బాలయ్య పక్కన నటించాల్సిన మహేష్ సిస్టర్, అంతలో పెద్ద వివాదం!
మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని హీరో బాలయ్యతో జతకట్టాల్సింది. అంతా ఓకే అనుకున్నాక అడ్డంకులు ఏర్పడ్డాయి. అభిమానుల దెబ్బకు కృష్ణ సైతం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. హీరో బాలకృష్ణతో మంజుల నటించడాన్ని అభిమానులు ఎందుకు తిరస్కరించారో చూద్దాం..
Mahesh Babu
స్టార్ హీరోల ఫ్యాన్స్ చాలా సెంటిమెంటల్ గా ఉంటారు. అభిమాన హీరో విజయాలు, పరాజయాలు తమవిగా భావిస్తారు. ఆ హీరో, ఆయన కుటుంబం అందుకునే గౌరవాలు తమకు దక్కిన గౌరవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వారి బాధలు, సంతోషాలు,అవమానాలు తమవిగా ఫీల్ అవుతారు. తెలుగు ఆడియన్స్ సైతం అభిమాన హీరోల కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈ అభిమానం అప్పుడప్పుడు హద్దులు దాటేస్తుంది.
Manjula Ghattamaneni
అది ఒక్కోసారి హీరోలకు తలనొప్పిగా మారుతుంది. అభిమానులు కొన్ని సందర్భాల్లో హీరోలకు ఆంక్షలు కూడా పెడుతుంటారు. మీరు అది చేయాలి, ఇది చేయొద్దని సూచనలు చేస్తారు. ఇక హీరోలకు అభిమానుల మనోభావాలు చాలా ముఖ్యం. వారి అభిప్రాయాలను గౌరవించాల్సిందే. లేదంటే పొగిడిన నోటితోనే తిడతారు కూడా. ఫ్యాన్స్ సెంటిమెంట్స్ కి వ్యతిరేకంగా హీరోలు కూడా ఏమీ చేయరు.
టాలీవుడ్ లో కృష్ణ అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పోటీ పడిన ఏకైన స్టార్ కృష్ణ మాత్రమే. ఆయన సినిమా విడుదల అంటే థియేటర్స్ కి జనాలు పోటెత్తేవారు. కృష్ణకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. కాగా కృష్ణ రెండో కుమార్తె మంజుల హీరోయిన్ కావాల్సింది. ఓ స్టార్ హీరోకి జంటగా ఆమె నటించాల్సి ఉండగా... అభిమానులు ఒప్పుకోలేదు.
Balakrishna
మంజులకు నటన పట్ల మక్కువ ఉంది. ఆమె హీరోయిన్ కావాలి అనుకున్నారు. ఈ విషయం తెలిసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయాలి అనుకున్నారు. 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి వరుసగా మూడు హిట్స్ ఇచ్చాడు. కృష్ణ హీరోగా చేసిన నెంబర్ వన్ మంచి విజయం సాధించింది. యమలీల, శుభలగ్నం బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.
దాంతో బాలకృష్ణ హీరోగా టాప్ హీరో టైటిట్ తో లో ఒక మూవీ ప్లాన్ చేశాడు. ఈ మూవీలో మంజులను హీరోయిన్ గా అనుకున్నారు. కృష్ణ కూడా పచ్చ జెండా ఊపాడు. అయితే బాలకృష్ణతో మంజుల నటించడం కృష్ణ ఫ్యాన్స్ కి నచ్చలేదు. అసలు కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్ కావడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అందులోనూ ఎన్టీఆర్-కృష్ణ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. చాలా గొడవలు జరిగాయి.
Balakrishna
సినిమాల పరంగా, రాజకీయంగా ఎన్టీఆర్-కృష్ణ మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఈ క్రమంలో బాలకృష్ణతో మంజుల నటించడాని కృష్ణ ఫ్యాన్స్ ససేమిరా అన్నారు. ఈ కాంబినేషన్ సెట్ చేసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిని కూడా కృష్ణ అభిమానులు తిట్టిపోశారట. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కృష్ణ వెనక్కి తగ్గాడు. హీరోయిన్ కావాలన్న మంజుల ఆశలపై కృష్ణ ఫ్యాన్స్ నీళ్లు చల్లారు.
మంజులను హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్న ఆలోచన ఎస్వీ కృష్ణారెడ్డి విరమించుకున్నాడు. సౌందర్యను ఎంపిక చేశారు. 1995లో విడుదలైన టాప్ హీరో డిజాస్టర్ అయ్యింది. తర్వాత నాగార్జున హీరోగా వజ్రం టైటిల్ తో మూవీ చేశారు. అది కూడా ప్లాప్ అయ్యింది. దాంతో ఎస్వీ కృష్ణారెడ్డి స్టార్ హీరోల జోలికి పోలేదు.
కాగా మంజుల హీరోయిన్ కావాలన్న తన కోరిక మరొక విధంగా తీర్చుకుంది. దర్శకుడు నీలకంఠ తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం 'షో' లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రెండు పాత్రలు మాత్రమే ఉంటాయి. అనంతరం మంజుల ఒకటి రెండు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. నిర్మాతగా కూడా వ్యవహరించింది.