వీణ స్టెప్పుని కూనీ చేశారు, ఈ ఒక్క పాయింట్ నా బ్రదర్ చిరంజీవికి అంటూ బాలయ్య క్రేజీ కామెంట్స్
నందమూరి, మెగా ఫ్యామిలీ మధ్య ఎంత పోటీ అయినా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మాటల యుద్ధం జరిగి ఉండొచ్చు. అనేక సందర్భాల్లో భేదాభిప్రాయాలు కూడా చెలరేగాయి. కానీ చిరంజీవి, బాలయ్య ఇద్దరూ ఆరోగ్య కరమైన పోటీని మైంటైన్ చేస్తూ వచ్చారు.
నందమూరి, మెగా ఫ్యామిలీ మధ్య ఎంత పోటీ అయినా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మాటల యుద్ధం జరిగి ఉండొచ్చు. అనేక సందర్భాల్లో భేదాభిప్రాయాలు కూడా చెలరేగాయి. కానీ చిరంజీవి, బాలయ్య ఇద్దరూ ఆరోగ్య కరమైన పోటీని మైంటైన్ చేస్తూ వచ్చారు. స్నేహితులుగానే కొనసాగారు.
ఇటీవల బాలయ్య ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈవెంట్ కి చిరంజీవి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి.. ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి పాత్రలతో మల్టీస్టారర్ మూవీ వస్తే బావుంటుంది అనే కోరికని వ్యక్తం చేశారు. చిరంజీవి ప్రతిపాదనకు బాలయ్య రెడీ అంటూ సంకేతం ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ కొనసాగుతోంది.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4 షోని హోస్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి నవీన్ పోలిశెట్టి, శ్రీలీల అతిథులుగా హాజరయ్యారు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీలే ఇద్దరితో బాలయ్య కూడా బాగా అల్లరి చేశారు. సరదా ప్రశ్నలు అడగడం మాత్రమే కాదు.. శ్రీలీల, నవీన్ పోలిశెట్టి చేత డ్యాన్స్ కూడా చేయించారు.
ఇంద్ర చిత్రంలోని మెగాస్టార్ చిరంజీవి వీణ స్టెప్పుని శ్రీలీల, నవీన్ పోలిశెట్టి ప్రయత్నించారు. కానీ ఇద్దరూ ఆ డ్యాన్స్ ని కూనీ చేయడం బాలయ్యకి నచ్చలేదు. వారిద్దరిలో ఎవరు డ్యాన్స్ బాగా చేస్తే వారికి ఒక పాయింట్ లభిస్తుంది. ఆ విధంగా సరదాగా గేమ్ ఆడారు. కానీ వీణ స్టెప్పుని ఇద్దరూ చేయలేకపోయారు. అసలేం చేస్తున్నారు మీరు.. నీకు పాయింట్ లేదు.. నీకు పాయింట్ లేదు అని నవీన్, శ్రీలీలకి బాలయ్య చెప్పారు.
Also Read : సినిమా ఇక బ్లాక్ బస్టర్ అవుతుంది అనగా ముంచేసిన చిరంజీవి.. స్టార్ హీరోకి కోలుకోలేని దెబ్బ
ఈ ఒక్క పాయింట్ అద్భుతంగా డ్యాన్స్ చేసిన నా బ్రదర్ చిరంజీవికి ఇస్తున్నా అని చెప్పడంతో అక్కడ చప్పట్లు మారుమోగాయి. చిరంజీవి గురించి బాలయ్య చేసిన క్రేజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా బాలయ్య చిరంజీవి డ్యాన్స్ ప్రతిభని తన షోలో అభినందించారు.