సుమంత్ ని ఏఎన్నార్ ఎందుకు దత్తత తీసుకున్నారో తెలుసా..కెరీర్ లో తొలిసారి ఎదురుదెబ్బ..
లెజెండ్రీ అక్కినేని నాగేశ్వర రావు మనవళ్లలో పెద్దవాడు హీరో సుమంత్. సుమంత్ కెరీర్ బిగినింగ్ లో హీరోగా మంచి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అప్పుడప్పుడూ హీరోగా రాణిస్తూనే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నాడు.
లెజెండ్రీ అక్కినేని నాగేశ్వర రావు మనవళ్లలో పెద్దవాడు హీరో సుమంత్. సుమంత్ కెరీర్ బిగినింగ్ లో హీరోగా మంచి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అప్పుడప్పుడూ హీరోగా రాణిస్తూనే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏఎన్నార్ మనవళ్ళలో ఆయనతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది సుమంత్ కే. దీనికి బలమైన కారణం ఉంది.
నాగార్జునకి సుమంత్ మేనల్లుడు. నాగార్జున సోదరి కుమారుడే సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెలలో ఒకరైన సత్యవతి అక్కినేని, ఆమె భర్త సురేంద్ర సంతానమే సుమంత్. సుమంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాతగారికి తన కుమార్తెలు, కొడుకులతో చిన్నప్పుడు ఎక్కువగా అటాచ్మెంట్ ఉండేది కాదు. చిన్నతనంలో వాళ్ళతో కలసి తాతగారు ఆడుకున్న సందర్భాలు తక్కువ. ఆ టైంలో తాతగారు ఏడాదికి ఆరేడు సినిమాల్లో నటించేవారు. చాలా బిజీ ఫ్యామిలీతో గడిపే టైం ఉండేది కాదు. తండ్రిగా తన పిల్లలతో చిన్నప్పటి సంతోషాన్ని ఆయన మిస్ అయ్యారు.
అలీతో సరదాగా ఇంటర్వ్యూలో సుమంత్ ఈ విషయాలన్నీ చెప్పారు. నేను పుట్టినప్పుడే తాతగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీనితో అలీ సుమంత్ వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నేను పుట్టడం వల్ల ఆయనకి హార్ట్ స్ట్రోక్ రాలేదు.. పుట్టినప్పుడు వచ్చింది.. రెండింటికీ తేడా ఉంది అని సుమంత్ చెప్పడంతో అలీతో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వేశారు. తాతగారికి కెరీర్ లో మొదటి ఎదురుదెబ్బ అదే.
దీనితో ఏడాదిపాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సింది వచ్చింది. ఏడాది సమయం ఇంట్లోనే ఉన్నారు. నేను ఆ టైంలో ఆయన చుట్టూ పాకుతూ తిరగడం లాంటివి చేసేవాడిని అట. దీనితో ఆయనకి నాతో అటాచ్మెంట్ పెరిగింది. మా అమ్మానాన్న అమెరికా వెళుతుంటే.. వీడిని నాకు ఇచ్చేసి వెళ్ళండి.. నేను దత్తత తీసుకుని పెంచుకుంటా అని చెప్పారు. తాతయ్య కోరిక మేరకు అమ్మానాన్న అలాగే చేశారు.
ఆ విధంగా తాను తాతయ్యకి బాగా క్లోజ్ అని సుమంత్ అన్నారు. చనిపోయే చివరి రోజుల్లో కూడా ఆయన హుషారు తగ్గలేదు. తనకి అపాయింట్ చేసిన నర్సులతో కూడా మహా చిలిపిగా ఉండేవారు అంటూ సుమంత్ తెలిపారు. నాగార్జున, ఏఎన్నార్ ఇద్దరిలో ఎవరు బాగా రొమాంటిక్ అంటే.. సుమంత్ ఏఎన్నార్ పేరు చెప్పారు.