కృష్ణ పేరుతో అరుదైన రికార్డ్, ఎవరికీ సాధ్యం కానిది సాధించిన సూపర్ స్టార్
చాలా మంది ట్రెండ్ ఫాలో అవుతారు.. కాని కొంత మంది మాత్రం ట్రెండ్ సెట్ చేస్తారు. అలా ఫిల్మ్ ఇంటస్ట్రీలో ట్రెండ్ సెట్టర్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. ప్రపంచ సినీ చరిత్రలో అరుదైన రికార్డు సాధించడం సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమైంది.

భవిష్యత్తులో మరే హీరో కూడా చేయలేని.. సాధ్యం కాని రికార్డులెన్నో సాధించారు కృష్ణ. సినిమాల్లో హీరో కృష్ణ చాలా మందికి ఆదర్శం ఇప్పటికీ కొన్ని పనులు ఆయనలా మరే హీరో కూడా చేయలేకపోయారు. అది వారికి సాధ్యం కాదు కూడా. అందుకే ఆయన నటశేఖరుడయ్యాడు.
సినీ జనాలకు తమ అభిమాన హీరో తెరమీద కనిపిస్తే పండగే... అదే ఒక స్క్రీన్ మీద ఇద్దరు హీరోలు కనిపిస్తే.. డబుల్ బొనాంజా. అదే ఒక సినిమాలో ఒక హీరో మూడు పాత్రల్లో అలరిస్తే.. ఫ్యాన్స్ జాతర చేసుకుంటారు. అది ఆడియన్స్ కు ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది కాని.. నటించే హీరో మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు పడుతూ.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేశారు నటశేఖర కృష్ణ.
ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగి మూడు పాత్రలు కాదు.. ముప్పై పాత్రల్లో అయినా ఈజీగా చేయగలుగుతున్నాం కాని అ్పటలో మూడు పాత్రలు చేయాలి.. ఏ గ్రాఫిక్స్ లేని రోజుల్లో అంటే.. ఆర్టిస్ట్ లకు దడదడలాడిపోతుంది. బాగా స్ట్రెయిన్ అవుతారు.. రిస్క్ కూడా కాని అదేది లేక్క చేయకుండా ఎక్కువ సినిమాల్లో ట్రిపుల్ రోల్ చేసిన హీరోగా కృష్ణ రికార్డ్ సాధించాడు.
ఫ్యాన్స్ కు తమ అభిమాన హీరో త్రిపుల్ రోల్ చేస్తే ఆ ఆనందాని అవధులు ఉండవు. ఈ రకంగా ఒకే సినిమాలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసి మెప్పించిన హీరోల్లో చాలా మంది హీరోలున్నారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో ఎక్కువ చిత్రాల్లో త్రిపుల్ రోల్ చేసిన హీరోగా రికార్డులకు ఎక్కారు.
కుమార రాజా సినిమాలో ఫస్ట్ టైమ్ సూపర్ స్టార్ కృష్ణ మూడు పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీని కన్నడ సినిమా నుంచి రీమేక్ చేశారు. కన్నడాలో అప్పటి స్టార్ హీరో రాజ్ కుమర్ నటించిన శంకర్ గురు సినిమా నుంచి రీమేక్ చేశారు. తెలుగులో కృష్ణ.. తండ్రి ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేసారు. పి.సాంబశివరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది.
కృష్ణ రెండోసారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ డాక్టర్ సినీ యాక్టర్. ఈ సినిమాలో కృష్ణ, తనయుడు, మేనల్లుడుగా మూడు పాత్రల్లో కనిపించారు. మేనమామ పోలికలున్న మేనల్లుడు పాత్రలో కృష్ణ నటించారు. ఇందులో ఒక హీరో డాక్టర్‌గా నటిస్తే.. మరొకరు యాక్టర్‌గా నటించారు. తండ్రి పాత్ర చేసిన కృష్ణ డాక్టర్ పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాను విజయ నిర్మల డైరెక్ట్ చేసారు.
ఇక మరో రెండు సినిమాల్లో కృష్ణ మూడు పాత్రల్లో కనిపించి అభిమానులను మురిపించాడు. సిరిపురం మొనగాడు సినిమాలో కృష్ణ నాలుగో సారి త్రిపాత్రాభినయం చేశారు. అంతే కాదు బంగారు కాపురం సినిమాలో కూడా తండ్రీ ఇద్దరు కొడుకులుగా కృష్ణ త్రిపాత్రాభియనం చేశారు. సిరిపురం మొనగాడు సినిమాను కే.యస్.ఆర్. దాస్ డైరెక్ట్ చేయగా.. ఇందులో కృష్ణ తండ్రీ కొడుకులుగా పోలీస్ ఆఫీసర్‌గా.. విలన్‌గా మూడు పాత్రల్లో నటించారు. బంగారు కాపురం సినిమాను పి.చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.
ఇలా ఇంత వరకూ ఏ హీరో చేయని.. సాధ్యం కాని.. సరికొత్త రికార్డ్ ను కృష్ణ సాధించి చూపించాడు. ఇక ఇప్పటి హీరోలతో ఎవరూ ఇలా మూడు పాత్రలు చేసే సాహసం చేయడం లేదు. చేసినా ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు.