- Home
- Entertainment
- `పుష్ప`ని సినిమాగా తీయాలనుకోలేదా?.. సుకుమార్ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?.. బన్నీ ఏం చేశాడంటే? తెరవెనుక కథ
`పుష్ప`ని సినిమాగా తీయాలనుకోలేదా?.. సుకుమార్ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?.. బన్నీ ఏం చేశాడంటే? తెరవెనుక కథ
ఇండియన్ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్న ప్రతిష్టాత్మక మూవీస్‌లో `పుష్ప2` ఒకటి. అయితే మొదట ఈ సినిమాని సుకుమార్ సినిమాగా చేయాలనుకోలేదట. మరి ఏమనుకున్నాడు, ఏం జరిగిందంటే?

అల్లు అర్జున్ నటించిన `పుష్ప` మూవీ పెద్ద విజయం సాధించింది. మొదట మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగులో ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. సినిమా కష్టమే అన్నారు. కానీ రెండు మూడు రోజుల్లో లెక్కలన్నీ మారిపోయాయి. దర్శకుడు సుకుమార్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. నెమ్మదిగా ఆడియెన్స్ కి ఎక్కింది. అయితే ఇది సౌత్ కంటే నార్త్, ఓవర్సీస్ ఆడియెన్స్ కి బాగా ఎక్కింది. దీంతో సినిమాపెద్ద విజయం సాధించింది. ఏకంగా 350కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నిర్మాతలకే షాకిచ్చింది.
`పుష్ప` పెద్ద హిట్ కావడంతో `పుష్ప2`పై అంచనాలు ఏర్పడ్డాయి. అవి రాను రాను మరింత పెరిగాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనే కాదు గ్లోబల్ ఆడియెన్స్ కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇందులోని పాటలు, బన్నీ మ్యానరిజం, డైలాగులు ఆ స్థాయిలో ఇతర భాషల ఆడియెన్స్ కి కూడా రీచ్ అయ్యాయి. దీన్ని అదే రేంజ్‌లో రూపొందిస్తున్నారు సుకుమార్.
ఈ మూవీకి సంబంధించిన ఓ షాకింగ్ విషయం వైరల్ అవుతుంది. `పుష్ప` ఎలా ప్రారంభమైందో తెలిపారుసుకుమార్. మొదట ఆయన దీన్ని సినిమాగా చేయాలనుకోలేదట. ఆయన ఈ కథపై చాలా రీసెర్చ్ చేశాడట. చాలా పార్ట్ గా తీయాలనుకున్నాడు. అందుకు వెబ్ సిరీస్ అయితేబెటర్ అని భావించారు. ఆ రకంగానే ఆయన స్క్రిప్ట్ రాసుకుంటూ వచ్చాడట.
అయితే అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనే కమిట్ మెంట్ ఉంది.ఏం చేయాలనుకున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందట. దీంతో ఈ కథకి బ్యాక్ డ్రాప్ ఏదైనా బాగుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ యాడ్ అయ్యిందట. అలా ఈ కథ మూవీలా మారిందని తెలిపారు సుకుమార్. `పుష్ప` టైమ్‌లో పాల్గొన్న ప్రమోషన్స్ లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మొత్తంగా సంచలనంగా మారిన `పుష్ప` తెరవెనుక కథ పెద్దగానే ఉంది. దీన్ని వెబ్ సిరీస్‌గా చేసి ఉంటే ఈ స్థాయిలో రీచ్ అయ్యేది కాదు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయ్యేది కాదు. బన్నీ ఎంట్రీతో సినిమా లెక్కలన్నీ మారిపోయాయని చెప్పొచ్చు. ఇక ఈ మూవీని కూడా ఒకటి రెండు పార్ట్ లతో కాదు, చాలా భాగాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవల బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ బన్నీ ఇదే విషయాన్ని తెలిపారు. మూడో పార్ట్ కూడా ఉంటుందన్నారు. చూస్తుంటే ఇంకాచాలా భాగాలుగానే ఈ మూవీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
ఇక ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆ మధ్యనే ఇంటర్వెల్‌లో వచ్చే జాతర ఎపిసోడ్ షూట్ చేశారట. ఇప్పుడు పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత జపాన్‌లో షూటింగ్ చేసే అవకాశం ఉంది. అది క్లైమాక్స్ ఎపిసోడ్ అని తెలుస్తుంది. ఇక ఈ మూవీని ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ రావు రమేష్ నటిస్తున్నారు. అలాగే క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది.