MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆ రికార్డ్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో అతడే.. కెరీర్ ని మార్చేసిన చిత్రం అదే

సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆ రికార్డ్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో అతడే.. కెరీర్ ని మార్చేసిన చిత్రం అదే

సూపర్ స్టార్ కృష్ణ తర్వాత టాలీవుడ్ లో అరుదైన రికార్డ్ సాధించిన హీరో ఒకరు ఉన్నారు. ఆ రికార్డ్ ఏంటి, దాని గురించి కృష్ణ చెప్పిన విశేషాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 09 2025, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ రికార్డులు 
Image Credit : Eenadu

సూపర్ స్టార్ కృష్ణ రికార్డులు 

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ఇంకెవరికీ సాధ్యం కానీ రికార్డులు సాధించారు. కృష్ణ రాకతో టాలీవుడ్ లో సినిమా మేకింగ్ వేగం పెరిగింది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఏకంగా 350 పైగా చిత్రాల్లో నటించారు. ఇది ఏ ఇతర హీరో చేరుకోలేని రికార్డు. సూపర్ స్టార్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో అప్పటి తన బిజీ షెడ్యూల్ ని గుర్తు చేసుకున్నారు. 

DID YOU
KNOW
?
సూపర్ స్టార్ కృష్ణ ట్రిపుల్ రోల్స్ రికార్డ్
సూపర్ స్టార్ కృష్ణ ట్రిపుల్ రోల్స్ లో ఏకంగా 7 చిత్రాల్లో నటించారు. కృష్ణకి ఉన్న అరుదైన రికార్డుల్లో ఇది కూడా ఒకటి. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెరీర్ ని మలుపు తిప్పిన గూఢచారి 116
Image Credit : Instagram/Mahesh Babu

కెరీర్ ని మలుపు తిప్పిన గూఢచారి 116

సూపర్ స్టార్ కృష్ణ తేనే మనసులు చిత్రంతో 1965లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రెండేళ్లలో కృష్ణ కేవలం 3 సినిమాల్లో మాత్రమే నటించారు. తేనె మనసులు, కన్నె మనసులు, గూఢచారి 116 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ గూఢచారి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తాను వెనుదిరిగి చూసుకోలేదని కృష్ణ అన్నారు. ఆ చిత్రం తర్వాత అవకాశాలు భారీగా పెరిగాయి. దీనితో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు మూడు షిఫ్టుల్లో వివిధ చిత్రాలకు పనిచేయాల్సి వచ్చేది అని కృష్ణ అన్నారు. 

35
ఒకే రోజు రెండు చిత్రాలు 
Image Credit : our own

ఒకే రోజు రెండు చిత్రాలు 

1972 లో అయితే తాను నటించిన 18 చిత్రాలు రిలీజ్ అయ్యాయి అని కృష్ణ తెలిపారు. ఈ రికార్డు టాలీవుడ్ చరిత్రలో చెక్కు చెదరకుండా ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పటి సినిమా మేకింగ్ స్టైల్ ని బట్టి ఈ తరం హీరోలు ఏడాదికి ఒక చిత్రంలో నటించడం కూడా కష్టం అయిపోతోంది. ఒకే రోజు తాను నటించిన రెండు చిత్రాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అని కృష్ణ అన్నారు. 

45
కృష్ణ తర్వాత ఆ రికార్డ్ బాలకృష్ణదే 
Image Credit : Youtube/ SriBalajiMovies

కృష్ణ తర్వాత ఆ రికార్డ్ బాలకృష్ణదే 

టాలీవుడ్ లో తన తర్వాత ఒకే రోజు రెండు చిత్రాలు రిలీజ్ చేసిన హీరో నందమూరి బాలకృష్ణ అని కృష్ణ తెలిపారు. బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ చిత్రాలు 1993లో సెప్టెంబర్ 3న రిలీజ్ అయ్యాయి. 

55
నటనే నా జీవితం 
Image Credit : Facebook/Nandamuri Balakrishna

నటనే నా జీవితం 

ఇలా షిఫ్ట్ ల వారీగా అర్ధ రాత్రి వరకు నటించడం కష్టంగా అనిపించలేదా అని ప్రశ్నించినప్పుడు.. నటనే నా జీవితం కాబట్టి ఎంజాయ్ చేస్తూ నటించాను. పైగా ఆ టైంలో నేను కుర్రాడిని. కాబట్టి ఉత్సాహంగా పనిచేసినట్లు కృష్ణ తెలిపారు. కొన్నేళ్ల తర్వాత సినిమాల నిర్మాణ ఖర్చులు పెరిగాయి. దీనితో ఏడాదికి 7 సినిమాలకు మించి చేయకూడదు అనుకున్నా. కానీ మొహమాటం వల్ల 10 చిత్రాల్లో కూడా నటించాల్సి వచ్చింది అని కృష్ణ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
కృష్ణ ఘట్టమనేని
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
ఎవరీ డాక్టర్ రమ్య మోహన్ ? విజయ్ సేతుపతిపై సంచలన ఆరోపణలు..ఆ అమ్మాయిని అలా..
Recommended image2
'వార్ 2' సెన్సార్ రివ్యూ.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సృష్టించే విధ్వంసానికి హద్దులు లేవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved