ్మాయిల విషయంలో అయితే.. ఆయన కనిపిస్తే వాళ్ళకు పండగే. బాలీవుడ్ హీరోయిలు సైతం మహేష్ బాబు(Mahesh Babu) అంటే మాకు పిచ్చి అన్నారంటే సూపర్ స్టార్ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఆయనతో సినిమా చేయాలి అని స్టార్ హీరోయిన్లు సైతం పోటీ పడుతుంటారు. యంగ్ స్టార్ హీరోలు సైతం ఆయన గ్లామర్ చూసి కుళ్ళుకుంటారు.
బడాస్టార్స్ నుంచి ఎన్నో కాంప్లిమెంట్స్ కూడా వస్తుంటాయి. రీసెంట్ గా ఆహా అన్ స్టాపబుల్(Unstopble) షోలో కూడా.. బాలయ్య బాబు(Balakrishna).. ఏం గ్లామరయ్య నీది.. ఏం తింటావ్ అన్నట్టు అడిగాడంటే.. మహేష్ బాబు(Mahesh Babu) క్రేజ్ గురించి అర్ధం చేసుకోవచ్చు.
ఇక సూపర్ స్టార్ ఎక్కడికి వెళ్ళినా ఆయన కోసం జనాలు పోటీ పడుతూనే ఉంటారు. అందకే సినిమా లేకపోతే ఫ్యామిలీ ఈ రెండు మాత్రమే లోకంగా ఉంటారు మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఆయన ఫ్యాన్స్ ను దగ్గరకు రానివ్వడు .తను ఫ్యామిలీతో ఉన్నానని ఇప్పుడు టైమ్ కాదంటూ సున్నితంగా చెప్పేస్తాడు.
రీసెంట్ గా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. దాని వల్ల మహేష్ బాబు (Mahesh Babu) స్టార్ డైరెక్టర్ శంకర్ కు సారి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సూపర్ స్టార్ ఫ్యామిలీకి డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి ఇరుకుటుంబాలు కలిసి అప్పుడప్పుడు టూర్లు కూడా వేస్తుంటారు. అయితే ఓసారి ఈ రెండు కుటుంబాలు కలిసి ముంబయ్ వెళ్లాయట.
మ్యారియోట్ హోటల్ లో ఫ్యామిలీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న Mahesh Babu దగ్గరకు ఇద్దరు అమ్మాయిలు వచ్చి సెల్ఫీ అడిగారట. అయితే ఫ్యామిలీతో ఉన్నాను... ఇది టైమ్ కాదు అంటూ మహేష్ సిన్నితంగా తిరస్కరించడంతో ఆ అమ్మాయిలు కామ్ గా వెళ్ళిపోయారట. వాళ్లు వెళ్ళిపోయిన తరువాత మెహర్ రమేష్ తీరిగ్గా... ఓ షాకింగ్ న్యూస్ మహేష్ (Mahesh Babu) కు చెప్పాడట. వాళ్లు ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ శంకర్ కూతుళ్లు అని చెప్పడంతో మహేష్ షాక్ అయ్యాడట.
ఈ విషయం ముందే చెప్పాలి కదా అంటూ ఫీల్ అయ్యాడట మహేష్. వెంటనే శంకర్ (Shankar) ఉన్న చోటికి వెళ్ళి.. ఆయనతో విషయం మొత్తం చెప్పి.. నేను మీ పిల్లలు అనుకోలేదు సారీ అండీ అంటూ చెప్పాడట మహేష్. ఇక శంకర్ (Shankar) కూడా స్పందించి అదేం లేదండి.. వాళ్ళకు కూడా హీరోలు ఎలా ఉండాలి అనేది అవగాహనకు రావాలి కదా.. అని చెప్పినట్టు సమాచారం.
సూపర్ స్టార్ సెల్ఫీ ఇవ్వకపోవడంతో మేము ఫలానా డైరెక్టర్ పిల్లలం అని చెప్పుకుండా కామ్ గా వెళ్లిపోయినా ఆ అమ్మాయిల సింపుల్ సిటీకీ.. విషయం తెలియగానే డైరెక్టర్ దగ్గరకు వెళ్ళి సారి చెప్పిన మహేష్ బాబు (Mahesh Babu) సంస్కారాన్ని ప్రశంసిస్తున్నారు సినీ జానాలు.
సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు. దాదాపు 70 శాతం పూర్తి అయిన ఈ సినిమా కరోనా వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. మహేష్ కాలికి సర్జరీ అవ్వడం.. కరోనా రావడంతో ఇంకా లేట్ అయ్యింది షూటింగ్. ఈ మన్త్ లాస్ట్ వీక్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేశాడు మహేష్. పూజా హెగ్డే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.