రాజమౌళి కోసం అది వదిలేసిన సుకుమార్, ఇంత అభిమానమా.. షాకింగ్ అండ్ వైరల్
పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఏం చేసిన అందులో వైవిధ్యం ఉంటుంది. సుకుమార్, రాజమౌళి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. తరచుగా ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తూనే ఉన్నాం.

యావత్ దేశం పులకరించిపోయే అరుదైన మైలురాయికి ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ తుది నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా ఆర్ఆర్ఆర్ చిత్రం ఫారెన్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకి ఆస్కార్ నామినేషన్ దక్కడంతో అవార్డు కూడా గెలిచేయాలని ప్రతి ఒక్కరూ విష్ చేస్తున్నారు.
పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఏం చేసిన అందులో వైవిధ్యం ఉంటుంది. సుకుమార్, రాజమౌళి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. తరచుగా ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో తన ఫేవరెట్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరని జక్కన్న పలు సందర్భాల్లో తెలిపిన సంగతి తెలిసిందే.
నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ కి నామినేట్ కావడంతో సుకుమార్ రాజమౌళికి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పాడు. రాజమౌళిపై మరోసారి తన అభిమానం చాటుకున్నారు. ఓ స్పెషల్ పిక్ ని పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ' ఇన్నేళ్ళుగా నా టీమ్ మీటింగ్స్, చర్చల్లో ఉన్నప్పుడు ఆ కుర్చీని అనుకోకుండా ఖాళీగా వదిలేసేవాడిని.
కానీ ఆ ప్రిన్సిపాల్ కుర్చీని నేను ఎందుకు వదిలేశానో ఇప్పుడు అర్థం అయింది. రాజమౌళి సార్ ఆ కుర్చీ మీ కోసమే. ఆ కుర్చీ, ఆ స్థానం ఎప్పటికీ మీదే అంటూ సుకుమార్ ఓ ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో డిస్కషన్ రూమ్ లో పుష్ప టీంతో సుకుమార్ ఉన్నారు. ఈ రూమ్ లో లీడర్ లేదా అధ్యక్షుడు కూర్చునే స్థానం ఖాలీగా ఉంది. అది రాజమౌళిదే అని అర్థం వచ్చేలా సుకుమార్ ఈ పోస్ట్ చేశారు.
నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ కి నామినేట్ కావడం పట్ల సుకుమార్ రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజమౌళిపై సుకుమార్ కి ఇంత అభిమానమా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సుకుమార్ కూడా టాలీవుడ్ లో టాప్ డైరెక్టరే. పుష్ప తో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. కానీ ఏమాత్రం ఇగో ఫీలింగ్స్ లేకుండా అగ్రస్థానం జక్కన్నదే అని సుకుమార్ చెప్పడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.