ఆయన మరణంతో మెంటల్ గా కృష్ణ షాక్, ఆ టైంలో చాలా మంది దూరేశారు..అది తప్పని మహేష్ కి చెప్పినా మారలేదు
స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి విజయం సాధించారు. ఏఎన్నార్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం సైలెంట్ గా ఉండలేదు. రాజకీయ పరమైన సినిమాలు చేసి అనేక వివాదాలు సంచలనాలు సృష్టించారు.
స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి విజయం సాధించారు. ఏఎన్నార్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం సైలెంట్ గా ఉండలేదు. రాజకీయ పరమైన సినిమాలు చేసి అనేక వివాదాలు సంచలనాలు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా కూడా పనిచేశారు.
ఓ సందర్భంలో కృష్ణ రాజకీయాలు, సినిమాలు ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. రాజీవ్ గాంధీ కోరడం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని కృష్ణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ హావ సాగుతోంది. మాకు ఎన్టీఆర్ కి ధీటుగా మాస్ ఇమేజ్ ఉన్న పర్సన్ లేడు.
కాబట్టి మీరు కాంగ్రెస్ లోకి రావాలి అని రాజీవ్ గాంధీ స్వయంగా కృష్ణని ఆహ్వానించారట. రాజకీయంపై ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని తాను రాజీవ్ గాంధీ కోరడంతోనే వెళ్ళాను. రాష్ట్రమంతా కాంగ్రెస్ కోసం ప్రచారం చేశా. నా కష్టాన్ని రాజీవ్ గాంధీ గుర్తించారు. అయితే ఆయన మరణించడంతో నేను మెంటల్ గా షాక్ అయ్యా. ఆయనవల్లే రాజకీయాల్లోకి వచ్చా. ఆయన లేని రాజకీయం వద్దనుకుని పాలిటిక్స్ అంతటితో వదిలేసినట్లు కృష్ణ తెలిపారు.
రాజకీయాలపై ఫోకస్ పెట్టడం వల్ల ఆ పీరియడ్ లో కృష్ణ తన చిత్రాలని సరిగ్గా పట్టించుకోలేదు. దీనితో చాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి అని కృష్ణ అన్నారు. నేను పాలిటిక్స్ లోకి వెళ్లడం వల్ల ఆ గ్యాప్ లో చాలా మంది కుర్ర హీరోలు దూరేశారు అంటూ కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వెళ్లడం.. చాలా మంది యువ హీరోలకు కలసి వచ్చింది అని తెలిపారు.
Mahesh Babu
ఏడాదికి పది సినిమాలు చేసేవాడిని కాస్త ఆ వేగం తగ్గిపోయింది అని అన్నారు.ఇప్పటి హీరోలు ఏడాదికి ఒక చిత్రం మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది. దీనితో హీరోలు వాళ్ళ సేఫ్టీ చూసుకుంటూనే నిర్మాతల గురించి కూడా ఆలోచించాల్సి వస్తోంది. కాబట్టి ఎక్కువ సినిమాలు చేయలేకున్నారు.
Mahesh Babu
అలాగని ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేయడం కూడా తప్పు. హీరోలు ఎక్కువ చిత్రాలు చేస్తేనే ఇండస్ట్రీ, నిర్మాతలు బావుంటారు. మహేష్ బాబు ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకి సైన్ చేస్తున్నాడు. ఒక చిత్రం కోసం ఏకంగా మూడేళ్లు టైం తీసుకున్నాడు. అప్పుడు నేను మహేష్ చెప్పా. ఒక్క సినిమా కోసం ఇంత టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు.
ఒక ఏడాది కనీసం మూడు సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకో అని చెప్పా. అయినా కూడా అది జరగడం లేదు అని కృష్ణ అన్నారు. అతిథి తర్వాత మహేష్ మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఖలేజా చిత్రం చేశాడు.