- Home
- Entertainment
- ఓటీటీలో టాప్ 8 హైయెస్ట్ పైడ్ నటీనటులు, ఏకంగా 125 కోట్లతో ఆ హీరో రికార్డ్.. సమంత ప్లేస్ ఏంటో తెలుసా
ఓటీటీలో టాప్ 8 హైయెస్ట్ పైడ్ నటీనటులు, ఏకంగా 125 కోట్లతో ఆ హీరో రికార్డ్.. సమంత ప్లేస్ ఏంటో తెలుసా
ఇండియాలో ఓటీటీలలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుల జాబితాలో అజయ్ దేవగన్, మనోజ్ బాయ్ పాయి, పంకజ్ త్రిపాఠి, సమంత లాంటి వారు ఉన్నారు. వారి రెమ్యునరేషన్ వివరాలు ఇక్కడ చూడండి.

హైయెస్ట్ పైడ్ ఓటీటీ స్టార్స్
సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలు కూడా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించే వేదికలుగా మారిపోయాయి. సినిమాల్లో స్టార్స్ గా గుర్తింపు పొందిన వారు సైతం డిజిటల్ వేదికపై అడుగుపెట్టి భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. దేశంలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న టాప్ 8 ఓటీటీ నటులు ఎవరో ఈ లిస్ట్ లో చూద్దాం.
KNOW
అజయ్ దేవగన్
డివోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ సిరీస్ కోసం అజయ్ దేవగన్ ఏకంగా 125 కోట్లకి పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.18 కోట్లు తీసుకున్నాడు. ఈ సిరీస్‌తోనే ఆయన ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చారు.
జయదీప్ అహ్లావత్
పాతాళ్ లోక్ ద్వారా గుర్తింపు పొందిన జయదీప్ అహ్లావత్ ఓటీటీలో ప్రతి ప్రాజెక్ట్‌కు రూ.20 కోట్లు తీసుకుంటూ రెండో స్థానంలో నిలిచాడు.
సైఫ్ అలీ ఖాన్
సేక్రెడ్ గేమ్స్, టాండవ్ వంటి సిరీస్‌లలో నటించిన సైఫ్, ప్రతి ప్రాజెక్ట్‌కు సుమారు రూ.15 కోట్లు అందుకుంటున్నాడని సమాచారం. సర్తాజ్ సింగ్ పాత్రతో ఆయన కెరీర్ మళ్లీ వెలుగులోకి వచ్చింది.
పంకజ్ త్రిపాఠి
మిర్జాపూర్, సేక్రెడ్ గేమ్స్, క్రిమినల్ జస్టిస్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన పంకజ్ త్రిపాఠి ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.12 కోట్లు తీసుకుంటున్నాడు.
కరీనా కపూర్ ఖాన్
జానే జాన్ (Netflix) వంటి వెబ్ ప్రాజెక్ట్‌లతో డిజిటల్‌లోకి అడుగుపెట్టిన కరీనా ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.10-12 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటున్నారు.
మనోజ్ బాజ్‌పాయి
ది ఫ్యామిలీ మాన్ సిరీస్‌లో శ్రీకాంత్ తివారి పాత్రతో జాతీయ వ్యాప్తంగా మనోజ్ బాయ్ పాయి గుర్తింపు పొందారు. ఓటీటీలో ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.
రాధికా ఆప్టే
ఘోల్, సేక్రెడ్ గేమ్స్ వంటి విభిన్న సిరీస్‌లతో పేరుపొందిన రాధికా ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
సమంత
ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో సమంత ప్రధాన విలన్ గా నటించింది. సమంత ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయింది. ఈ సిరీస్ కోసం సమంత 3 నుంచి 4 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు సమాచారం.