MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మహేష్ తో ఆ మూవీ, సూపర్ స్టార్ కృష్ణ వార్నింగ్ ఇచ్చినా వినలేదు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి కోలుకోలేని దెబ్బ

మహేష్ తో ఆ మూవీ, సూపర్ స్టార్ కృష్ణ వార్నింగ్ ఇచ్చినా వినలేదు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి కోలుకోలేని దెబ్బ

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ హెచ్చరించినా వినకుండా ఓ దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేశారు. కృష్ణ మాట విని ఉంటే ఆ దర్శకుడికి కోట్ల ఆదాయం వచ్చేది. కానీ ఆయన మాట పెడచెవిన పెట్టడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 31 2025, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాల నటుడిగా మహేష్ బాబు 
Image Credit : Instagram/Mahesh Babu

బాల నటుడిగా మహేష్ బాబు 

సూపర్ స్టార్ కృష్ణ చిన్నతనం నుంచే మహేష్ బాబుకి సినిమాలు అలవాటు చేశారు. అందుకే మహేష్ బాల్యం నుంచే నటుడిగా రాణించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మహేష్ బాబు సోలో హీరోగా రాజకుమారుడు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ సమయంలోనే మహేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోగా మారిపోయారు. 

DID YOU
KNOW
?
మోసగాళ్లకు మోసగాడు మూవీ బడ్జెట్
సూపర్ స్టార్ కృష్ణ 1971లో నటించిన కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు 7 లక్షల బడ్జెట్ తో తెరకెక్కింది. అప్పట్లో అదే టాలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టక్కరి దొంగ మూవీ 
Image Credit : Instagram/Namrata Shirodkar

టక్కరి దొంగ మూవీ 

మహేష్ బాబు అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న సమయంలో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో నటించారు. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించిన జయంత్ సి పరాన్జీ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక చిత్రం వచ్చింది. తాను కోరుకున్న విధంగా మహేష్ తో చిత్రాన్ని జయంత్  రూపొందించారు. కానీ ఆ చిత్రంతో జయంత్ సి పరాన్జీ కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఆ చిత్రం ఇంకేదో కాదు.. టక్కరి దొంగ. ఈ మూవీలో మహేష్ బాబు కౌబాయ్ గా అదరగొట్టాడు. కానీ సినిమా వర్కౌట్ కాలేదు. టక్కరి దొంగ చిత్రానికి దర్శకుడు, నిర్మాత రెండూ ఆయనే. 

35
సూపర్ స్టార్ కృష్ణ వద్దన్నారు 
Image Credit : mahesh babu

సూపర్ స్టార్ కృష్ణ వద్దన్నారు 

ఈ చిత్ర సంగతులు పంచుకుంటూ జయంత్ సి పరాన్జీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబుతో తాను సినిమా చేయాలనుకుంటున్న విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారికి చెప్పాను. ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తున్నాని చెప్పాను. కృష్ణ గారి మోసగాళ్లకు మోసగాడు మూవీ నాకు చాలా ఇష్టం. అదే విధంగా మహేష్ బాబుని కూడా కౌబాయ్ గా చూపించాలని అనుకున్నా. టక్కరి దొంగ కథ చెప్పగానే కృష్ణ గారు ఈ చిత్రం వద్దు అని అన్నారు. 

45
అలా చేస్తే కోట్లు సంపాదించొచ్చు 
Image Credit : IMDB

అలా చేస్తే కోట్లు సంపాదించొచ్చు 

ఆయన నాతో ఏం చెప్పారంటే..నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ మూవీకి నువ్వే నిర్మాతని అని అంటున్నావ్. మంచి లవ్ స్టోరీ తీస్తే కోట్లు సంపాదించుకోవచ్చు కదా. కౌబాయ్ చిత్రానికి చాలా డబ్బులు ఖర్చవుతాయి. రిస్క్ ఎక్కువ అని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆయన మాట వినకుండా భారీ బడ్జెట్ లో టక్కరి దొంగ చిత్రాన్ని రూపొందించాను. ఆ చిత్రం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. 

55
టక్కరి దొంగతో కోలుకోలేని దెబ్బ 
Image Credit : IMDB

టక్కరి దొంగతో కోలుకోలేని దెబ్బ 

నాకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పుల పాలయ్యాను. ఆ అప్పులు తీర్చడానికి నాకు మూడు సినిమాల టైం పట్టింది. ఈశ్వర్, శంకర్ దాదా ఎంబిబిఎస్, లక్ష్మీ నరసింహా చిత్రాలకు నాకు వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం అప్పులు తీర్చడానికే సరిపోయింది. నాకంటూ ఏమీ మిగల్లేదు అని జయంత్ సి పరాన్జీ అన్నారు. కానీ మహేష్ బాబుని ప్రశంసలతో ముంచెత్తారు. టక్కరి దొంగ చిత్రం ఫ్లాప్ కావడంతో మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని జయంత్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
మహేష్ బాబు ఘట్టమనేని
కృష్ణ ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image2
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Recommended image3
Suriya Jyotika Mumbai House: భార్య కోసం షాకింగ్ డెసిషన్.. సూర్య రూ.200 కోట్ల ఇల్లు ఎందుకు వదిలేశాడో తెలుసా ?
Related Stories
Recommended image1
నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు.. ఆ బట్టలు వేసుకుంటే తల్లిగా బిహేవ్ చేయనట్లేనా, అనసూయ బోల్డ్ కామెంట్స్
Recommended image2
ఓటీటీలో టాప్ 8 హైయెస్ట్ పైడ్ నటీనటులు, ఏకంగా 125 కోట్లతో ఆ హీరో రికార్డ్.. సమంత ప్లేస్ ఏంటో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved