- Home
- Entertainment
- ఆ ఒక్క స్థలం విలువే 1000 కోట్లు... కృష్ణ తన ఆస్తి కొడుకు మహేష్ కి కాకుండా నరేష్ కి ఇచ్చాడా?
ఆ ఒక్క స్థలం విలువే 1000 కోట్లు... కృష్ణ తన ఆస్తి కొడుకు మహేష్ కి కాకుండా నరేష్ కి ఇచ్చాడా?
సుదీర్ఘ సినిమా ప్రస్థానంలో కృష్ణ అనేక ఒడిదుడుకులు చూశారు. నటుడిగా నిర్మాతగా పడుతూ లేస్తూ కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. మరి కృష్ణ తన ఆస్తి ఎవరికి ఇచ్చాడు? కన్న కొడుకులు రమేష్, మహేష్ లకా? లేక నరేష్ కా? ఆసక్తికర విషయంలో వెలుగులోకి వచ్చింది...

Mahesh Babu
ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టిన కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడు. ఒక స్థాయికి ఎదిగాక నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించాడు. దర్శకత్వం వహించాడు. ఈ క్రమంలో జయాపజయాలు ఎదురయ్యాయి. లక్షల లాభాలు, అదే సమయంలో నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఆయన చవిచూశారు.
Mahesh Babu
ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించేందుకు నిర్మాతలు భయపడేవారు. అప్పుడు కృష్ణ నిర్మాణ బాధ్యతలు తీసుకునేవారు. సంపాదించిన రూపాయి సినిమాల్లోనే పెట్టుబడి పెట్టేవాడు. పద్మాలయ స్టూడియో నిర్మించి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశాడు.
Mahesh Babu
ఒక స్టార్ హీరోగా ఆయన భారీగానే సంపాదించారు. ఆయన సినిమా ప్రస్థానం సుదీర్ఘంగా సాగింది. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన కళామతల్లికి సేవ చేశారు. 1961లో ఆయన సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. 2016లో విడుదలైన శ్రీశ్రీ ఆయన చివరి చిత్రం.
Mahesh Babu
కాగా కృష్ణ ఆస్తులు ఎవరికి చెందాయి అనే ఒక సందేహం చాలా కాలంగా ఉంది. కన్న కొడుకు రమేష్ బాబు, మహేష్ బాబులకు ఇచ్చారా? లేక స్టెప్ సన్ నరేష్ కి ఇచ్చాడా?. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తి నరేష్ కి దక్కినట్లు తెలుస్తుంది. నానక్ రామ్ గూడలో ఉన్న 12 ఎకరాల స్థలం నరేష్ పేరిట ఉందనే సందేహాలు కలుగుతున్నాయి.
Mahesh Babu
నానక్ రామ్ గూడ అడవిలా ఉన్నప్పుడు కృష్ణ-విజయ నిర్మల 12 ఎకరాలు కొనుగోలు చేశారు. అప్పట్లో ఎకరం ఖరీదు రూ.1.3 లక్షలు. ప్రస్తుతం మార్కెట్ ధర ఎకరం రూ. 100 కోట్లు. ఇంకా తక్కువ అంచనా వేసినా ఆ 12 ఎకరాల ధర రూ. 1000 కోట్లకు తగ్గదు. ఆ ప్రాంతంలో అనేక వ్యాపార సముదాయాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి.
Mahesh Babu
నానక్ రామ్ గూడలో స్థలం కొన్న వెంటనే కృష్ణ-విజయ నిర్మల ఇక్కడకు వచ్చేశారు. హౌస్ నిర్మించుకుని ఆ ఫార్మ్ హౌస్లోలోనే జీవించినంత కాలం ఉన్నారు. నరేష్ మొదటి నుండి కృష్ణ-విజయ నిర్మలతోనే ఉండేవారు.నాలుగు ఎకరాలు ఉంచి, మిగతాది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి ఇచ్చేశారు.
Mahesh Babu
కృష్ణ మిగతా ఆస్తులు కుమారులు మహేష్, రమేష్ లకు ఇచ్చారని తెలుస్తుంది. నానక్ రామ్ గూడలో ఉన్న 12 ఎకరాలు మాత్రం నరేష్ కి వచ్చినట్లు సమాచారం. గతంలో పలుమార్లు నరేష్ నా ఆస్తి విలువ రూ. 1000 కోట్లకు పైమాటే అన్నారు. అది బహుశా ఈ స్థలాన్ని ఉద్దేశించే కాబోలు. ఇక నరేష్ కి ముగ్గురు కుమారులు కాగా, వారితో సన్నిహితంగా ఉన్న దాఖలాలు కనిపించవు.