MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Suma Kanakala: యాంకర్‌ సుమ హీరోయిన్‌గా ఎందుకు సినిమాలు మానేసిందో తెలుసా? ఇది అస్సలు ఊహించరు

Suma Kanakala: యాంకర్‌ సుమ హీరోయిన్‌గా ఎందుకు సినిమాలు మానేసిందో తెలుసా? ఇది అస్సలు ఊహించరు

Suma Kanakala: యాంకర్‌ సుమ ఇప్పుడు స్టార్‌ యాంకర్‌గా రాణిస్తోంది. కానీ ఆమె ప్రారంభంలో హీరోయిన్‌గా చేసింది. మరి ఎందుకు మానేసింది? ఆమె హీరోయిన్‌గా సెట్‌ కాలేదా? అసలు కారణం ఏంటో తెలుసా?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 17 2026, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్టార్‌ యాంకర్‌గా రాణిస్తోన్న సుమ
Image Credit : Asianet News

స్టార్‌ యాంకర్‌గా రాణిస్తోన్న సుమ

సుమ కనకాల యాంకర్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ స్టార్‌ యాంకర్‌గా రాణిస్తోంది. ఫుల్‌ బిజీగా ఉంటుంది. ఒకప్పుడు బుల్లితెరని శాసించింది. ఈ మధ్యనే చాలా వరకు తగ్గించింది. సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్‌లు చేస్తుంది. మరోవైపు తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌పై ఫోకప్‌ పెట్టింది. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే యాంకర్‌ సుమ.. ఒకప్పుడు నటి. ఆమె హీరోయిన్‌గా చేసింది. ఇంకా చెప్పాలంటే హీరోయిన్‌ గానే ఆమె కెరీర్‌ ప్రారంభం కావడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రైటర్‌ సరసన హీరోయిన్‌ గా సుమ
Image Credit : facebook.com/SumaKanakala

రైటర్‌ సరసన హీరోయిన్‌ గా సుమ

యాంకర్‌ సుమ తెలుగులో ఒక సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అదే `కళ్యాణ ప్రాప్తిరస్తు`. దీనికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ రైటర్‌, డైరెక్టర్‌ వక్కంతం వంశీ హీరోగా నటించాడు. ఆయనకు జోడీగా సుమ చేసింది. ఇందులో చేసిన వక్కంతం వంశీ, సుమ, కావ్య, మధులకు కూడా ఇదే ఫస్ట్ మూవీ. కానీ బాక్సాఫీసు వద్ద డిజాప్పాయింట్‌ చేసింది. అదే సమయంలో మలయాళంలోనూ హీరోయిన్‌గా ఆఫర్లు అందుకుంది సుమ. అక్కడ మూడు సినిమాలు చేసింది. అవి బాగానే ఆడాయి. కానీ ఉన్నట్టుండి హీరోయిన్‌ గా సినిమాలు మానేసింది. క్యారెక్టర్స్ వైపు, బుల్లితెర టర్న్ తీసుకుంది. మరి హీరోయిన్‌గా పేరు రాకపోవడమా? తాను హీరోయిన్‌గా సెట్‌ కాకపోవడమా? కారణం ఏంటనేది చూస్తే.

Related Articles

Related image1
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?
Related image2
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
34
సుమ హీరోయిన్‌గా సినిమాలు మానేయడానికి కారణం
Image Credit : Asianet News

సుమ హీరోయిన్‌గా సినిమాలు మానేయడానికి కారణం

తాను ఎందుకు సినిమాలు మానేసిందో యాంకర్‌ సుమ రివీల్‌ చేసింది. `తెలుగులో దాసరి గారితో `కళ్యాణ ప్రాప్తిరస్తు` చేశాను, ఆ తర్వాత రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను` అని చెప్పింది. అయితే హీరోయిన్‌గా చేయడం వల్ల తాను కంఫర్ట్ గా లేదట. ఏదో అసౌకర్యమైన ఫీలింగ్‌ కలిగేదట. సినిమా లోకేషన్‌లో గానీ, ఆ డిపార్ట్ మెంట్‌లో గానీ తనకు ఆ ఈజ్‌ వచ్చేది కాదట. అలాంటి పరిస్థితుల్లో నటించినప్పుడు తన యాక్టింగ్‌ బిగుసుకుపోతుందని, సరిగ్గా చేయలేకపోతున్నానని, ఫ్రీడమ్‌ లేదు, ఫీయర్‌గా అనిపించేదని తెలిపింది. తమది ఆర్థడాక్స్ ఫ్యామిలీ కావడంతో ఈ సినిమా కల్చర్‌కి తాను ఇమడలేకపోయానని, దీంతో హీరోయిన్‌గా గుడ్‌ బై చెప్పినట్టు తెలిపింది.

44
యాంకర్‌గా సక్సెస్‌ అయిన సుమ
Image Credit : suma insta

యాంకర్‌గా సక్సెస్‌ అయిన సుమ

ఆ తర్వాత వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ వచ్చిందట. ఇలా దాదాపు 15 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన సుమ.. ఆ తర్వాత యాంకరింగ్‌ వైపు టర్న్ తీసుకుంది. కొన్ని సీరియల్స్ లో కూడా కనిపించింది. కానీ మెయిన్‌గా యాంకరింగ్‌ వైపు ఫోకస్‌ పెట్టింది. స్టార్‌ మహిళా షోతో ఆమె పాపులర్‌ అయ్యింది. స్టార్‌ యాంకర్ గా ఎదిగింది. స్టార్ మహిళా షోని దాదాపు 14ఏళ్లపాటు నిర్వహించడం విశేషం. దీంతోపాటు `అవాక్కయ్యారా`, లేడీ బాస్‌`, `పట్టుకుంటే పట్టు చీర`, `పంచావతారం`, `కెవ్వు కేక`, `స్వర్ణాభిషేకం`, `సౌందర్య లహరి`, `క్యాష్‌` వంటి షోస్‌ చేసింది. ఇప్పుడు `సుమ అడ్డా` పేరుతో షో చేస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?
Recommended image2
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved