- Home
- Entertainment
- మహేష్ పెళ్ళికి ఫ్యామిలీ మొత్తం వెళ్లారు, ఒక్కరు తప్ప..ఆమెని కుటుంబ సభ్యులంతా ఎందుకు దూరం పెట్టారంటే
మహేష్ పెళ్ళికి ఫ్యామిలీ మొత్తం వెళ్లారు, ఒక్కరు తప్ప..ఆమెని కుటుంబ సభ్యులంతా ఎందుకు దూరం పెట్టారంటే
మహేష్ బాబు, నమ్రత మధ్య ప్రేమ, పెళ్లి నాటకీయంగా జరిగింది. 2000 సంవత్సరంలో వీరిద్దరూ వంశీ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ మహేష్, నమ్రత నాలుగేళ్లపాటు ప్రేమాయణం సాగించారు.

మహేష్ బాబు, నమ్రత మధ్య ప్రేమ, పెళ్లి నాటకీయంగా జరిగింది. 2000 సంవత్సరంలో వీరిద్దరూ వంశీ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ మహేష్, నమ్రత నాలుగేళ్లపాటు ప్రేమాయణం సాగించారు. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో మహేష్, నమ్రత వివాహం ముంబైలో జరిగింది.
వీరిద్దరి పెళ్లి అయ్యేవరకు విషయం ఎవరికీ తెలియదు. దీనితో మహేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు అని చెప్పగానే టాలీవుడ్ తో పాటు, ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే మహేష్, నమ్రత వివాహం సీక్రెట్ గా జరిగిపోయింది. ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు.
మహేష్ బాబు కన్నా నమ్రత వయసులో ఐదేళ్లు పెద్ద. ఈ విషయం కూడా అందరిలో ఆశ్చర్యం పెంచింది. అయితే మహేష్ పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో కృష్ణ సంచలన విషయాలు తెలిపారు. నమ్రతని పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత మహేష్ బాబు ఒక వ్యక్తిని కృష్ణ దగ్గరికి రాయబారిగా పంపారట.
మహేష్ అప్పటికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మంజులని నా దగ్గరకి రాయబారిగా పంపాడు. ఈ విధంగా నేను నమ్రతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. ఎలాగైనా నాన్నని ఒప్పించు అని చెప్పి పంపాడు. తాను అంగీకరించినట్లు కృష్ణ తెలిపారు.
అయితే మహేష్ అమ్మమ్మ దుర్గమ్మకి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదని కృష్ణ అన్నారు. ఆమె పెద్ద గొడవ చేసింది. పెళ్లి రోజు కూడా హంగామా చేసినట్లు కృష్ణ తెలిపారు. హైదరాబాద్ లో పెళ్లి అయితే చాలా గందరగోళం అవుతుందని ముంబైలో చేశాం. ఆరోజు మహేష్ అమ్మమ్మ.. పెళ్లి ఎక్కడ జరుగుతుందో నాకు చెప్పండి.. తిరుపతిలోనా.. ఎక్కడ పెళ్లి అంటూ గొడవ గొడవ చేసింది. పెళ్ళికి ఆమె అసలు ఒప్పుకోలేదు.
ఎందుకు అని యాంకర్ ప్రశ్నించగా.. పక్కనే ఉన్న విజయనిర్మల సమాధానం ఇచ్చారు. ఆమెకి కాస్త కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. అందుకే ఒప్పుకోలేదు. ఆమెకి చెప్పకుండా ముంబైకి వెళ్లి పెళ్లి చేసినట్లు విజయ నిర్మల తెలిపారు. 2005లో మహేష్ పెళ్లి జరగగా.. మహేష్ అమ్మమ్మ 2007లో మరణించారు. ఏది ఏమైనా నమ్రత విషయంలో మహేష్ బాబు చాలా హ్యాపీ. ఎందుకంటే యాడ్స్ గురించి నమ్రతకి బాగా తెలుసు. ఆమె యాడ్ ఫీల్డ్ నుంచే వచ్చింది కాబట్టి.. మహేష్ కి సంబంధించిన యాడ్స్ మొత్తం ఆమె మేనేజ్ చేస్తుంది అని కృష్ణ తెలిపారు.