మహేష్ బాబుకి కోపం వస్తే తండ్రి కృష్ణ కూడా ఆపలేరు.. ఆ సంఘటనే నిదర్శనం
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ లో తిరుగులేని హీరో. త్వరలో రాజమౌళి చిత్రంతో గ్లోబల్ మార్కెట్ పై మహేష్ బాబు కన్నేశారు. మహేష్ బాబు సినిమా అంటే 100 పర్సెంట్ డెడికేషన్ తో ఉంటాడు.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ లో తిరుగులేని హీరో. త్వరలో రాజమౌళి చిత్రంతో గ్లోబల్ మార్కెట్ పై మహేష్ బాబు కన్నేశారు. మహేష్ బాబు సినిమా అంటే 100 పర్సెంట్ డెడికేషన్ తో ఉంటాడు. చాలా లక్షణాలు మహేష్ బాబుని టాప్ హీరోగా నిలబెట్టాయి.
మహేష్ బాబులో ఒక్క ఒక లక్షణం ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణని కూడా షాక్ కి గురి చేసింది. చిన్నతనం నుంచే మహేష్ బాబులో నటన పట్ల కృష్ణ కసిని గమనించారట. కృష్ణ నటించిన చాలా చిత్రాల్లో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 1987లో కృష్ణ, భానుప్రియ నటించిన శంఖారావం చిత్రంలో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.
ఈ చిత్ర షూటింగ్ ఊటీలో కొంత భాగం జరిగింది. తన పాత్ర షూటింగ్ కోసం మధ్యలో మహేష్ బాబు పాలబుగ్గల పిల్లాడిగా వెళ్ళాడు. మహేష్ బాబు పోషించాల్సిన పాత్రలో అదే కాస్ట్యూమ్స్ లో మరో పిల్లాడు షూటింగ్ లొకేషన్ లో ఉన్నాడట. వెంటనే నాన్న ఎవరు ఆ అబ్బాయి నాలాగా డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు అని అడిగాడట.
అతడు నీకు డూప్. ప్రమాదకర సన్నివేశాల్లో నీకు బదులుగా నటిస్తాడు అని కొరియోగ్రాఫర్ చెప్పాడు. వెంటనే మహేష్ కి కోపం కట్టలు తెంచుకుందట. అప్పటికి మహేష్ పసి పిల్లాడే. నాన్న ఎంత కష్టమైన సీన్ అయినా నేనే సొంతంగా చేస్తాను. నాకు డూప్ పెట్టడానికి వీల్లేదు. ఆ అబ్బాయిని షూటింగ్ నుంచి పంపించి వేయండి అని గట్టిగా అరిచాడట. వెంటనే కొరియోగ్రాఫర్ చెప్పినట్లుగా బాగా ఎత్తైన ప్రదేశం నుంచి దూకి ఫల్టీలు కొట్టాడు. ఆ తర్వాత ఒరిజినల్ సీన్ లో కూడా అదే విధంగా జంప్ చేసి సొంతంగా నటించాడు.
డూప్ ఉండే సన్నివేశాలు పెట్టాలంటే మహేష్ బాబు అస్సలు ఒప్పుకోడట. ఇక మహేష్ కోపం గురించి తెలిసిన కృష్ణ ప్రమాదం అని తెలిసినప్పటికీ అంగీకరించేవారట. కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో బైక్ నుంచి దూకే సన్నివేశం ఉంది. ఆ సీన్ కి కూడా డూప్ పెట్టాలని అనుకున్నాం. 8 గంటలకు షూటింగ్ కి వెళ్ళాలి. కానీ మహేష్ బాబు నాకు చెప్పకుండా 7 గంటలకే షూటింగ్ వెళ్లి బైక్ నుంచి దూకే సీన్ పూర్తి చేశాడు.
నాన్న వస్తే మళ్ళీ నన్ను చేయనీయడు. డూప్ పెట్టాలి అని అంటారు. తొందరగా షూట్ చేయండి అని కొరియోగ్రాఫర్లతో చెప్పాడు. నేను వెళ్లేసరికి సక్సెస్ ఫుల్ గా ఆ సీన్ కంప్లీట్ చేసి ఉన్నారు. మహేష్ లో నచ్చే క్వాలిటీ అదే. సుఖంగా కూర్చోవడానికి ఇష్టపడడు. ఎంత కష్టం అయినా సొంతంగా ప్రయత్నిస్తాడు అని కృష్ణ తెలిపారు. టక్కరి దొంగ, అతడు లాంటి చిత్రాల్లో మహేష్ చాలా రిస్కీ సన్నివేశాలని డూప్ లేకుండా చేశారు.