మహేష్ కాకుండా కృష్ణకి నచ్చిన ఈ తరం హీరో ఎవరంటే.. వైరల్ అవుతున్న కామెంట్స్
వెండి తెరపై సూపర్ స్టార్ కృష్ణ చేయని సాహసాలు లేవు.వందలాది అద్భుతమైన చిత్రాలతో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత టాలీవుడ్ లో అంతటి ఖ్యాతి దక్కించుకున్నారు.

వెండి తెరపై సూపర్ స్టార్ కృష్ణ చేయని సాహసాలు లేవు.వందలాది అద్భుతమైన చిత్రాలతో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత టాలీవుడ్ లో అంతటి ఖ్యాతి దక్కించుకున్నారు. హీరోగా, నిర్మాతగా కృష్ణ ఎన్నో సాహసాలు, ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యారు.
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా మహేష్ బాబు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మహేష్ నటన చూసి కృష్ణ ఎప్పుడూ మురిసిపోతుంటారు. అయితే మహేష్ బాబు కాకుండా కృష్ణకి నచ్చిన ఈ తరం హీరో మరొకరు ఉన్నారు.
ఓ ఇంటర్వ్యూలో కృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మహేష్ బాబు కాకుండా తన జూ.ఎన్టీఆర్ అంటే కూడా ఇష్టం అని కృష్ణ అన్నారు. జూ. ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని కూడా కృష్ణ గుర్తు చేసుకున్నారు.
అల్లూరి సీతారామరాజు మూవీ టైంలో నాకు, ఎన్టీఆర్ గారికి దాదాపు పదేళ్లు మాటలు లేవు. నేను తీసిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు అల్లూరి మూవీ తీయాలని అనుకున్నారు. పరుచూరి బ్రదర్స్ ఇండస్ట్రీకి వచ్చాక అల్లూరి కథ రాయమని వాళ్ళని అడిగారు. కృష్ణ గారి అల్లూరి మూవీ చూశారా అని పరుచూరి బ్రదర్స్ అడిగారట. నేను చూడలేదు అంటే.. ఒకసారి చూడండి తర్వాత మాట్లాడదాం అని సలహా ఇచ్చారు.
అప్పటికి ఇంకా నాతో ఎన్టీఆర్ మాట్లాడలేదు. ఒకరోజు అనుకోకుండా స్టూడియోలో ఎదురుపడ్డాం. బ్రదర్ ఇలా రండి అని పిలిచారు. ఏంటి అని అడిగితే మీ అల్లూరి సీతారామరాజు మూవీ చూడాలనుకుంటున్నా. మీరే దగ్గరుండి చూపించాలి అని అడిగారు. వెంటనే ప్రింట్ తెప్పించి పక్కనే కూర్చుని చూపించా. ఇంటర్వెల్ కే అద్భుతంగా ఉందని అన్నారు.
ఇక సినిమా మొత్తం అయిపోయాక నన్ను కౌగిలించుకుని ప్రశంసించారు. ఈ సినిమాని ఇంతకంటే బాగా ఎవరూ తీయలేరు అని అన్నారు. వెంటనే పరుచూరి బ్రదర్స్ తో మనం అల్లూరి మూవీ చేయాల్సిన అవసరం లేదు ఇక అని చెప్పేశారు.