పుష్ప 2కి మూడు క్లైమాక్స్ వెర్షన్లు.. అత్యంత రహస్యంగా షూటింగ్ ?
ఆల్రెడీ సుకుమార్ పుష్ప 2 కోసం రెండు క్లైమాక్స్ వెర్షన్స్ చిత్రీకరించినట్లు టాక్. కొత్త షెడ్యూల్ లో మూడవ వెర్షన్ క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పుష్ప 2 చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెడితేనే డిసెంబర్ 6 రిలీజ్ వీలవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సుకుమార్, అల్లు అర్జున్, ఇతర పుష్ప 2 చిత్ర యూనిట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు.
ఇదిలా ఉండగా అక్టోబర్ 3 నుంచి పుష్ప 2 చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. ఆల్రెడీ సుకుమార్ పుష్ప 2 కోసం రెండు క్లైమాక్స్ వెర్షన్స్ చిత్రీకరించినట్లు టాక్. కొత్త షెడ్యూల్ లో మూడవ వెర్షన్ క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటిలో ఏది బెస్ట్ అనేది తర్వాత ఫైనల్ చేశారు.
అయితే క్లైమాక్స్ షూటింగ్ మాత్రం అత్యంత రహస్యంగా సుకుమార్ చిత్రీకరిస్తున్నారు అట. పుష్ప 3 కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో పుష్ప 3కి లీడ్ ఇచ్చే విధంగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో సుకుమార్ క్లైమాక్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఆ ట్విస్ట్, క్లైమాక్స్ గురించి డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో లీక్ కాకూడదు అని సుకుమార్ భావిస్తున్నారట.
అందుకే అత్యంత రహస్యంగా నటీనటులు, కెమెరా మెన్, దర్శకుడు మాత్రమే లొకేషన్ లో ఉండేలా షూటింగ్ జరుగుతోందని టాక్. సుకుమార్ ఇంత సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారు అంటూ అదేదో గూస్ బంప్స్ తెప్పించే వ్యవహారమే అయి ఉంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.